...
...
Next Story

View Movie: నేను నిర్మాతను అయ్యానంటే కారణం ఆ డైరెక్టరే, ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీతో వస్తున్నా: వ్యూ ప్రొడ్యూసర్ సత్య చౌదరి

Producer Sathya Chowdary Speech View Pre Release Event: టాలీవుడ్ నటి పూజా రెడ్డి కీ రోల్‌లో నటించిన లేటెస్ట్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా వ్యూ. రేపు విడుదల కానున్న వ్యూ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఇటీవల నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో నిర్మాత సత్య చౌదరి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు.

Published on: Nov 19, 2026, 11:44:48 IST
Advertisement

Producer Sathya Chowdary Speech View Pre Release Event: టాలీవుడ్ బ్యూటీ పూజా రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన సినిమా "వ్యూ". ఈ సినిమాకు ది పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ట్యాగ్ లైన్. వ్యూ సినిమాలో ప్రదీప్, సోనియా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాస్టర్ కార్తికేయ సమర్పణలో పరవాణి చలనచిత్ర, ప్రచుర కాంటెంట్ అగ్రిగేటర్స్ బ్యానర్స్ పై సత్య చౌదరి నిర్మించారు.

వ్యూ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

నేను నిర్మాతను అయ్యానంటే కారణం ఆ డైరెక్టరే, ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీతో వస్తున్నా: వ్యూ ప్రొడ్యూసర్ సత్య చౌదరి
నేను నిర్మాతను అయ్యానంటే కారణం ఆ డైరెక్టరే, ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీతో వస్తున్నా: వ్యూ ప్రొడ్యూసర్ సత్య చౌదరి

వ్యూ సినిమాకు మహేశ్ కాంపెల్లి దర్శకత్వం వహించారు. వ్యూ సినిమాను ఈ నెల 20న అంటే రేపు శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా బాపిరాజు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా ఇటీవల మంగళవారం (నవంబర్ 17) సాయంత్రం హైదరాబాద్‌లో వ్యూ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నటి సోనియా మాట్లాడుతూ.. "మా మూవీ ట్రైలర్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నేను ఎన్నో ఆడిషన్స్‌కు వెళ్లాను. మంచి అవకాశం కోసం చూస్తున్న టైమ్‌లో వ్యూ సినిమాలో ఆఫర్ దక్కింది. ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన మా డైరెక్టర్, ప్రొడ్యూసర్ కు థ్యాంక్స్" అని అన్నారు.

ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలని

"ఒక మంచి క్యారెక్టర్‌లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటానని నమ్ముతున్నా. చిత్ర పరిశ్రమలో కెరీర్ ఎంచుకునేందుకు నన్ను ఎంకరేజ్ చేసిన మా పేరెంట్స్‌కు థ్యాంక్స్. మా వ్యూ మూవీని ప్రతి ఒక్కరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా" అని సోనియా ఆకాంక్షించారు.

యాక్టర్ ప్రదీప్ మాట్లాడుతూ.. "వ్యూ సినిమా నాకు ఫస్ట్ మూవీ. ఈ చిత్రంలో నటించే క్రమంలో డైరెక్టర్ మహేశ్ గారు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. ఆయన సపోర్ట్‌తో నా క్యారెక్టర్‌ను బాగా పర్‌ఫార్మ్ చేశానని నమ్ముతున్నాను. కొత్త తరహా కంటెంట్‌తో మిమ్మల్ని ఆద్యంతం ఆకట్టుకునేలా మా సినిమా ఉండబోతోంది. ఈ నెల 20న థియేటర్స్‌కు వెళ్లి మా సినిమా చూడాలని కోరుతున్నా" అని కోరారు.

ఇలాంటి స్ట్రాంగ్ రోల్ దక్కడం

ప్రొడ్యూసర్ సత్య చౌదరి మాట్లాడుతూ.. "నేను ఈ సినిమా చేసి ప్రొడ్యూసర్‌గా మీ ముందు ఉన్నానంటే కారణం మా డైరెక్టర్ మహేశ్. ప్రతి క్రాఫ్ట్‌ను ఆయనే దగ్గరుండి చూసుకుంటూ మంచి సినిమా చేశాడు. మా బాపిరాజు గారు సినిమాను రిలీజ్ చేసేందుకు రావడం సంతోషంగా ఉంది" అని అన్నారు.

నన్ను ఆదరించింది కళామతల్లి

"శ్రీ లక్ష్మీ పిక్చర్స్, ప్రచుర కంటెంట్ అగ్రిగేటర్స్ బ్యానర్స్ నాకు సపోర్ట్‌గా నిలిచాయి. నన్ను ఆదరించింది కళామతల్లి. ఆ తల్లి ఆదరణకు కృతజ్ఞతగా ఒక మంచి ఫీమేల్ ఒరియెంటెడ్ మూవీ చేశాను. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా. మీ ఫ్యామిలీతో కలిసి మా సినిమాను చూడండి" అని నిర్మాత సత్య చౌదరి తెలిపారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks