Rajasekhar: శ్రీదేవిని పెళ్లి చేసుకోమన్నారు.. అదే విషయం చెప్తే జీవిత సింగిల్ గా ఉంటానంది.. రాజశేఖర్

Rajasekhar: ఒకప్పుడు హీరోగా అదరగొట్టాడు రాజశేఖర్. రీసెంట్ గా బైకర్ మూవీలో తండ్రి క్యారెక్టర్లోనూ సత్తాచాటాడు. తాజాగా తన జీవితంలోని పెళ్లి, సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలని అడిగారని రాజశేఖర్ పేర్కొన్నాడు. 

Published on: May 4, 2026, 11:27:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Rajasekhar: యాంగ్రీ యంగ్ మెన్ క్యారెక్టర్లతో తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ హీరో రాజశేఖర్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నారు. మూవీస్ లో కీ రోల్స్ చేస్తున్నారు. తాజాగా బైకర్ మూవీలో హీరో తండ్రిగా అదరగొట్టారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో రాజశేఖర్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. తన పెళ్లి, సినిమాల గురించి చెప్పుకొచ్చారు.

రాజశేఖర్ (x)
రాజశేఖర్ (x)

శ్రీదేవి సంబంధం

జీవితను రాజశేఖర్ ప్రేమించి, పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడిన రాజశేఖర్ తన పెళ్లికి ముందు జరిగిన సంగతులను గుర్తు చేసుకున్నారు. అప్పుడు హీరోయిన్ శ్రీదేవి సంబంధం కూడా వచ్చిందని, ఇంట్లోవాళ్లు ఆమెను పెళ్లి చేసుకోమన్నారని రాజశేఖర్ పేర్కొన్నారు.

సింగిల్ గా ఉంటానని

‘‘జీవిత నాకు ప్రపోజ్ చేసేలా చేశా. ఇంట్లో జీవిత విషయం చెప్పా. కానీ మా అమ్మ నాకు మరో సంబంధం చూసింది. ఆ అమ్మాయితో పాటు జీవితను గుడికి రమ్మన్నా. అక్కడ వాళ్లిద్దరూ ఒకరినొకరు చూసుకుని షాక్ అయ్యారు. ఎందుకంటే వాళ్లు స్కూల్ ఫ్రెండ్స్ అంట’’ అని రాజశేఖర్ తెలిపారు.

‘‘శ్రీదేవి సంబంధం వచ్చింది. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోమన్నారు. ఈ విషయం జీవితకు చెప్పా. ‘మీకు ఇష్టముంటే చేసుకోండి. కానీ నేను మాత్రం ఇంకొకరిని పెళ్లి చేసుకోను. ఎప్పటికీ సింగిల్ గా ఉండిపోతా’ అని అప్పుడు జీవిత చెప్పింది’’ అని రాజశేఖర్ చెప్పారు.

డాక్టర్ కావాలని

రాజశేఖర్ నిజంగానే డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యారు. వాళ్ల ఇంట్లో రాజశేఖర్ ను డాక్టర్ చేయాలని ఉండేది. కానీ రాజశేఖర్ ఏమో యాక్టర్ అవుతానని చెప్పారు. దీంతో అతణ్ని ఇంట్లో నుంచి బయటకు పొమ్మన్నారు. చేసేదేం లేక యాక్టింగ్ పై ఇష్టంతో రాజశేఖర్ బయటకు వచ్చేశారు. ఈ విషయాన్ని స్వయంగా రాజశేఖర్ వెల్లడించారు.

ఆ సినిమాలు చేసి ఉంటే

రాజశేఖర్ తన కెరీర్ లో డిఫరెంట్ క్యారెక్టర్లు ప్లే చేశారు. ముఖ్యంగా పోలీస్ పాత్రలు ఇరగదీశారు. అయితే చంటి, జెంటిల్మెన్ సినిమాలను రాజశేఖర్ చేయాల్సిందంటా. కానీ ఆ మూవీస్ చేయలేకపోయానని రాజశేఖర్ చెప్పారు. చంటి మూవీ కోసం చెన్నై నుంచి వచ్చే లోపు, వెంకటేష్ ఆ సినిమా చూసి కొనేశారని రాజశేఖర్ అన్నారు.

సునీల్ నారాయణ్

శర్వానంద్ హీరోగా వచ్చిన బైకర్ మూవీలో రాజశేఖర్ అదరగొట్టారు. హీరో తండ్రి, ఒకప్పటి రేసర్ అయిన సునీల్ నారాయణ అనే క్యారెక్టర్ ప్లే చేశారు. కొడుకును ఛాంపియన్ గా తీర్చదిద్దాలనే కలతో, స్వయంగా శిక్షణ ఇస్తాడు ఆ తండ్రి. ఇప్పుడీ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More