విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న సినిమా నుంచి అదిరిపోయే సర్ ప్రైజ్ వచ్చింది. ఇవాళ (జనవరి 16) విజయ్ సేతుపతి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, హీరో ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. టైటిల్, ఫస్ట్ లుక్ అదిరిపోయాయి. టైటిల్ డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు పూరి.
స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్

హీరోల గెటప్ పూర్తిగా ఛేంజ్ చేసి, కొత్తగా చూపించడంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ ను కొట్టేవాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. ఆయన చేతిలో పడితే ఎలాంటి హీరో మేకోవర్ అయినా మారాల్సిందే. ఇక సినిమా టైటిల్స్ ను ట్రెండీగా, క్యాచీగా పెట్టడంలోనూ పూరీ తర్వాతే ఎవరైనా. ఇప్పుడు విజయ్ సేతుపతితో తీస్తున్న సినిమాకు ‘స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్’ అనే టైటిల్ డిసైడ్ చేశాడు పూరి.
విజయ్ సేతుపతి లుక్
హీరోగా, తండ్రిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా.. ఇలా డిఫరెంట్ పాత్రలు చేస్తూ విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు విజయ్ సేతుపతి. పూరి జగన్నాథ్ తో చేస్తున్న సినిమాలో అతను మునుపెన్నడూ కనిపించని కొత్త లుక్ లో దర్శనమిచ్చాడు. స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ సినిమా నుంచి శుక్రవారం విజయ్ బర్త్ డే సందర్భంగా అతని ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ లుక్ వేరే లెవల్ ఉంది.
ఎవరూ ఆపలేని
‘‘మురికి వాడల నుంచి ఎవరూ ఆపలేని స్టార్మ్ పుట్టుకొచ్చింది. రా, రూత్ లెస్, రియల్. పూరిసేతుపుతి సినిమా పేరు స్లమ్ డాగ్- 33 టెంపుల్ రోడ్. హ్యాపీ బర్త్ డే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో సినిమా రిలీజ్ అవుతుంది’’ అని పూరి కనెక్ట్స్ ఎక్స్ లో పోస్టు చేసింది.
{{/usCountry}}‘‘మురికి వాడల నుంచి ఎవరూ ఆపలేని స్టార్మ్ పుట్టుకొచ్చింది. రా, రూత్ లెస్, రియల్. పూరిసేతుపుతి సినిమా పేరు స్లమ్ డాగ్- 33 టెంపుల్ రోడ్. హ్యాపీ బర్త్ డే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో సినిమా రిలీజ్ అవుతుంది’’ అని పూరి కనెక్ట్స్ ఎక్స్ లో పోస్టు చేసింది.
{{/usCountry}}బిచ్చగాడి క్యారెక్టర్
స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ సినిమాలో విజయ్ సేతుపతి బిచ్చగాడి క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడని తెలిసింది. టైటిల్ ను బట్టి చూస్తే హీరో స్లమ్ లో ఉంటాడనేది స్పష్టమైంది. ఫస్ట్ లుక్ లో కళ్లకు అద్దాలతో, చేతిలో రక్తమోడుతున్న కత్తితో కనిపించాడు విజయ్ సేతుపతి.
కళ్లకు నల్లటి అద్దాలు పెట్టుకున్న విజయ్ సేతుపతి స్ట్రెయిట్ గా కాకుండా పక్కకు చూస్తున్నాడు. దీన్ని బట్టి ఈ మూవీలో విజయ్ సేతుపతి అంధుడిగా నటిస్తున్నాడనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ లో భారీగా డబ్బు కూడా ఉంది. ఇదో భారీ దొంగతనం నేపథ్యంలో సాగే కథ అనే టాక్ వినిపిస్తోంది.
హిట్ కోసం
పూరి జగన్నాథ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కాస్త ఫర్వాలేదనిపించింది. కానీ ఆ తర్వాత లైగర్, డబుల్ ఇస్మార్ట్ తో గట్టి దెబ్బలు తిన్నాడు పూరి జగన్నాథ్. ఇప్పుడు విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ అయిపోయింది. మరి ఈ మూవీతోనైనా పూరి హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.