...
...
Next Story

Peddi Japan Fans: రామ్‌ చరణ్ పెద్ది క్రేజ్.. మూవీ కోసమే టోక్యో నుంచి హైదరాబాద్ వచ్చిన జపాన్ ఫ్యాన్స్.. వీడియోలు వైరల్

Peddi Japan Fans: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ మామూలుగా లేదు. 'పెద్ది' సినిమా చూడటం కోసమే జపాన్ నుంచి ఇద్దరు మహిళా అభిమానులు హైదరాబాద్ వచ్చారు. టోక్యోకు చెందిన వీరు 5 రోజులు సెలవు పెట్టి, ఏకంగా 10 సార్లు సినిమా చూసేందుకు ప్లాన్ చేసుకోవడం విశేషం.

Published on: Jun 5, 2026, 15:59:41 IST
Advertisement

Peddi Japan Fans: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ అంతర్జాతీయ సరిహద్దులు దాటి దూసుకుపోతోంది. జపాన్‌కు చెందిన ఇద్దరు వీరాభిమానులు చరణ్ తాజా సంచలనం 'పెద్ది' సినిమాను థియేటర్లలో చూసేందుకు ఏకంగా టోక్యో నుంచి హైదరాబాద్ నగరానికి తరలివచ్చారు. వీళ్ల వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

పెద్ది కోసం జపాన్ నుంచి

రామ్‌ చరణ్ పెద్ది క్రేజ్.. మూవీ కోసమే టోక్యో నుంచి హైదరాబాద్ వచ్చిన జపాన్ ఫ్యాన్స్ (x/Telugu70mm)
రామ్‌ చరణ్ పెద్ది క్రేజ్.. మూవీ కోసమే టోక్యో నుంచి హైదరాబాద్ వచ్చిన జపాన్ ఫ్యాన్స్ (x/Telugu70mm)

మసామి, క్రిస్ అనే ఇద్దరు జపనీస్ యువతులు రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్, నటనకు పూర్తిగా ఫిదా అయ్యారు. ఈ క్రేజీ ఫ్యాన్స్ తమ ఆరాధ్య నటుడి సినిమా పెద్దిని మొదటి రోజే థియేటర్లలో లోకల్ ఫ్యాన్స్ వైబ్‌తో ఎంజాయ్ చేయాలని గట్టిగా డిసైడ్ అయ్యారు. అందుకోసం ప్రత్యేకంగా జపాన్ నుంచి హైదరాబాద్ కు వచ్చేశారు.

10 షోలు చూడడమే టార్గెట్!

ఈ జపాన్ ఫ్యాన్స్ ఐదు రోజుల పాటు తమ ఆఫీసులకు సెలవు పెట్టి మరీ టోక్యో నుంచి ఫ్లైట్ ఎక్కేశారు. సినిమా విడుదల కావడానికి రెండు రోజుల ముందే భాగ్యనగరంలో ల్యాండ్ అయి, ఇక్కడి మెగా అభిమానులతో కలిసి థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు.

హైదరాబాద్‌లోని ప్రముఖ మల్టీప్లెక్స్‌లతో పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలోనూ ‘పెద్ది’ సినిమాను చూస్తూ వీరు ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం ఒక్కసారి సినిమా చూసి వెళ్ళిపోవడానికి వీరు ఇక్కడికి రాలేదు. 10 సార్లు థియేటర్లలో పెద్ది మూవీ చూడటమే టార్గెట్ గా పెట్టుకున్నారు.

పెద్ది సాంగ్స్ పాడుతూ

రామ్ చరణ్ కు ఈ జపాన్ ఫ్యాన్స్ వీరాభిమానులుగా మారిపోయారు. చరణ్ ఫొటోలు, పేరుతో హడావుడి చేస్తున్నారు. థియేటర్ల వద్ద స్థానిక మెగా ఫ్యాన్స్‌తో కలిసి వీరు చేస్తున్న హంగామా, 'పెద్ది' పాటలు పాడుతూ సందడి చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ‘రయ్ రయ్ రా రా’, ‘మసా మసా’ అంటూ సాంగ్స్ పాడుతూ వైబ్ అవుతున్నారు.

జపాన్‌లోనూ భారీ అంచనాలు

గతంలో రామ్ చరణ్‌ను ఆయన జూబ్లీహిల్స్ నివాసంలో ఈ జపాన్ ఫ్యాన్స్ కలిశారు. అప్పుడు తమ అభిమాన హీరోను చూసి ఎమోషనల్ అయ్యారు. అప్పట్లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను థియేటర్లలో వందకు పైగా సార్లు చూశామని చెప్పి చరణ్‌ను ఆశ్చర్యపరిచారు. తమ దేశంలో కూడా 'పెద్ది' సినిమాను సరైన జపనీస్ సబ్‌టైటిల్స్‌తో త్వరగా విడుదల చేయాలని వారు ఈ సందర్భంగా మేకర్స్‌ను కోరుంటున్నారు. తెలుగు సినిమా గ్లోబల్ మార్కెట్‌ను ఏ విధంగా శాసిస్తోందో చెప్పడానికి జపాన్ ఫ్యాన్స్ చూపిస్తున్న ఈ అంకితభావమే ఒక నిదర్శనం.

People Also Ask (FAQ)

1. 'పెద్ది' సినిమా చూడటానికి జపాన్ అభిమానులు ఎక్కడికి వచ్చారు?

రామ్ చరణ్ నటించిన 'పెద్ది' సినిమాను థియేటర్లలో చూసేందుకు జపాన్ రాజధాని టోక్యో నుంచి అభిమానులు నేరుగా హైదరాబాద్ నగరానికి వచ్చారు.

2. జపాన్ నుంచి వచ్చిన అభిమానులు ఎన్నిసార్లు ఈ సినిమా చూడాలని ప్లాన్ చేశారు?

హైదరాబాద్‌లోని వేర్వేరు థియేటర్లలో 'పెద్ది' సినిమాను కనీసం 10 సార్లు చూడాలని ఈ జపనీస్ అభిమానులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

3. 'పెద్ది' సినిమా దర్శకుడు, సంగీత దర్శకుడు ఎవరు?

ఈ భారీ చిత్రానికి బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించగా, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks