Anna Rajan: వాళ్లను వదిలే ప్రసక్తే లేదు.. అన్ని ఆధారాలు ఉన్నాయి: తన ఫొటోలను మార్ఫింగ్ చేయడంపై నటి అన్నా రాజన్ వార్నింగ్
Anna Rajan: జైలర్ 2 మూవీ నటి అన్నా రాజన్ ఫొటోల మార్ఫింగ్ కలకలం రేపింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తూ ఈ పనికి పాల్పడిన వారిని వదలను అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చింది. అసలు ఏం జరిగిందో చూడండి.
Anna Rajan: 'జైలర్ 2' నటి, మాలీవుడ్ బ్యూటీ అన్నా రాజన్ తన మార్ఫింగ్ ఫోటోలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సైబర్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఈ విషయాన్ని షేర్ చేస్తూ లీగల్ యాక్షన్ తీసుకుంటానని సైబర్ క్రిమినల్స్‌ను హెచ్చరించారు.

అశ్లీల ఫోటోలపై అన్నా రాజన్ ఫైర్
ఇన్‌స్టాగ్రామ్‌లో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తన ఫోటోలను అసభ్యకరంగా ఎడిట్ చేసి ఇంటర్నెట్ లో షేర్ చేస్తున్నట్లు అన్నా రాజన్ గుర్తించారు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ సదరు అకౌంట్‌పై లీగల్ యాక్షన్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. తన ప్రైవసీకి భంగం కలిగించేలా ఇదంతా చేశారని ఆమె మండిపడ్డారు.
"నా ఇమేజ్‌ను కావాలనే చెరిపేయడానికి, నన్ను అప్రతిష్ట పాలు చేయడానికి కొందరు కావాలని ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇది చాలా సిగ్గుచేటు. నా గౌరవానికి భంగం కలిగించేలా ఉంది" అని అన్నా రాజన్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. సోషల్ మీడియాలో ఇలాంటి అసభ్య కంటెంట్‌ను ఎవరూ సపోర్ట్ చేయవద్దని ఫ్యాన్స్‌ను కోరారు.
కేరళ పోలీస్, సైబర్ వింగ్‌కు కంప్లైంట్
ఈ దారుణమైన సైబర్ క్రైమ్ వ్యవహారాన్ని అన్నా రాజన్ చాలా సీరియస్‌గా తీసుకున్నారు. కేరళ పోలీస్ అఫీషియల్ హ్యాండిల్స్‌తో పాటు 'సైబర్‌డోమ్ కేరళ'ను ట్యాగ్ చేస్తూ వెంటనే యాక్షన్ తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. డిజిటల్ ఆధారాలను మొత్తం దాచానని, నిందితులను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
చట్టపరమైన చర్యల ద్వారా ఈ ఫేక్ కంటెంట్ క్రియేట్ చేసిన వాళ్ల పని పట్టే వరకు వదిలిపెట్టనని స్పష్టం చేశారు. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ ఇలాంటి డీప్‌ఫేక్, మార్ఫింగ్ ఫోటోలు పెట్టే అకౌంట్లపై కఠినమైన శిక్షలు పడాలని డిమాండ్ చేశారు.
గతంలోనూ కెమెరా యాంగిల్స్ వివాదం
అన్నా రాజన్‌కు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవ్వడం ఇదే మొదటిసారి కాదు. ఇదే ఏడాది మార్చి నెలలో తిరువనంతపురంలో జరిగిన అట్టుకల్ పొంగల ఫెస్టివల్‌లో కొందరు ఫోటోగ్రాఫర్లు ఆమెను తప్పుడు యాంగిల్స్‌లో క్యాప్చర్ చేశారు. ఆ ఫోటోలు వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలో తీవ్రమైన నెగిటివిటీ వచ్చింది.
నిజానికి తప్పు తనది కాకపోయినా భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదని అన్నా రాజన్ అప్పట్లో క్షమాపణలు చెప్పారు. తన శారీ, ఎక్స్‌ప్రెషన్స్ ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని కోరారు. కానీ ఈసారి మాత్రం ఆమె డిఫెన్స్‌లో ఉండకుండా ఎటాకింగ్ మోడ్‌లోకి వచ్చి సైబర్ క్రిమినల్స్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు.
‘జైలర్ 2’తో కోలీవుడ్ గ్రాండ్ డెబ్యూ
లిజో జోస్ పెల్లిస్సేరి డైరెక్ట్ చేసిన 'అంగమలై డైరీస్' సినిమాతో అన్నా రాజన్ మాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాలో ఆమె పోషించిన 'లిచికా' క్యారెక్టర్ ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత 'అయ్యప్పనుమ్ కోషియుమ్', 'లోనప్పంటే మామోదీసా', రీసెంట్‌గా వచ్చిన 'దావీద్' సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్షన్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్, రమ్యకృష్ణ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న మోస్ట్ ఏవైటెడ్ ప్రాజెక్ట్ 'జైలర్ 2' లో అన్నా రాజన్ ఒక క్రేజీ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాతో ఆమె కోలీవుడ్‌లో గ్రాండ్ డెబ్యూ ఇస్తుండటంతో సినిమా ఇండస్ట్రీలో ఆమె రేంజ్ భారీగా పెరిగింది. ఈ క్రమంలోనే ఆమెను టార్గెట్ చేస్తూ ఇలాంటి ఫేక్ మోర్ఫింగ్ ఫోటోలు క్రియేట్ చేయడం టాలీవుడ్, మాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


