Peddi Trailer: మెగా బ్లాస్ట్ కు అంతా రెడీ.. పెద్ది ట్రైలర్ రిలీజ్ ఈ రోజే.. ముంబైలో గ్రాండ్ ఈవెంట్.. టైమ్ ఎప్పుడంటే?

Peddi Trailer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముంబై సిద్ధమైంది. జియో వరల్డ్ డ్రైవ్‌లో ఇవాళ జరగబోయే ఈ ఈవెంట్ వివరాలు, సినిమా రిలీజ్ డేట్ అప్‌డేట్స్ మీకోసం.

Published on: May 18, 2026, 08:50:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Peddi Trailer: మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ మోస్ట్ అవేటెడ్ రోజు వచ్చేసింది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న భారీ చిత్రం 'పెద్ది' ట్రైలర్ రిలీజ్ ఇవాళే (మే 18). ఈ ట్రైలర్ రిలీజ్ లాంఛ్ ఈవెంట్, టైమింగ్ వివరాల గురించి ఇక్కడ చూసేయండి.

పెద్ది పోస్టర్ లో రామ్ చరణ్
పెద్ది పోస్టర్ లో రామ్ చరణ్

పెద్ది ట్రైలర్

క్రేజీ రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది మూవీ ట్రైలర్ కోసం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముంబైలో సోమవారం గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ప్రముఖ 'జియో వరల్డ్ డ్రైవ్' వేదికగా అత్యంత వైభవంగా విడుదల చేయనున్నారు.

టైమ్ ఎప్పుడంటే?

నేటి మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఈ వేడుక లైవ్ కానుంది. ఈ ట్రైలర్‌పై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై విపరీతమైన క్రేజ్ పెంచగా, ఈ ట్రైలర్ సినిమా హైప్‌ను మరింత పెంచుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ముంబై చేరుకున్న రామ్ చరణ్

పెద్ది ట్రైలర్ లాంఛ్ గ్రాండ్ ఈవెంట్ కోసం హీరో రామ్ చరణ్ ఇప్పటికే ముంబై చేరుకున్నారు. చిత్ర కథానాయిక జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబు సానతో పాటు మిగిలిన చిత్ర యూనిట్ సభ్యులు ఈ లాంచ్ ఈవెంట్‌ లో పాల్గొనేందుకు ముంబై చేరుకుంటున్నారు. పాన్ ఇండియా మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని చిత్ర బృందం ముంబైలో ఈ భారీ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది.

పెద్ది రిలీజ్ డేట్

రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పల్లెటూరి నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. వృద్ధి సినిమాస్ పతాకంపై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ అందించారు. పలు భారతీయ భాషల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'పెద్ది' సినిమా జూన్ 4, 2026 నుంచి థియేటర్లలో ఆడియన్స్ తో కేకలు పెట్టించనుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

'పెద్ది' సినిమా ట్రైలర్ ఎప్పుడు, ఎక్కడ విడుదలవుతుంది?

జవాబు: 'పెద్ది' సినిమా ట్రైలర్ ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్‌లో మధ్యాహ్నం 3 గంటల తర్వాత గ్రాండ్‌గా విడుదల కానుంది.

ప్రశ్న: 'పెద్ది' సినిమా డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు?

జవాబు: ఈ చిత్రానికి బుచ్చిబాబు సాన దర్శకత్వం వహించగా, మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

ప్రశ్న: రామ్ చరణ్ 'పెద్ది' సినిమా ఎప్పుడు రిలీజ్ కానుంది?

జవాబు: ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా బహుభాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More