Raakaasa Collections: రాకాసకు సూపర్ హిట్ టాక్- 10.30 కోట్ల కలెక్షన్స్- 24 గంటల్లో అమ్ముడుపోయిన 60 వేల టికెట్స్!

Raakaasa Movie Box Office Collections: మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన లేటెస్ట్ హారర్ కామెడీ ఫాంటసీ సినిమా రాకాస. సంగీత్ శోభన్, నయన్ సారిక హీరో హీరోయిన్లుగా చేసిన ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఫలితంగా రూ. 10.30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది రాకాస చిత్రం.

Published on: Apr 6, 2026, 11:20:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నిర్మాతగా వరుసపెట్టి సినిమాలతో దూసుకుపోతోంది మెగా డాటర్ నిహారిక కొణిదెల. ఇటీవల నిహారిక కొణిదెల నిర్మించిన లేటెస్ట్ తెలుగు ఫిల్మ్ రాకాస. జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి నిహారిక నిర్మించిన సినిమానే రాకాస.

రాకాసకు సూపర్ హిట్ టాక్- 10.30 కోట్ల కలెక్షన్స్- 24 గంటల్లో అమ్ముడుపోయిన 60 వేల టికెట్స్!
రాకాసకు సూపర్ హిట్ టాక్- 10.30 కోట్ల కలెక్షన్స్- 24 గంటల్లో అమ్ముడుపోయిన 60 వేల టికెట్స్!

ఓటీటీ సిరీసులుతో

పలు ఓటీటీ సిరీసులతో పేరు తెచ్చుకున్న మానస శర్మ రాకాస చిత్రానికి దర్శకత్వం వహించారు. కామెడీతో ఎంటర్టైన్ చేసే సంగీత్ శోభన్ సోలో హీరోగా నటించిన ఈ మూవీలో బ్యూటిపుల్ నయన్ సారిక హీరోయిన్‌గా చేసింది. హారర్ కామెడీ ఫాంటసీ సినిమాగా తెరకెక్కిన రాకాస చిత్రంలో హీరో హీరోయిన్లతోపాటు వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

సూపర్ హిట్ టాక్‌తో

గ్లింప్స్, టీజర్, ట్రైలర్‌తో అట్రాక్ట్ చేసిన రాకాస సినిమా గ్రాండ్‌గా ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదల అయింది. అప్పటి నుంచి రాకాస సినిమా సూపర్ హిట్ టాక్‌తో తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవర్‌సీస్‌లోనూ దూసుకెళ్తోంది. ఏపీ, తెలంగాణ‌లో శ్రీల‌క్ష్మీ న‌ర‌సింహా మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై విడుద‌లైన చిత్రాన్ని ఓవ‌ర్‌సీస్‌లో అథ‌ర్వ‌ణ భ‌ద్ర‌కాళి పిక్చ‌ర్స్ భారీ ఎత్తున రిలీజ్ అయింది.

రాకాస 2 రోజుల కలెక్షన్స్

డిఫ‌రెంట్ ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీతో ‘రాకాస’ సినిమాపై అనౌన్స్‌మెంట్ నుంచే అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. రెండు రోజుల్లోనే ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ.10.30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబ‌ట్ట‌టం విశేషం. శుక్ర‌, శనివారాల్లో సినిమాకు వ‌చ్చిన రెస్పాన్స్ ఆదివారానికి డ‌బుల్ అయింది.

24 గంటల్లో60 వేలకు పైగా టికెట్స్

24 గంట‌ల్లోనే 60 వేల‌కు పైగా టికెట్స్ సేల్ కావ‌టం రాకాస సినిమాపై ఉన్న పాజిటివ్ బ‌జ్‌కు నిద‌ర్శ‌న‌మ‌ని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. జీస్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి నిహారిక కొణిదెల సినిమాను రూపొందించిన తీరు, డైరెక్ట‌క‌ర్ మానస శర్మ టేకింగ్ స‌హా ఇత‌ర న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ పని తీరుని అంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు.

ప్రేక్షకుల మన్ననలు

నిర్మాత‌గా నిహారిక తన తొలి చిత్రం ‘క‌మిటీ కుర్రోళ్లు’తో బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను సాధించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు నిహారిక కొణిదెల. సంగీత్ శోభ‌న్ కామెడీ టైమింగ్‌, న‌య‌న్ సారిక గ్లామ‌ర్‌, గెట‌ప్ శ్రీను, బ్ర‌హ్మాజీ త‌దిత‌రులు ఎంట‌ర్‌టైన్ చేసిన విధానం ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పొందుతున్నాయి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More