...
...
Next Story

Ram Charan Jr NTR: థియేటర్ బిజినెస్‌లోకి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్.. అల్లు అర్జున్, మహేష్ రూట్‌లో ఆర్ఆర్ఆర్ హీరోలు?

Ram Charan Jr NTR: రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా థియేటర్ బిజినెస్ లోకి వస్తున్నారా? ఈ ఇద్దరూ కలిసి సునీల్ నారంగ్ ఏషియన్ తో కలిసి మల్టీప్లెక్స్ ప్లాన్ చేస్తున్నారా? తాజాగా వస్తున్న వార్తలు ఇదే విషయాన్ని చెబుతున్నాయి.

Published on: Jul 31, 2026, 17:32:21 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Ram Charan Jr NTR: టాలీవుడ్ టాప్ హీరోలు కేవలం సినిమాల్లో నటిస్తూ రెమ్యునరేషన్ తీసుకోవడమే కాకుండా, బిజినెస్ రంగాన్ని కూడా శాసించేలా భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా మల్టీప్లెక్స్ బిజినెస్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు తెచ్చిన ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్‌ను ఊపేస్తోంది. ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్స్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా హైదరాబాద్‌లో సొంత మల్టీప్లెక్స్ థియేటర్ల నిర్మాణం వైపు దృష్టి పెట్టినట్లు ఫిలిం నగర్‌లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Ram Charan Jr NTR: థియేటర్ బిజినెస్‌లోకి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్.. అల్లు అర్జున్, మహేష్ రూట్‌లో ఆర్ఆర్ఆర్ హీరోలు?
Ram Charan Jr NTR: థియేటర్ బిజినెస్‌లోకి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్.. అల్లు అర్జున్, మహేష్ రూట్‌లో ఆర్ఆర్ఆర్ హీరోలు?

సౌత్ ఇండియాలోనే అతిపెద్ద థియేటర్ చైన్‌లలో ఒకటైన ఏషియన్ సినిమాస్ (Asian Cinemas) అధినేత సునీల్ నారంగ్ భాగస్వామ్యంతో ఇప్పటికే మహేష్ బాబు, అల్లు అర్జున్ సంచలనాలు సృష్టించారు. ఇప్పుడు ఇదే బాటలో రామ్ చరణ్ కూడా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

రామ్ చరణ్ 'ఏఆర్‌సీ సినిమాస్' ప్లానింగ్.. ఐటీ కారిడార్‌పై కన్ను

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తనదైన శైలిలో బ్రాండ్ వ్యాల్యూ పెంచుకునేలా 'ఏఆర్‌సీ సినిమాస్' (ARC Cinemas) పేరుతో లగ్జరీ మల్టీప్లెక్స్‌ను ప్రారంభించేందుకు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారని ప్రచారం సాగుతోంది.

ఏషియన్ సినిమాస్‌తో కలిసి నిర్మించే ఈ కాంప్లెక్స్ కోసం గచ్చిబౌలి, రాయదుర్గం లేదా హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో స్థల పరిశీలన జరుగుతున్నట్లు సమాచారం. ఈ మధ్యే పెద్ది మూవీతో బిగ్ హిట్ అందుకున్న చరణ్.. తన కొత్త బిజినెస్ దిశగా వేగంగా అడుగులు వేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

గచ్చిబౌలిలో ఎన్టీఆర్ మల్టీప్లెక్స్? నందమూరి టీమ్ ఇచ్చే క్లారిటీ ఇదే

మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా హైదరాబాద్ ఐటీ హబ్ అయిన గచ్చిబౌలి పరిసరాల్లో ఒక భారీ ప్రీమియం మల్టీప్లెక్స్ నిర్మించబోతున్నారని సోషల్ మీడియాలో కథనాలు షికారు చేశాయి. దీంతో నందమూరి ఫ్యాన్స్ కూడా తీవ్ర ఆసక్తి చూపించారు.

ఇప్పటికే మహేష్ బాబు నిర్మించిన 'ఏఎమ్‌బీ సినిమాస్' (AMB Cinemas) హైదరాబాద్‌లోనే నంబర్ వన్ మూవీ ఎక్స్‌పీరియన్స్ డెస్టినేషన్‌గా నిలిచింది. ఇక అల్లు అర్జున్ కోకాపేటలో ప్రారంభించిన 'ఏఏఏ సినిమాస్' (AAA Cinemas) కూడా లగ్జరీ సీటింగ్, ఈపీఐక్యూ (EPIQ) స్క్రీన్లతో ప్రేక్షకుల నుంచి విశేషాదరణ పొందుతోంది. మాస్ మహారాజా రవితేజ 'ఏఆర్‌టీ సినిమాస్', విజయ్ దేవరకొండ 'ఏవీడీ సినిమాస్' కూడా మంచి ప్రాఫిట్స్‌తో రన్ అవుతున్నాయి.

కార్పొరేట్ దిగ్గజాలైన పీవీఆర్-ఐనాక్స్ (PVR-Inox) సంస్థలకు పోటీగా స్టార్ హీరోలు అందిస్తున్న భారీ స్క్రీన్స్, వరల్డ్ క్లాస్ డాల్బీ అట్మాస్ సౌండింగ్, రీజనబుల్ ధరల్లో దొరికే ఫుడ్ అండ్ బెవరేజెస్ ప్రేక్షకులకు పిచ్చిపిచ్చిగా నచ్చేస్తున్నాయి. ఇప్పుడు చరణ్ కూడా ఈ రేసులోకి దిగితే హైదరాబాద్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఎగ్జిబిషన్ బిజినెస్ మరింత హాట్ హాట్‌గా మారడం ఖాయం.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe