...
...
Next Story

హైదరాబాద్ నడిబొడ్డున 8 కొత్త సినిమా స్క్రీన్లు.. సీటింగ్ కెపాసిటీ 1,402!

సినిమా లవర్స్‌కు గుడ్‌న్యూస్. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద మరో 8 కొత్త సినిమా స్క్రీన్లు ప్రారంభించారు. మెుత్తం 1402 సిటింగ్ కెపాసిటీతో ప్రారంభమయ్యాయి.

Published on: Feb 5, 2026, 13:45:52 IST
Advertisement

హైదరాబాద్ నగరంలో సినిమా అనగానే.. చాలా మందికి ఆర్టీసీ ఎక్స్ రోడ్డు గుర్తుకువస్తుంది. ఇక్కడ సినిమా టాక్‌ ఆధారంగా మూవీ హిట్టా ఫట్టా డిసైడ్ అయిపోతారు. అలాంటి ఆర్టీసీ ఎక్స్ రోడ్లలోని ఓడియన్ మాల్‌లో సరికొత్త పీవీఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్స్ ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని సినిమా లవర్స్‌కు మరింత ఊపునివ్వనుంది. కొత్తగా ప్రారంభించిన ఈ 8 స్క్రీన్లలో మొత్తం 1,402 సీట్ల సామర్థ్యం కలిగి ఉన్నాయి. సిటీలో ఎంటర్టైన్‌మెంట్‌కు మరో అడ్డగా తయారుకానుంది.

హైదరాబాద్‌లో కొత్త సినిమా స్క్రీన్లు
హైదరాబాద్‌లో కొత్త సినిమా స్క్రీన్లు

ఈ తాజా ప్రారంభంతో హైదరాబాద్‌లో 19వ పీవీఆర్ ఐనాక్స్ ప్రారంభమైనట్టు. దీనితో నగరంలో ఐనాక్స్ మొత్తం స్క్రీన్‌ల సంఖ్య 119కి చేరుకుంది. బుధవారం రాత్రి నుంచి ఓడియన్ మాల్‌లో పీవీఆర్ కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రీమియం వ్యూ అనుభవం కోసం రూపొందించిన ఈ మల్టీప్లెక్స్‌లో ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన ఎనిమిది స్క్రీన్లు ఉన్నాయి.

రెండు 4K ప్రొజెక్టర్లు, లేజర్ ఫాస్ఫర్ ప్రొజెక్టర్‌తో సహా అధునాతన ప్రొజెక్షన్ వ్యవస్థలతో అమర్చారు. అత్యుత్తమ బ్రైట్‌నెస్, స్పష్టతను అందిస్తుంది. డాల్బీ అట్మాస్, DTS:X, నెక్స్ట్-జెన్ 3D టెక్నాలజీ ధ్వని, దృశ్యాలతో అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి. కొత్తగా ప్రారంభించిన వాటితో పీవీఆర్ ఐనాక్స్ నెట్‌వర్క్‌ను భారతదేశం, శ్రీలంక అంతటా 1,791 స్క్రీన్‌లకు విస్తరించింది.

ఓడియన్ మాల్‌లో ఈ స్క్రీన్‌లతోపాటుగా రాబోయే గేమింగ్ జోన్ మొత్తం అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. ఫ్యామిలీలు, యూత్‌కు వినోదం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్.. భారతదేశంలోని అత్యంత సినిమా మక్కువ ఉన్న మార్కెట్లలో ఒకటి అని పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ బిజ్లి చెప్పారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks