...
...
Next Story

Tamanna Jailer 2: మీకు నచ్చిందని తమన్నాను జైలర్ 2లో బలవంతంగా పెట్టలేను- రజనీకాంత్ కోరికకు డైరెక్టర్ నెల్సన్ సమాధానం

Rajinikanth About Tamanna Not In Jailer 2: సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కిన 'జైలర్ 2'లో తమన్నా భాటియా ఎందుకు నటించడం లేదో స్వయంగా రజనీ తాజాగా వెల్లడించారు. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ఇచ్చిన సమాధానం, రజనీకాంత్ ఇచ్చిన ఫన్నీ కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

Published on: Oct 10, 2026, 15:33:47 IST
Advertisement

Rajinikanth Clarity On Tamannaah Bhatia Not In Jailer 2: సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ 'జైలర్ 2' పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మొదటి పార్ట్ బాక్సాఫీస్ వద్ద సాధించిన ఘన విజయం, తెలుగు రాష్ట్రాల్లో వసూళ్ల వర్షం కురిపించడంతో ఈ రెండో భాగం జైలర్ 2 కోసం సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

డ్యాన్స్‌తో థియేటర్లను ఊపేసిన తమన్నా

మీకు నచ్చిందని తమన్నాను జైలర్ 2లో బలవంతంగా పెట్టలేను- రజనీకాంత్ కోరికకు డైరెక్టర్ నెల్సన్ సమాధానం
మీకు నచ్చిందని తమన్నాను జైలర్ 2లో బలవంతంగా పెట్టలేను- రజనీకాంత్ కోరికకు డైరెక్టర్ నెల్సన్ సమాధానం

తొలి భాగంలో తన డ్యాన్స్‌తో, గ్లామర్ షోతో థియేటర్లను ఊపేసిన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా పార్ట్-2 అయిన జైలర్ 2లో కనిపించకపోవడం అభిమానులకు కొంత నిరాశ కలిగించింది. జైలర్ 2లో తమన్నా లేకపోవడంపై సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందిస్తూ అసలు కారణాన్ని బయటపెట్టారు.

తమన్నా కోసం స్పెషల్ సాంగ్

సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన 'జైలర్ 2 - సూపర్ షో' కార్యక్రమంలో రజనీకాంత్ మాట్లాడారు. ఈ సినిమాలో తమన్నా లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. తమన్నా కోసం ప్రత్యేకంగా ఒక డ్యాన్స్ నంబర్ డిజైన్ చేయమని తాను దర్శకుడు నెల్సన్‌ను కోరినట్లు రజనీకాంత్ తెలిపారు.

డైరెక్టర్ నెల్సన్ ఇచ్చిన సూటి సమాధానం!

"మీకు ఆమె (తమన్నా) నచ్చిందని చెప్పి నేను సినిమాలో బలవంతంగా ఆ పాత్రను పెట్టలేను సర్" అని దర్శకుడు నెల్సన్.. రజనీకాంత్ ముఖం మీదే చెప్పేశారట. దానికి రజనీకాంత్ తనదైన శైలిలో నవ్వుతూ స్పందించారు. "నాకు ఆమె నచ్చిందని నేనెప్పుడూ చెప్పలేదు" అని సరదాగా కామెంట్ చేశారు. "ఒకవేళ నా ఇష్ట ప్రకారమే అన్నీ చేసుకుంటూ పోతే నా కెరీర్ దెబ్బతిని మళ్లీ బెంగళూరుకే పరిమితం కావాల్సి వస్తుంది" అని రజనీకాంత్ వ్యాఖ్యానించారు.

తెలుగు నేలను ఊపేసిన 'నువ్వు కావాలయ్యా' మానియా

రజనీకాంత్‌తో పనిచేయడం తన డ్రీమ్ అని తమన్నా పలు సందర్భాల్లో చెప్పారు. షూటింగ్ సమయంలో ఆధ్యాత్మికతకు సంబంధించిన ఒక పుస్తకాన్ని కూడా రజనీకాంత్ తమన్నాకు ఆటోగ్రాఫ్ చేసి కానుకగా ఇచ్చారు.

జైలర్ 2కి 165 నిమిషాల రన్‌టైమ్

ఈ అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న 'జైలర్ 2' చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ మంజూరు చేసింది. ఈ సినిమా నిడివి 2 గంటల 45 నిమిషాలు (165 నిమిషాల 18 సెకన్లు) ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి భాగంలో మెరిసిన యోగి బాబు, రమ్యకృష్ణ, మిర్నా ఈ సీక్వెల్‌లోనూ నటిస్తున్నారు.

కొత్తగా ఆకట్టుకోనున్న నటీనటులు!

ఈసారి కథకు మరింత బలాన్ని చేకూర్చేందుకు బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి, విద్యా బాలన్, అన్నా రాజన్, జతిన్ సర్నా వంటి ప్రముఖ నటీనటులను రంగంలోకి దించారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై వస్తున్న జైలర్ 2 మళ్లీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks