...
...
Next Story

Ram Charan: చిరంజీవి, శ్రీదేవి స్టార్‌డమ్ ఎంతో చిన్నప్పుడు మాకు తెలియదు: పెద్ది ప్రమోషన్స్‌లో రామ్ చరణ్, జాన్వీ

Ram Charan: రామ్ చరణ్, జాన్వీ కపూర్ ప్రస్తుతం పెద్ది మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ ఇద్దరూ తమ పేరెంట్స్ గురించి మాట్లాడుతూ.. తమ చిన్నతనంలో చిరంజీవి, శ్రీదేవికి ఉన్న స్టార్‌డమ్ గురించి తెలియదని చెప్పడం విశేషం.

Published on: May 29, 2026, 21:01:04 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా మూవీ ‘పెద్ది’. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Ram Charan: చిరంజీవి, శ్రీదేవి స్టార్‌డమ్ ఎంతో చిన్నప్పుడు మాకు తెలియదు: పెద్ది ప్రమోషన్స్‌లో రామ్ చరణ్, జాన్వీ (PTI)
Ram Charan: చిరంజీవి, శ్రీదేవి స్టార్‌డమ్ ఎంతో చిన్నప్పుడు మాకు తెలియదు: పెద్ది ప్రమోషన్స్‌లో రామ్ చరణ్, జాన్వీ (PTI)

ఈ నేపథ్యంలో చిత్ర బృందం నిర్వహించిన ఒక ప్రత్యేక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ తమ స్టార్ పేరెంట్స్ (చిరంజీవి, శ్రీదేవి) గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. చిన్నప్పుడు తమ తల్లిదండ్రులు ఎంతటి స్టార్స్ అనే విషయం తమకు అస్సలు తెలియదని వారు వెల్లడించారు.

సినిమాలకు దూరంగా మెగాస్టార్ ఇల్లు..

చిన్నతనంలో తన తండ్రి చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి తనకు ఎలాంటి అవగాహన ఉండేది కాదని రామ్ చరణ్ చెప్పారు.

"చిన్నప్పటి నుండి నేను చాలా లోకల్ విషయాలకు దూరంగా, ఏమీ తెలియనట్టు ఉండేవాడిని. మా నాన్నగారు సినిమా ఆరాను, స్టార్డమ్‌ను ఎప్పుడూ ఇంటి వరకు రానిచ్చేవారు కాదు. అవార్డులు, సినీ మ్యాగజైన్లు అన్నీ ఆఫీస్ రూమ్‌ వరకే పరిమితం. ఇంట్లో సినిమా పత్రికలు ముట్టుకోవాలన్నా మాకు భయం వేసేది. అందుకే నాన్న ఎంత పెద్ద స్టారో మాకు తెలిసేది కాదు. ఆయన పిలిస్తే తప్ప షూటింగ్ సెట్స్‌కు వెళ్లేవాళ్లం కాదు" అని చరణ్ వివరించారు.

తనకు నటుడు అవ్వాలని ఉన్నప్పటికీ, నాన్న తిడతారేమోననే భయంతో 17 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆ విషయం దాచానని చరణ్ చెప్పారు. "నాన్న ముందు కార్ల బొమ్మలు గీస్తూ.. నన్ను ఇంప్రెస్ చేయడానికి 'మెకానికల్ ఇంజనీర్' అవుతానని అబద్ధం చెప్పేవాడిని. చదువుకోకుండా సినిమాలంటావేంటి అని కొడతారేమోనని భయం. కానీ సరైన సమయం చూసి నా చదువు బాగున్నప్పుడు నటనపై ఆసక్తి ఉందని చెబితే ఆయన ఓకే అన్నారు" అని చరణ్ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

ఫ్రైడే వస్తే చేపల మార్కెట్‌కి వెళ్లేది

"నేను సినిమాల్లోకి వచ్చాక అమ్మకు ప్రజల్లో ఉన్న స్థానం ఏంటో అర్థమవడం ప్రారంభమైంది. కానీ ఇంట్లో మాత్రం ఆమె మమ్మల్ని స్టార్డమ్‌కు చాలా దూరంగా ఉంచారు. మా దృష్టిలో అమ్మ ఒక సూపర్ ఉమెన్. ప్రతి శుక్రవారం అమ్మే స్వయంగా చేపల మార్కెట్‌కు వెళ్లి, మనకు ఏ 'పాంఫ్రెట్' (చందమామ చేపలు) కావాలో చూసి మరీ తెచ్చేది. ఆ సమయంలో అమ్మ చాలా గర్వంగా ఫీలయ్యేది. ఆ లైఫ్ మాకు చాలా నచ్చేది" అని జాన్వీ అన్నారు.

తన తల్లి సాధించిన ఇమేజ్‌ను మళ్లీ అందుకోవడం ఎవరికైనా అసాధ్యమని జాన్వీ స్పష్టం చేశారు. "అమ్మకు ప్రేక్షకులు ఇచ్చిన స్థానం దశాబ్దాలకోసారి మాత్రమే జరుగుతుంది. నా వల్ల కానీ, మరెవరి వల్ల కానీ ఆ మ్యాజిక్‌ను మళ్లీ రీక్రియేట్ చేయడం ఇంపాజిబుల్. నేను నా పనిని పూర్తి నిజాయితీతో చేస్తున్నాను. నాకంటూ ఒక సొంత ప్రయాణాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను" జాన్వీ కపూర్ చెప్పింది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. 'పెద్ది' సినిమాలో నటించిన ప్రధాన తారాగణం ఎవరు?

ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించారు.

2. చిన్నప్పుడు చిరంజీవి స్టార్డమ్ గురించి రామ్ చరణ్ ఏమన్నారు?

చిరంజీవి స్టార్డమ్, అవార్డులు ఏవీ ఇంటికి వచ్చేవి కావని, సినీ పత్రికలు తాకాలన్నా భయపడేవాళ్లమని.. అందువల్ల చిన్నప్పుడు నాన్న ఎంత పెద్ద స్టారో తమకు తెలిసేది కాదని చరణ్ చెప్పారు.

3. శ్రీదేవి సాధారణ జీవితం గురించి జాన్వీ కపూర్ ఏం పంచుకున్నారు?

శ్రీదేవి ఇంట్లో చాలా సాధారణంగా ఉండేవారని, ప్రతి శుక్రవారం స్వయంగా చేపల మార్కెట్‌కి వెళ్లి పిల్లల కోసం చేపలను సెలెక్ట్ చేసి తెచ్చేవారని జాన్వీ గుర్తు చేసుకున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe