Ramayana Collection: 1200 కోట్లు దాటేసిన రామాయణం- ఆ సినిమాల 10 రోజుల రికార్డ్ బ్రేక్- కానీ, ధురంధర్ 2 కంటే వెనుకే!

Ramayana Box Office Collection Day 10: రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ నటించిన రామాయణం కలెక్షన్లలో రికార్డుల వేట కొనసాగిస్తోంది. విడుదలైన 9 రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ చిత్రం 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 1228 కోట్లు వసూలు చేసి 'బాహుబలి 2', 'ఆర్ఆర్ఆర్' రికార్డులను అధిగమించింది.

Published on: Nov 15, 2026, 17:59:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Ramayana 10 Days Worldwide Collections: దీపావళి కానుకగా నవంబర్ 5న థియేటర్లలోకి అడుగుపెట్టిన 'రామాయణ' బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందిన ఈ పౌరాణిక దృశ్యకావ్యం విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

1200 కోట్లు దాటేసిన రామాయణం- ఆ సినిమాల 10 రోజుల రికార్డ్ బ్రేక్- కానీ, ధురంధర్ 2 కంటే వెనుకే!
1200 కోట్లు దాటేసిన రామాయణం- ఆ సినిమాల 10 రోజుల రికార్డ్ బ్రేక్- కానీ, ధురంధర్ 2 కంటే వెనుకే!

9 రోజుల్లోనే వెయ్యి కోట్లు

శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా తెలుగు ప్రేక్షకుల అభిమాన నటి సాయి పల్లవి, రావణుడిగా కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటనకు దేశవిదేశాల్లో బ్రహ్మరథం పడుతున్నారు. ఫలితంగా ఈ సినిమా విడుదలైన కేవలం 9 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల మైలురాయిని దాటి సరికొత్త చరిత్ర లిఖించింది.

అంతర్జాతీయ మార్కెట్లలో 'రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్' పేరుతో విడుదలైన ఈ చిత్రం, రెండు భాగాల సిరీస్‌లో మొదటిది. రెండో భాగం 2028లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు రాష్ట్రాల్లో సాయి పల్లవి, యశ్‌లకు ఉన్న విపరీతమైన క్రేజ్ కారణంగా ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు భారీ వసూళ్లు దక్కుతున్నాయి. కుటుంబ సమేతంగా థియేటర్లకు తరలివస్తున్న ప్రేక్షకులతో మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్‌లు కళకళలాడుతున్నాయి.

పదో రోజు వసూళ్ల వర్షం.. రూ.1228 కోట్లకు చేరిన కలెక్షన్లు

ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ సంస్థ వెల్లడించిన గణాంకాల ప్రకారం, రెండో శనివారం (పదో రోజు) కూడా 'రామాయణ' జోరు ఏమాత్రం తగ్గలేదు. పదో రోజు దేశవ్యాప్తంగా 23,451 షోల ద్వారా ఈ చిత్రం రూ.72.90 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది రామాయణం సినిమా.

దీంతో భారతదేశంలో రామాయణ సినిమా మొత్తం గ్రాస్ కలెక్షన్ రూ. 819.50 కోట్లకు చేరింది. ఇక విదేశీ మార్కెట్లలో అదనంగా రూ.30 కోట్లు రాబట్టడంతో, ఓవర్సీస్ గ్రాస్ రూ.408.50 కోట్లకు పెరిగింది. ఇక కేవలం పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 'రామాయణ' సినిమా రూ. 1228 కోట్ల భారీ వసూళ్లను తన ఖాతాలో వేసుకుంది.

'బాహుబలి 2', 'ఆర్ఆర్ఆర్' రికార్డులు బద్దలు.. కానీ 'ధురంధర్ 2' కంటే వెనుకే!

అత్యంత వేగంగా వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన భారతీయ చిత్రాల జాబితాలో 'రామాయణ' అగ్రశ్రేణి సినిమాలను వెనక్కి నెట్టింది. మన తెలుగు ఇండస్ట్రీ గర్వకారణమైన 'బాహుబలి 2' వెయ్యి కోట్లు సాధించడానికి 10 రోజులు తీసుకోగా, రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'కు 16 రోజులు, యశ్ 'కేజీఎఫ్ 2'కు 18 రోజులు పట్టాయి.

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ చిత్రాలైన 'జవాన్' (18 రోజులు), 'పఠాన్' (27 రోజులు) రికార్డులను సైతం 'రామాయణ' అలవోకగా దాటేసింది. అయితే, ఆల్ టైమ్ ఫాస్టెస్ట్ రికార్డు విషయంలో అల్లు అర్జున్ 'పుష్ప 2: ది రూల్', రణవీర్ సింగ్ 'ధురంధర్: ది రివెంజ్' (ధురంధర్ 2) మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

ఈ రెండు చిత్రాలు కేవలం 7 రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్కును అందుకున్నాయి. మరోవైపు, పది రోజుల ప్రపంచవ్యాప్త బాక్సాఫీస్ రేసులో ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్: ది రివెంజ్' ఇప్పటికీ అగ్రస్థానంలోనే ఉంది. పదో రోజు ముగిసేసరికి 'ధురంధర్ 2' ప్రపంచవ్యాప్తంగా రూ.1255.41 కోట్లు వసూలు చేసి, 'రామాయణ' కంటే స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది. రానున్న రోజుల్లో 'రామాయణ' ఈ రికార్డును అధిగమిస్తుందో లేదో చూడాలి.

అంతర్జాతీయ వేదికపై అరుదైన గౌరవం.. ఇఫీ 2026లో తొలి ప్రదర్శన

బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడమే కాకుండా, ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలోనూ 'రామాయణ' అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. గోవా వేదికగా నవంబర్ 20న ప్రారంభం కానున్న 57వ 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా' (IFFI 2026)లో బ్రిక్స్ (BRICS) విభాగంలో ప్రదర్శించే తొలి చిత్రంగా 'రామాయణం' ఎంపికైంది.

కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. బ్రిక్స్ కూటమిలోని 11 సభ్య దేశాలతో పాటు భాగస్వామ్య దేశాలకు చెందిన ఉత్తమ చిత్రాలను ఈ విభాగంలో ప్రదర్శిస్తారు.

ప్రపంచ స్థాయిలో మరో మెట్టు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న విభిన్న కథనాలు, సినిమా శైలులను భారతీయ ప్రేక్షకులకు పరిచయం చేయడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఒకవైపు రికార్డు స్థాయి వసూళ్లు, మరోవైపు అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రత్యేక గుర్తింపుతో 'రామాయణ' భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో మరో మెట్టు పైకి తీసుకెళ్లింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More