Rajasekhar: ఈ మధ్యే బైకర్ మూవీతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన సీనియర్ హీరో రాజశేఖర్ తాజాగా జీ తెలుగు ఛానెల్ ఆట షోకి భార్య జీవితతో కలిసి వచ్చాడు. కొన్నాళ్లుగా తనకు గోలీలు తయారు చేసే ఫ్యాక్టరీ ఉందంటూ యూట్యూబ్ లో వస్తున్న పుకార్లపై తనదైన రీతిలో అతడు స్పందించాడు.
ఆట షోలో రాజశేఖర్, జీవిత

తాజా జీ తెలుగు ఛానెల్ ఆట డ్యాన్స్ షోకి తన భార్య జీవితతో కలిసి వచ్చిన రాజశేఖర్ తన గోలీల ఫ్యాక్టరీ అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను ఈ మధ్య చాలా బిజీగా ఉంటున్నానని, గోలీల ఫ్యాక్టరీతో నెలకు కూ.3 కోట్లు సంపాదిస్తున్నానని, అది కూడా యూట్యూబ్ లోనే అని అతడు అన్నాడు.
అది విని జడ్జిగా ఉన్న రాధికతోపాటు నిహారిక కొణిదెల కూడా షాక్ తిన్నది. ప్రతి రోజూ గోలీల ఫ్యాక్టరీకి వెళ్తానని, తాను చాలా బిజీ అని, అయితే ఆ ఫ్యాక్టరీ ఎక్కడుందో మాత్రం తెలియదని తనదైన రీతిలో రాజశేఖర్ సెటైర్ వేశాడు. అది విని అక్కడున్న వాళ్లందరూ నవ్వేశారు.
అసలేం జరిగింది?
నిజానికి కొన్ని రోజులుగా రాజశేఖర్ పై యూట్యూబ్ లో వస్తున్న వార్తలు వైరల్ అయ్యాయి. అతనికి పిల్లలు ఆడుకునే ఓ గోలీలు తయారు చేసే ఫ్యాక్టరీ ఉందని, దాని ద్వారానే నెలకు రూ.3 కోట్లు సంపాదిస్తున్నాడన్నది ఆ వార్తల సారాంశం. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడం, అది రాజశేఖర్ దృష్టిలోనూ పడటంతో అతడు ఈ ఆట షో ద్వారా ఆ పుకార్లకు ఇలా చెక్ పెట్టాడు.
సరదాగా సాగిపోయిన ప్రోమో
జీ తెలుగులో చాలా పాపులర్ అయిన డ్యాన్స్ షో ఆట. దీనికి యాంకర్ గా సుడిగాలి సుధీర్ ఉండగా.. జడ్జీలుగా సీనియర్ నటి రాధిక, నటి, ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల ఉన్నారు. తాజా ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేయగా.. దీనికి రాజశేఖర్, జీవిత ట్రోఫీ లాంచ్ చేయడం కోసం వచ్చారు. వాళ్లను చూడగానే కొత్తగా పెళ్లయిన జంటలా అనిపిస్తున్నారు అని సుధీర్ అన్నాడు.
{{/usCountry}}జీ తెలుగులో చాలా పాపులర్ అయిన డ్యాన్స్ షో ఆట. దీనికి యాంకర్ గా సుడిగాలి సుధీర్ ఉండగా.. జడ్జీలుగా సీనియర్ నటి రాధిక, నటి, ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల ఉన్నారు. తాజా ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేయగా.. దీనికి రాజశేఖర్, జీవిత ట్రోఫీ లాంచ్ చేయడం కోసం వచ్చారు. వాళ్లను చూడగానే కొత్తగా పెళ్లయిన జంటలా అనిపిస్తున్నారు అని సుధీర్ అన్నాడు.
{{/usCountry}}ఇప్పటికీ పెళ్లి కాని సుధీర్.. తాను పెళ్లి చేసుకోవచ్చా అని రాజశేఖర్ ను అడిగితే.. చేసుకో, బాగా చూసుకో అని చెబుతాడు. జీవిత తనను ఓ దేవుడిలా చూసుకుంటుందని అనడం విశేషం. ఇక ఆ తర్వాత విష్ణుప్రియ అతడితో డ్యాన్స్ చేయడానికి తెగ ఉత్సాహం చూపిస్తుంది.
కానీ డ్యాన్స్ అంటేనే రాజశేఖర్ కు జ్వరం వస్తుందని రాధిక ఆటపట్టిస్తుంది. 10 నిమిషాల పాటు సాగిన ఈ ప్రోమో చాలా సరదాగా ఉంది. రాజశేఖర్ ఈ మధ్యే శర్వానంద్ తో కలిసి బైకర్ మూవీలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో అతని నటనకు మంచి మార్కులు పడ్డాయి.