Ram Charan Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న 'పెద్ది' (Peddi) సినిమా చుట్టూ గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం ఒక ఆసక్తికరమైన మలుపు చోటుచేసుకుంది. ఈ సినిమా విడుదల తేదీ విషయంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోనూ, ఇండస్ట్రీ వర్గాల్లోనూ తీవ్రమైన చర్చ నడుస్తోంది. చిత్ర బృందం ముందుగా ప్రకటించిన ప్రకారం ఏప్రిల్ 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా సినిమా వాయిదా పడే అవకాశం ఉందంటూ ప్రచారం మొదలైంది. కొందరు డిస్ట్రిబ్యూటర్లకు కూడా వాయిదాకు సిద్ధంగా ఉండాలని సంకేతాలు అందాయనే వార్తలు ఈ పుకార్లకు మరింత బలాన్ని చేకూర్చాయి. కానీ రామ్ చరణ్ వీటికి చెక్ పెట్టాడు.
రామ్ చరణ్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటి?
ఈ సందిగ్ధత కొనసాగుతున్న సమయంలోనే రామ్ చరణ్ స్వయంగా స్పందించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా 'రాకాసా' (Raakaasaa) చిత్ర బృందం తమ సినిమా ప్రమోషన్లలో భాగంగా 'పెద్ది' షూటింగ్ సెట్స్‌లో రామ్ చరణ్‌ను కలిశారు.
ఆ సమయంలో చరణ్ వారి ప్రమోషనల్ కంటెంట్‌ను అభినందిస్తూనే, తన సినిమా గురించి ఒక కీలక ప్రకటన చేశారు. "పెద్ది సినిమా వాయిదా పడుతోందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. మా సినిమా వాయిదా పడటం లేదని అందరికీ తెలియజేయండి. ఆ పుకార్లకు అడ్డుకట్ట వేయండి," అని అతడు సదరు బృందాన్ని కోరడం విశేషం.
అయోమయంలో అభిమానులు.. ఇండస్ట్రీ
రామ్ చరణ్ ఇంత స్పష్టంగా వాయిదా వార్తలను ఖండించినప్పటికీ, సినీ వర్గాల్లో మాత్రం ఇంకా అనుమానాలు తొలగలేదు. ఒకవైపు హీరో సినిమా వాయిదా పడటం లేదని నొక్కి చెబుతుంటే, మరోవైపు ఇండస్ట్రీలోని అంతర్గత చర్చలు మాత్రం వేరేలా ఉన్నాయి. సినిమా అనుకున్న సమయానికి రావడం కష్టమనే సంకేతాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో చరణ్ వ్యాఖ్యలు కేవలం అభిమానులను శాంతింపజేయడానికేనా? లేక నిజంగానే ఏప్రిల్ 30కి సినిమా రెడీ అవుతోందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఏది ఏమైనా రామ్ చరణ్ నోటి నుంచే నేరుగా 'నో డిలే' అనే మాట రావడంతో మెగా అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఈ సస్పెన్స్ కొనసాగేలా కనిపిస్తోంది. ప్రస్తుతం 'పెద్ది' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
{{/usCountry}}ఏది ఏమైనా రామ్ చరణ్ నోటి నుంచే నేరుగా 'నో డిలే' అనే మాట రావడంతో మెగా అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఈ సస్పెన్స్ కొనసాగేలా కనిపిస్తోంది. ప్రస్తుతం 'పెద్ది' సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
{{/usCountry}}1. 'పెద్ది' సినిమా అధికారిక విడుదల తేదీ ఏది?
నిర్మాణ సంస్థ ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ సినిమా ఏప్రిల్ 30, 2026న విడుదల కావాల్సి ఉంది.
2. రామ్ చరణ్ వాయిదా వార్తలపై ఏమని స్పందించారు?
తన సినిమా వాయిదా పడుతోందనే వార్తలను రామ్ చరణ్ ఖండించారు. 'పెద్ది' వాయిదా పడటం లేదని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు.
3. వాయిదా వార్తలు ఎందుకు మొదలయ్యాయి?
సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ఇతర సాంకేతిక కారణాల వల్ల ఏప్రిల్ 30కి సినిమా సిద్ధమవ్వడం కష్టమంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించడంతో ఈ పుకార్లు మొదలయ్యాయి.