తన కెరీర్‌లో అత్యంత సవాలుతో కూడుకున్న సమయాల్లో ఒకటిగా 'దే దే ప్యార్ దే 2' సినిమా షూటింగ్ సందర్భంగా ఎదుర్కొన్న ఇబ్బందులను రకుల్ ప్రీత్ సింగ్ పంచుకున్నారు. వర్కౌట్ సెషన్ తర్వాత తనకు తీవ్రమైన వెన్ను గాయం అయినట్లు, అప్పటికే సినిమా 50 శాతం పూర్తయినట్లు ఆమె తెలిపారు.
రకుల్ ఇంజూరీ

అజయ్ దేవగన్ తో రకుల్ ప్రీత్ సింగ్ కలిసి నటించిన లేటెస్ట్ హిందీ మూవీ 'దే దే ప్యార్ దే 2'. ఈ సినిమాకు మంచి టాక్ వినిపిస్తోంది. అయితే ఈ మూవీ షూటింగ్ సమయంలో రకుల్ కు వెన్నెముక గాయమైంది. ఈ ఇంజూరీ గురించి ఆమె రీసెంట్ గా మాట్లాడింది.
40 రోజులు
‘‘దే దే ప్యార్ దే 2 షూటింగ్ 50 శాతం పూర్తి చేసుకున్న తర్వాత నాకు ఆ గాయమైంది. 40 రోజుల పాటు నేను మంచానికే పరిమితం అయ్యాను. నేను ఒక కూరగాయలా మారిపోయా. మళ్ళీ ఎప్పుడు నడుస్తానో, ఎప్పుడు నిలబడతానో తెలియలేదు’’' అని ఆమె ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం టీమ్ వరిందర్ చావలాకు చెప్పారు. పూర్తిగా కోలుకోవడానికి ఆమెకు ఏడాది పట్టిందని తెలిపారు.
ఫిజియో బెడ్ పై
నొప్పి కారణంగా రకుల్ ప్రీత్ సింగ్ కదలలేని స్థితికి చేరుకుంది. కోలుకోవడంపై దృష్టి సారించడంతో మూడు నెలల పాటు షూటింగ్ నిలిచిపోయింది. రకుల్ కోలుకోవడం షూటింగ్‌ను చాలా కష్టతరం చేసింది. ఆమె సాధారణ కుర్చీలో కూర్చోలేకపోయిందని, అనేక సన్నివేశాలను ఫిజియో బెడ్‌పై పడుకుని చిత్రీకరించాల్సి వచ్చిందని ఆమె పంచుకున్నారు. 'నేను తిరిగి వచ్చినప్పుడు, ఈ విధంగా కుర్చీలో కూర్చోలేకపోయేదాన్ని. నేను ఫిజియో బెడ్‌పై సగం సినిమా షూటింగ్ చేశా. అది మీకు తెలియదు' అని రకుల్ వెల్లడించారు.
ఫేక్ ఐడెంటిటీ
ఓ వైపు గాయంతో ఇబ్బందిపడ్డ రకుల్ ప్రీత్ సింగ్ కు ఫేక్ ఐడెంటిటీతో సోషల్ మీడియాలో తన పేరు వాడటం మరింత సమస్యగా మారింది. ఇటీవల నటీమణులు శ్రియా సరన్, అదితి రావ్ హైదరీ ఇలాంటి అనుభవాలను వెల్లడించిన తర్వాత రకుల్ ఖూడా తన పేరుతో ఎవరో వ్యక్తులతో మాట్లాడుతున్నారని, తనలా నటిస్తున్నారని కనుగొన్నారు.
{{/usCountry}}ఓ వైపు గాయంతో ఇబ్బందిపడ్డ రకుల్ ప్రీత్ సింగ్ కు ఫేక్ ఐడెంటిటీతో సోషల్ మీడియాలో తన పేరు వాడటం మరింత సమస్యగా మారింది. ఇటీవల నటీమణులు శ్రియా సరన్, అదితి రావ్ హైదరీ ఇలాంటి అనుభవాలను వెల్లడించిన తర్వాత రకుల్ ఖూడా తన పేరుతో ఎవరో వ్యక్తులతో మాట్లాడుతున్నారని, తనలా నటిస్తున్నారని కనుగొన్నారు.
{{/usCountry}}'నా మేనేజర్ కొన్ని సంభాషణల స్నాప్‌షాట్‌లను నాకు పంపారు. అప్పుడే ఎవరో నాలాగా వ్యక్తులతో మాట్లాడుతున్నారని నాకు అర్థమైంది' అని రకుల్ వివరించారు. నకిలీ వ్యక్తి తాను గతంలో పనిచేసిన ఫోటోగ్రాఫర్‌ను కూడా సంప్రదించారు. సైబర్ క్రైమ్ కు హీరోయిన్ ఫిర్యాదు చేశారు.