...
...
Next Story

Radhika Apte: వాళ్లకు తెల్లతోలు హీరోయిన్లే కావాలి.. అందుకే నార్త్ నుంచి.. ఫేవర్లు చేయాలి: సౌత్ డైరెక్టర్లపై రాధికా ఆప్టే

Radhika Apte: దక్షిణాది (సౌత్) చిత్ర పరిశ్రమపై నటి రాధికా ఆప్టే సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళం, తెలుగు భాషల్లో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ.. తెల్ల తోలు ఉన్న ఉత్తరాది నటీమణులకే దక్షిణాదిలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనే ఉద్దేశంతోనే తాను సౌత్ సినిమాలకు దూరంగా ఉన్నట్లు వెల్లడించారు.

Published on: Oct 28, 2026, 15:25:32 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Radhika Apte: భారతీయ చిత్ర పరిశ్రమలో విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ తనదైన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రాధికా ఆప్టే. సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన 'కబాలి', నందమూరి బాలకృష్ణ సరసన 'లయన్', అలాగే 'వెట్రి సెల్వన్' వంటి పలు దక్షిణాది చిత్రాలలో నటించి సౌత్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అయితే 2019లో వచ్చిన 'చిత్తిరం పేసుతాడి 2' చిత్రం తర్వాత ఆమె ఏ దక్షిణాది సినిమాలోనూ కనిపించలేదు.

హిందీ, మరాఠీ నటి రాధికా ఆప్టే
హిందీ, మరాఠీ నటి రాధికా ఆప్టే

గత కొన్నేళ్లుగా సౌత్ చిత్ర పరిశ్రమకు ఎందుకు దూరంగా ఉంటున్నారనే విషయంపై రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రాధికా ఆప్టే సంచలన విషయాలను బయటపెట్టారు. కీర్తి సురేష్‌తో కలిసి నటించిన తన లేటెస్ట్ నెట్‌ఫ్లిక్స్ గ్యాంగ్‌స్టర్ వెబ్ సిరీస్ 'అక్క' (Akka) ప్రమోషన్ల సందర్భంగా ఆమె ఈ విషయాలను పంచుకున్నారు.

"తెల్లగా ఉన్నారనే కారణంతోనే ముంబై నుంచి తెచ్చుకుంటారు!"

తాజాగా 'న్యూస్18' కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాధికా ఆప్టే మాట్లాడుతూ.. "నా పరిశీలన తప్పు కావచ్చు, కానీ నా అభిప్రాయం ప్రకారం దక్షిణాది చిత్ర పరిశ్రమలో తెల్లగా ఉండే నటీమణులకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే ఉత్తరాది నుంచి హీరోయిన్లను దిగుమతి చేసుకుంటారు. నేను తెల్లగా ఉండను. అసలు దక్షిణాదిలో భాష బాగా తెలిసిన, అత్యంత అందమైన, అద్భుతమైన ప్రతిభ ఉన్న స్థానిక నటీమణులు ఎంతోమంది ఉన్నారు. వారిని వదిలేసి, ఆ భాషలో ఒక్క ముక్క కూడా మాట్లాడలేని, ఇతరులతో డబ్బింగ్ చెప్పించుకునే ముంబై నటీమణులను ఎందుకు ఎంచుకుంటారో నాకు ఇప్పటికీ అర్థం కాదు" అని వ్యాఖ్యానించారు.

దక్షిణాది చిత్రాల షూటింగ్ సెట్స్‌లో ఉండే వాతావరణం గురించి కూడా రాధికా ఆప్టే మాట్లాడారు. "నేను సౌత్ సినిమా చేసి పదేళ్లు దాటింది. అప్పట్లో అక్కడ వాతావరణం చాలా అన్ ప్రొఫెషనల్ గా ఉండేది. స్నేహపూర్వకంగా, చాలా దయతో చూసేవారు. 'నువ్వు మా కుటుంబంలో ఒకదానివి' అని సొంత సోదరిలా ఆదరించేవారు. అది వినడానికి చాలా బాగుంటుంది, సరదాగా మాట్లాడొచ్చు. కానీ దానివల్ల కొన్నిసార్లు వారు అడిగే 'ఫేవర్లు' చేయాల్సి వస్తుంది. అది నాకు పెద్ద సమస్యగా మారేది" అని తన అనుభవాలను పంచుకున్నారు.

నెట్‌ఫ్లిక్స్ 'అక్క' సిరీస్‌తో రీ-ఎంట్రీ

అయితే రాధికా ఆప్టే నటించిన సరికొత్త పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా వెబ్ సిరీస్ 'అక్క' (Akka) త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది. 1980ల కాలం నాటి 'పెర్నూరు' అనే ఊహాజనిత రాజ్యం నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌లో ఆమె 'రుద్ర' అనే పవర్‌ఫుల్ పాత్రను పోషించారు. ఇందులో నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ (Keerthy Suresh) 'భవాని' అనే పాత్రలో కనిపిస్తుండగా, వీరిద్దరి మధ్య సాగే పవర్‌గేమ్, పగ, ప్రతికారాల చుట్టూ కథ తిరుగుతుంది.

వైఆర్ఎఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ (YRF Entertainment) బ్యానర్‌పై ధర్మరాజ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ మోస్ట్ అవేటెడ్ సిరీస్ వచ్చే అక్టోబర్ 30 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ కానుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks