Ramayana Collection: 1500 కోట్లు దాటేసిన రామాయణం- ధురంధర్ 2 లైఫ్‌టైమ్ కలెక్షన్స్ అవుట్- నిర్మాత నమిత్ ఏమన్నారంటే?
Ramayana Box Office Collection Day 14: నితేష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ నటించిన రామాయణం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. విడుదలైన 14 రోజుల్లోనే ఇండియాలో రూ.844.40 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన రామాయణం రణ్వీర్ సింగ్ ధురంధర్ 2 లైఫ్‌టైమ్ కలెక్షన్స్‌ను దాటేసింది.
Ramayana 14 Days Worldwide Collection: భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన 'రామాయణం' బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. నితేష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరోయిన్ సాయి పల్లవి సీతగా, 'కేజీఎఫ్' స్టార్ యశ్ రావణుడిగా నటించిన ఈ చిత్రం థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది.

840 కోట్ల కలెక్షన్స్
రెండో వారంలో రోజువారీ వసూళ్లు కాస్త నెమ్మదించినా, తాజాగా రామాయణం సినిమా మరో భారీ మైలురాయిని దాటింది. దేశవ్యాప్తంగా రూ.840 కోట్ల మార్కును అధిగమించి గతంలో సంచలనం సృష్టించిన 'ధురంధర్' సినిమా లైఫ్‌టైమ్ నెట్ కలెక్షన్లను వెనక్కి నెట్టింది.
14వ రోజు వసూళ్ల లెక్కలివే..
ప్రముఖ బాక్సాఫీస్ ట్రాకింగ్ సంస్థ నివేదిక ప్రకారం, 'రామాయణం' విడుదలైన 14వ రోజు దేశవ్యాప్తంగా రూ.23.20 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. దీపావళి సెలవుల తర్వాత సాధారణ పనిదినాల్లోనూ ఈ స్థాయి కలెక్షన్లు రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
దేశవ్యాప్తంగా 21,215 షోల ద్వారా ఈ వసూళ్లు నమోదయ్యాయి. దీంతో రెండు వారాలు పూర్తయ్యేసరికి భారత్‌లో రామాయణం సినిమా మొత్తం నెట్ వసూళ్లు రూ.844.40 కోట్లకు, గ్రాస్ కలెక్షన్స్ రూ. 1000 కోట్లకు చేరాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ సాయి పల్లవి, యశ్ క్రేజ్ తోడవడంతో మల్టీప్లెక్సులతో పాటు సింగిల్ స్క్రీన్లలోనూ కుటుంబ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు.
మరోవైపు, మార్చి 19న విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన రణ్వీర్ సింగ్ చిత్రం 'ధురంధర్: ది రివేంజ్' 14వ రోజు రూ.20.10 కోట్లు వసూలు చేసింది. ఆ సినిమా తొలి రెండు వారాల్లో భారత్‌లో రూ.919.52 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. రెండో వారం బుధవారం (నవంబర్ 18) వసూళ్ల విషయంలో 'రామాయణం' ఆ చిత్రాన్ని సైతం దాటేయడం విశేషం.
హాలీవుడ్ స్థాయి విజువల్ వండర్: నమిత్ మల్హోత్రా
ఇక రామాయణం సినిమాకు వరల్డ్ వైడ్‌గా 14 రోజుల్లో రూ. 1519.05 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అలాగే, ఓవర్సీస్లో 510 కోట్లు కొల్లగొట్టింది రామాయణం సినిమా.
ఇప్పటికే ఎన్నో రామాయణాలు వచ్చాయి కదా, మళ్లీ ఈ కథను ఎందుకు తెరకెక్కిస్తున్నారన్న ప్రశ్నలకు చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా ఇటీవల పీటీఐ (PTI) వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టమైన సమాధానం ఇచ్చారు.
"భారత్‌లో చాలామందికి ఈ కథ తెలుసు. కానీ ఇంతకుముందు ఏ టీవీ సీరియల్, వీధి నాటకం లేదా రామ్ లీలా చూపించని అద్భుతమైన స్థాయిలో, కనీవినీ ఎరుగని దృశ్యకావ్యంగా రామాయణాన్ని చూపించాలన్నదే మా ఆశయం. అవతార్, అవెంజర్స్, స్పైడర్ మ్యాన్ లేదా ది ఒడిస్సీ తరహాలో ప్రపంచ స్థాయి విజువల్ వండర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దాం" అని నమిత్ మల్హోత్రా పేర్కొన్నారు.
భారీ విజువల్ సినిమాలను ఆదరిస్తారు
భారతీయ సినిమాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న తమ లక్ష్యం గురించి ఆయన మరింత లోతుగా వివరించారు. "పాశ్చాత్య ప్రేక్షకులు భారీ విజువల్ సినిమాలను ఎంతో ఆదరిస్తారు. మన దగ్గర 'బాహుబలి', 'ధురంధర్' వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అయితే హాలీవుడ్ ఊహించే భారీ విజువల్ హంగులకు, మన సినిమాలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించే ప్రయత్నం మేము చేస్తున్నాం" అని నమిత్ మల్హోత్రా అన్నారు.
"హాలీవుడ్ చేయగలిగినది మేమూ చేయగలమని, అంతకంటే గొప్పగా నిర్మించగలమని ప్రపంచానికి చాటిచెప్పాలన్నదే మా ఉద్దేశం" అని నమిత్ చెప్పుకొచ్చారు. రాజమౌళి 'బాహుబలి' తర్వాత భారతీయ ఇతిహాసాలకు ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఆదరణను 'రామాయణం' మరింత ముందుకు తీసుకెళ్తోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


