మూడేళ్ల గ్యాప్ తర్వాత నందు హీరోగా వచ్చిన సినిమా ‘సైక్ సిద్ధార్థ’. ఓ వైపు సినిమాల్లో క్యారెక్టర్లు చేస్తూనే, మరోవైపు హీరోగా తన కెరీర్ నిర్మించుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు నందు. ఈటీవీలో వస్తున్న ఢీషోలో యాంకర్ గానూ ఆడియన్స్ కు చేరువయేందుకు ట్రై చేస్తున్నాడు. అతని లేటెస్ట్ మూవీ సైక్ సిద్ధార్థ ఒక రోజు ముందే ఓటీటీలోకి వచ్చేసింది.
సైక్ సిద్ధార్థ ఓటీటీ

నందు, యామిని భాస్కర్, ప్రియాంక రెబకా తదితరులు నటించిన మూవీ సైక్ సిద్ధార్థ. న్యూ ఇయర్ స్పెషల్ గా జనవరి 1, 2026న థియేటర్లలో రిలీజైంది ఈ మూవీ. సురేష్ ప్రొడక్షన్ సంస్థ రిలీజ్ చేయడంతో కాస్త హైప్ వచ్చినా రిజల్ట్ మాత్రం పాజిటివ్ గా లేదు. ఇప్పుడీ మూవీ ఆహా వీడియో ఓటీటీలోకి ఇవాళ (ఫిబ్రవరి 3) వచ్చేసింది.
ఒక రోజు ముందుగానే
నిజానికి సైక్ సిద్ధార్థ ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిబ్రవరి 4 అని మేకర్స్ ముందే అనౌన్స్ చేశారు. అయితే ఒక రోజు ముందు నుంచే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. కానీ ఈ స్పెషల్ స్ట్రీమింగ్ ఆహా గోల్డ్ సబ్ స్క్రైబర్లకు మాత్రమే. ఈ రోజు ఆ సబ్ స్క్రైబర్లు మాత్రమే ఓటీటీలో సైక్ సిద్ధార్థ సినిమాను చూసే అవకాశం ఉంటుంది. బుధవారం నుంచి ఈ ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ఉన్న అందరూ సైక్ సిద్ధార్థను చూడొచ్చు.
9.3 ఐఎండీబీ
సైక్ సిద్ధార్థ సినిమాకు 9.3 ఐఎండీబీ రేటింగ్ ఉండటం విశేషం. ఈ చిత్రంలో నందు, యామిని భాస్కర్, ప్రియాంక రెబకా, సింహా, సుఖేష్ రెడ్డి తదితరులు నటించారు. ఈ మూవీకి వరుణ్ రెడ్డి డైరెక్టర్. నందు, రానా దగ్గుబాటి కలిసి నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్ రిలీజ్ చేసింది.
సైక్ సిద్ధార్థ స్టోరీ
వనవీర, దండోరా లాంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూనే మరోవైపు హీరోగానూ మూవీస్ చేస్తున్నాడు నందు. అయితే 2022లో వచ్చిన బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత నందు హీరోగా చేసిన సినిమా సైక్ సిద్ధార్థ. మోసపోయిన ఓ యువకుడి క్యారెక్టర్ ఎలా ఉంటుందనేది ఇందులో ఎక్స్ ట్రీమ్ గా చూపించారు.
{{/usCountry}}వనవీర, దండోరా లాంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూనే మరోవైపు హీరోగానూ మూవీస్ చేస్తున్నాడు నందు. అయితే 2022లో వచ్చిన బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత నందు హీరోగా చేసిన సినిమా సైక్ సిద్ధార్థ. మోసపోయిన ఓ యువకుడి క్యారెక్టర్ ఎలా ఉంటుందనేది ఇందులో ఎక్స్ ట్రీమ్ గా చూపించారు.
{{/usCountry}}త్రిష (ప్రియాంక)ను ప్రేమిస్తాడు సిద్ధార్థ. త్రిష, సిద్ధార్థ.. మన్సూర్ (సుఖేష్ రెడ్డి)తో కలిసి ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ స్టార్ట్ చేస్తారు. ఇందులో రూ.2 కోట్ల ఇన్వెస్ట్ మెంట్ పూర్తిగా సిద్ధార్థనే పెడతాడు. అయితే మన్సూర్, త్రిష లవ్ చేసుకుని సిద్ధార్థను మోసం చేస్తారు.
కోట్లు కోల్పోయిన సిద్ధార్థ ఓ బస్తీలో చిన్న రూమ్ లో రెంట్ కు ఉంటూ సైక్ సైక్ చేస్తుంటాడు. అప్పుడే భర్త టార్చర్ భరించలేక అదే బిల్డింగ్ లోకి కొడుకుతో కలిసి రెంట్ కు వచ్చిన శ్రావ్య (యామిని భాస్కర్) సిద్ధార్థకు పరిచయమవుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందన్నది సైక్ సిద్ధార్థ మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.