...
...
Next Story

ట్రైల‌ర్‌ను ఫ‌స్ట్ చ‌ర‌ణ్‌ చూసి ఎక్స్‌ట్రార్డిన‌రీ అన్నారు-వింటేజీ చిరంజీవిని చూస్తారు-నా కోసం నయనతార: అనిల్ రావిపూడి

మన శంకర వరప్రసాద్ గారు మూవీతో ఈ సంక్రాంతికి మళ్లీ మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈ రోజు ట్రైలర్ రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా అనిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు. ట్రైలర్ ను చరణ్ చూసి ఎక్స్ ట్రార్డినరీగా ఉందన్నాడని చెప్పాడు.

Published on: Jan 4, 2026, 19:08:12 IST
Advertisement

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి-మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో వస్తున్న సినిమా మన శంకర వరప్రసాద్ గారు. ఈ మూవీ 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్ ను ఆదివారం (జనవరి 4) రిలీజ్ చేశారు. కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఎలిమెంట్లతో ఇది ఫుల్ ఎంటర్ టైనర్ లా ఉంది. ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు.

మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్

అనిల్ రావిపూడి (x/Shine_Screens)
అనిల్ రావిపూడి (x/Shine_Screens)

చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న మూవీ మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్ ఇవాళ రిలీజైంది. ఈ మూవీలో విక్టరీ వెంకటేశ్ తళుక్కుమని మెరిశారు. ఈ ట్రైలర్ పాజిటివ్ రియాక్షన్స్ వస్తున్నాయి.

తిరుపతిలో జరిగిన మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘తిరుపతి అంటే నాకు చాలా స్పెషల్. ఏ సినిమా మొదలెట్టినా, రిలీజ్ ఉన్నా ఇక్కడికి వచ్చి స్వామి ఆశీస్సులు తీసుకుంటాను’’ అని చెప్పాడు.

వింటేజీ చిరంజీవి

‘‘నాకు చిరంజీవి అంటే ఎలా ఇష్టమో. ఎలా చూడాలనుకుని కథ రాసుకున్నానో అలాగే మీరు చూస్తారు. టైమ్ మిషన్ ఎక్కి ఒక రౌండ్ వేసి వస్తారు. చిరంజీవిలోని ఫన్ టైమింగ్ చూస్తారు. నేను రాసిన దానికంటే ఆయన 100 టైమ్స్ బెటర్ గా చేశారు. పండక్కి బాక్సాఫీస్ బద్దలు కావాలి. మీసాల పిల్ల సాంగ్ రికార్డులు బ్రేక్ చేసింది. భీమ్స్ కు థ్యాంక్స్’’ అని అనిల్ రావిపూడి అన్నాడు.

చరణ్ ఏం చెప్పారంటే

చిరంజీవి, వెంకటేష్ ఈగోలు లేకుండా ఫ్రెండ్స్ లా పని చేశారు. ఇద్దరు కలిసి మీకు ఫీస్ట్ ఇవ్వబోతున్నారు. నయనతార చాలా సపోర్ట్ చేశారు. నా కోసం ప్రమోషన్స్ కూడా చేశారు. నాకు ప్రమోషన్ చేశారంటే ఆమెకు ప్రెషర్ వస్తుంది’’ అని అనిల్ రావిపూడి పేర్కొన్నాడు.

సంక్రాంతికి రావడం హిట్ కొట్టడం డైరెక్టర్ అనిల్ రావిపూడికి అలవాటుగా మారింది. మరోసారి పొంగల్ రోజు ఆడియన్స్ కు ఎంటర్ టైన్మెంట్ అందించేందుకు మన శంకర వరప్రసాద్ గారుతో వస్తున్నాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe