Raakaasa: చిన్న సినిమాగా వచ్చిన రాకాస.. బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ గా నిలిచింది. ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ ఆడియన్స్ ను తెగ ఎంటర్ టైన్ చేస్తోంది. రాకాస సూపర్ హిట్ కావడంతో దీని సీక్వెల్ పై చర్చలు మొదలయ్యాయి. ఇదే విషయాన్ని డైరెక్టర్ మానస శర్మను అడిగితే ఆమె చెప్పిన ఆన్సర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రాకాస 2

రీసెంట్ గా రాకాస మూవీ డిస్ట్రిబ్యూటర్లు సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల, హీరో సంగీత్ శోభన్, డైరెక్టర్ మానస శర్మ పాల్గొన్నారు. ఈ క్రమంలో రాకాస 2 గురించి మానస శర్మకు విలేకర్ల నుంచి ప్రశ్న ఎదురైంది. దానికి ఆమె స్పందిస్తూ.. ‘‘రాకాస 2 కచ్చితంగా ఉంటుంది. స్టోరీ స్ట్రక్చర్ అయితే ఉంది. ఇంకొంచెం దాన్ని డిఫైన్ చేయాలి’’ అని మానస శర్మ తెలిపింది.
హీరో మారతాడా?
రాకాస సినిమాలో సంగీత్ శోభన్ హీరోగా నటించాడు. మరి రాకాస 2లో హీరో మారతాడా? అనే ప్రశ్నకు మానస శర్మ తెలివిగా సమాధానం చెప్పింది. కాలమే నిర్ణయిస్తుందని తెలిపింది. దీంతో పక్కనే ఉన్న సంగీత్ శోభన్, నిహారిక ఆశ్చర్యపోయారు. ఇప్పుడీ వీడియో తెగ వైరల్ గా మారింది. హీరోను కంటిన్యూ చేస్తామని లేదా మారుస్తామని డైరెక్ట్ గా చెప్పకుండా మానస శర్మ షాకింగ్ కామెంట్స్ చేసిందని అంటున్నారు.
రాకాస గురించి
చందమామ కథలాంటి సినిమాను నేటి జనరేషన్ కు తగ్గట్లుగా కామెడీ, హారర్ ఎలిమెంట్స్ యాడ్ చేసి మానస శర్మ తీసిన సినిమానే రాకాస. ఇందులో సంగీత్ శోభన్, నయన్ సారిక హీరో హీరోయిన్లు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నిహారిక కొణిదెల, ఉమేశ్ కుమార్ ఈ రాకాస మూవీని నిర్మించారు.
బ్లాక్ బస్టర్
{{/usCountry}}చందమామ కథలాంటి సినిమాను నేటి జనరేషన్ కు తగ్గట్లుగా కామెడీ, హారర్ ఎలిమెంట్స్ యాడ్ చేసి మానస శర్మ తీసిన సినిమానే రాకాస. ఇందులో సంగీత్ శోభన్, నయన్ సారిక హీరో హీరోయిన్లు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నిహారిక కొణిదెల, ఉమేశ్ కుమార్ ఈ రాకాస మూవీని నిర్మించారు.
బ్లాక్ బస్టర్
{{/usCountry}}హారర్ కామెడీ థ్రిల్లర్ గా వచ్చిన రాకాస బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏప్రిల్ 3న గ్రాండ్ గా రిలీజైన ఈ సినిమా ఇప్పటివరకు రూ.19 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలిసింది. ఈ సినిమాను రూ.15 కోట్ల బడ్జెట్ తో నిర్మించినట్లు సమాచారం. రాకాస మూవీలో గెటప్ శ్రీను, వెన్నెల కిశోర్ తో కలిసి సంగీత్ శోభన్ చేసిన కామెడీ అదిరిపోయింది.
రాకాస స్టోరీ
ఓ ఊరిలోని కోటలో బ్రహ్మ రాక్షసుడు ఉంటాడు. అతను బలి కోరినప్పుడల్లా గ్రామం నుంచి ఒక మనిషిని పంపించాలి. ఓ సారి తన ఫ్రెండ్ కు బదులుగా హీరో ఆ కోటలోకి వెళ్తాడు. అక్కడికి వెళ్లిన తర్వాత ఏం జరిగింది? ఆ రాక్షసుడి కథ ఏంటీ? అన్నది రాకాస సినిమాలో చూడాల్సిందే.