...
...
Next Story

Dharman: రజనీకాంత్- కమల్ హాసన్ మూవీకి పవర్ ఫుల్ టైటిల్.. 40 ఏళ్ల నాటి ‘ఫ్లైట్ సీక్రెట్’ చెప్పిన కమల్.. డబుల్ ట్రీట్

Dharman: లోకనాయకుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీకి పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా టైటిల్ ను ఇవాళ అనౌన్స్ చేశారు. ఇక రజినీకాంత్ ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయింది. ఈ సందర్భంగా కమల్ హాసన్ చేసిన సంచలన వ్యాఖ్యలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

Updated on: Jun 24, 2026, 11:38:06 IST
Advertisement

Dharman: కోలీవుడ్ దాటి ఇండియన్ సినిమా హిస్టరీలోనే రజనీకాంత్, కమల్ హాసన్ ల బంధం అత్యంత అరుదైంది. కెరీర్ ఆరంభంలో ఇద్దరూ కలిసి ఎన్నో క్లాసిక్ సినిమాల్లో నటించినప్పటికీ, స్టార్‌డమ్ పీక్స్‌కు వెళ్తున్న తరుణంలో విడివిడిగా సినిమాలు చేయడం ప్రారంభించారు. ఇప్పుడు వీళ్ల కాంబినేషన్లో వస్తున్న మూవీకి పవర్ ఫుల్ టైటిల్ అనౌన్స్ చేశారు.

టైటిల్ ధర్మన్

రజినీకాంత్- కమల్ హాసన్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ (x/ikamalhaasan)
రజినీకాంత్- కమల్ హాసన్ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ (x/ikamalhaasan)

చాలా ఏళ్ల తర్వాత కమల్ హాసన్, రజనీకాంత్ కలిశారు. కమల్ నిర్మాతగా రజనీకాంత్ హీరోగా సినిమా తెరకెక్కుతోంది. దీనికి ‘ధర్మన్’ అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఇవాళ (జూన్ 24) అనౌన్స్ చేశారు. ఇండస్ట్రీలోనే ఇది బిగ్గెస్ట్ కొల్లాబ్రేషన్‌గా నిలిచింది. ఈ సందర్భంగా డాక్టర్ గెటప్ లో ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉన్న రజనీకాంత్ ఫస్ట్ లుక్ కూడా వైరల్ గా మారింది.

‘డెడ్లీ డాక్టర్’ గా తలైవా ఎనర్జీ!

ఈ సినిమాలో రజనీకాంత్ ఒక సరికొత్త నెగటివ్ షేడ్స్ ఉన్న 'డెడ్లీ డాక్టర్' పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ ఇంకా పూర్తిస్థాయిలో మొదలుకాకముందే రజనీకాంత్ ఎనర్జీ చూసి కమల్ ఆశ్చర్యపోయారట. "రజనీకాంత్ ఎవరినీ నిద్రపోనివ్వడం లేదు. ఆయనే స్వయంగా అందరికీ ఫోన్లు చేసి, నేను కమల్ హాసన్ ప్రొడక్షన్‌లో నటిస్తున్నానంటూ ఎంతో ఉత్సాహంగా చెప్తున్నారు" అని కమల్ నవ్వేశారు. అనిరుధ్ మ్యూజిక్, నికేత్ బొమ్మి కెమెరా, అన్బరివ్ స్టంట్స్ ఈ యాక్షన్ డ్రామాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లనున్నాయి.

ఇద్దరు కుర్రాళ్లు

ఇటీవల తాను కొత్త ఆర్‌కేఎఫ్‌ఐ (RKFI) ఆఫీస్‌ను ప్రారంభించినప్పుడు రజనీకాంత్‌ను టెర్రస్‌పైకి తీసుకెళ్లి.. ‘మన పాత మాటను నిజం చేసే సమయం వచ్చింది’ అని గుర్తుచేసినట్లు కమల్ హాసన్ వెల్లడించారు. ఈ క్రమంలోనే కేవలం ఒక్క సినిమా మాత్రమే కాకుండా.. ‘ధర్మన్’ తో పాటు ‘KHxRK’ అనే మరో భారీ ప్రాజెక్ట్‌ను కూడా లైనప్‌లో పెట్టినట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇచ్చారు.

ముంబై ఫ్లైట్ సీక్రెట్

40 ఏళ్ల క్రితం కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి ఒకే ఫ్లైట్‌లో ముంబై వెళ్తున్నప్పుడు ఇద్దరికీ కలిసి నటించేందుకు భారీ ఆఫర్లు వచ్చాయి. కానీ, ఆ ఫ్లైట్‌లోనే వారు ఇకపై కలిసి నటించకూడదని నిర్ణయం తీసుకున్నారని కమల్ వెల్లడించారు.

ఇద్దరు పెద్ద స్టార్లు ఒకే సినిమాలో నటిస్తే బడ్జెట్‌లో సింహభాగం వారి రెమ్యూనరేషన్‌కే సరిపోతుంది. పైగా ఇద్దరి ఇమేజ్ బ్యాలెన్స్ చేయడం దర్శకులకు నరకం. అందుకే ఇద్దరి మార్కెట్ విడివిడిగా పెరిగితేనే ఇండస్ట్రీకి మంచిదనే దూరదృష్టితో ఆ రోజు విడిపోయారు.

40 ఏళ్ల కల

‘‘భవిష్యత్తులో ఒకరి కోసం మరొకరం సినిమా నిర్మించుకుందాం’’ అని ఆ రోజు కమల్ హాసన్ , రజనీకాంత్ మాట ఇచ్చుకున్నారు. ఆ 40 ఏళ్ల నాటి ‘ఫ్లైట్ డీల్’ ఫలితమే ఈ రోజు మొదలైన ‘ధర్మన్’. ఈ మోడల్ వల్ల థియేట్రికల్ అండ్ నాన్-థియేట్రికల్ బిజినెస్ వాల్యూస్ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe