...
...
Next Story

అప్పుడు అనాథ‌గా ఫీల‌య్యా-ఆయ‌న స‌ల‌హా కార‌ణంగానే ఏడాదికో సినిమా: ర‌జినీకాంత్ ఎమోష‌న‌ల్‌

చెన్నైలోని ఏవీ మేయప్పన్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో ప్రముఖ సినీ నిర్మాత ఎం శరవణన్ చిత్రపటాన్ని ఆవిష్కరించిన కార్యక్రమంలో రజినీకాంత్, కమల్ హాసన్ హాజరయ్యారు. ఈ ఈవెంట్లో రజినీకాంత్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

Published on: Jan 05, 2026 11:40 AM IST
Advertisement

లెజెండరీ తమిళ నిర్మాత శరవణన్ సూర్య మణి అలియాస్ ఎవిఎం శరవణన్ లేదా కేవలం ఎం శరవణన్ గురించి మాట్లాడుతూ రజినీకాంత్ ఎమోషనల్ అయ్యారు. తన 86 వ పుట్టినరోజు తర్వాత డిసెంబర్ 4, 2025న శరవణన్ కన్నుమూశారు. చెన్నైలోని ఏవీ మేయప్పన్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో ఆదివారం(జనవరి 4) జరిగిన కార్యక్రమంలో రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి శరవణన్ చిత్రపటాన్ని ఆవిష్కరించారు.

రజినీకాంత్ ఎమోషనల్

రజినీకాంత్ ఎమోషనల్
రజినీకాంత్ ఎమోషనల్

శరవణన్ గురించి మాట్లాడుతుండగా రజినీకాంత్ భావోద్వేగానికి గురయ్యాడు. ‘‘ఆయనతో 11 సినిమాలు చేశా. శరవణన్ తన కార్యాలయంలో కూర్చొని అనేక విజయాలను అందించిన వ్యక్తి. సినిమాకు మించి వ్యక్తిగతంగా నాకు చాలా సన్నిహితుడు’’ అని రజినీకాంత్ చెప్పుకొచ్చారు.

ఆ సలహా

ప్రముఖ నిర్మాత శరవణన్ తనకు ఇచ్చిన సలహాను కూడా రజనీకాంత్ వెల్లడించారు. ‘‘శివాజీ (2007) తర్వాత నా వయసు పెరిగేకొద్దీ బిజీగా ఉండాలని ఆయన చెప్పారు. ప్రతి సంవత్సరం కనీసం ఒక సినిమా చేయమని ఆయన నాకు సలహా ఇచ్చారు. ఇప్పుడు కూడా నేను ఆ సలహాను అనుసరిస్తాను’’ అని రజినీకాంత్ వెల్లడించారు.

అప్పుడు అనాథలా

‘‘సమయం మనం ఇష్టపడే వ్యక్తులను, గౌరవించే, ప్రేమించే వ్యక్తులను త్వరగా దూరం చేస్తుంది. మీకు చాలా డబ్బు, మంచి కుటుంబం, పేరు లేదా కీర్తి ఉన్నప్పటికీ, అలాంటి వ్యక్తులు వెళ్ళినప్పుడు మీరు అనాథగా మిగిలిపోతారు. నేనూ అప్పుడు అలాగే ఫీలయ్యా. శరవణన్ సర్ గొప్ప వ్యక్తి, ఆయన ఆత్మకు శాంతి లభించాలని కోరుకుంటున్నా’’ అని రజినీకాంత్ ఎమోషనల్ అయ్యారు.

సకలకళ వల్లవన్

రజనీకాంత్ మాదిరిగానే కమల్ హాసన్ కూడా ఏవీఎం సంస్థ నుండి నేర్చుకున్నది ఈ రోజు వరకు తనకు మద్దతు ఇస్తూనే ఉందని అంగీకరించాడు. "ఈ ఏవీఎం హయ్యర్ సెకండరీ స్కూల్ అప్పట్లో నిర్మించలేదు. అలా జరిగి ఉంటే ఇక్కడే చదువుకునేవాడిని. నేను తప్పులు చేసినప్పుడు ఆయన నాపై ఎప్పుడూ అరవలేదు. కానీ నేను ఏదైనా మంచి చేసినప్పుడు ఆయన నన్ను పైకి లేపారు. అది ఎవిఎం శరవణన్"అని కమల్ హాసన్ చెప్పారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe