...
...
Next Story

RC17: రామ్ చరణ్– సుకుమార్ కాంబోలో సంచలనం.. కియారా అద్వానీ ప్లేస్‌లో ‘ధురంధర్’ బ్యూటీ సారా అర్జున్?

RC17: పెద్దితో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు రామ్ చరణ్. ఇప్పుడు అందరి ఫోకస్ ఆయన నెక్స్ట్ మూవీపైనే ఉంది. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఆర్సీ 17 మూవీ నుంచి ఓ క్రేజీ బజ్ వైరల్ గా మారింది. ఈ సినిమాలో హీరోయిన్ గా ధురంధర్ బ్యూటీ సారా అర్జున్ ను తీసుకుంటారనే టాక్ హాట్ టాపిక్ గా మారింది.

Published on: Aug 19, 2026, 06:08:09 IST
Advertisement

RC17: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆర్‌సీ 17’ (RC17). ఈ సినిమాకు సంబంధించిన కాస్టింగ్ అప్‌డేట్స్ నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట బాలీవుడ్ భామ కియారా అద్వానీ (Kiara Advani) పేరు బలంగా వినిపించింది. అయితే తాజాగా ‘ధురంధర్’ (Dhurandhar) మూవీతో నేషనల్ సెన్సేషన్‌గా మారిన సారా అర్జున్ (Sara Arjun) ను ఎంపిక చేశారనే టాక్ వైరల్ గా మారింది.

కియారా నుంచి సారా అర్జున్ వైపు

రామ్ చరణ్– సుకుమార్ కాంబోలో సంచలనం.. కియారా అద్వానీ ప్లేస్‌లో ‘ధురంధర్’ బ్యూటీ సారా అర్జున్?
రామ్ చరణ్– సుకుమార్ కాంబోలో సంచలనం.. కియారా అద్వానీ ప్లేస్‌లో ‘ధురంధర్’ బ్యూటీ సారా అర్జున్?

'రంగస్థలం' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రామ్ చరణ్ - సుకుమార్ కాంబోలో రాబోతున్న 'ఆర్‌సీ 17' మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్ ఎంపికపై దర్శకుడు సుకుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. సారా అర్జున్ వైపే ఆయన మొగ్గు చూపారని తెలిసింది.

మూడోసారి చూపిస్తే

రామ్ చరణ్, కియారా అద్వానీ జోడీ ఇప్పటికే 'వినయ విధేయ రామ', 'గేమ్ చేంజర్' చిత్రాల్లో నటించారు. ఒకే కాంబినేషన్‌ను ముచ్చటగా మూడోసారి చూపిస్తే ప్రేక్షకులకు ఫ్రైష్‌నెస్ మిస్ అవుతుందనే ఉద్దేశంతోనే సుకుమార్ కొత్త పేయిరింగ్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

ధురంధర్ తో సెన్సేషన్

బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ ‘ధురంధర్’, ‘ధురంధర్ 2’ చిత్రాలలో యలీనా పాత్రలో సారా అర్జున్ ప్రదర్శించిన నటన పాన్-ఇండియా స్థాయిలో ప్రశంసలు అందుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా 'నాన్న' (Deiva Thirumagal), 'పోన్నియిన్ సెల్వన్' చిత్రాల ద్వారా లభించిన గుర్తింపునకు తోడు, ఇప్పుడు హీరోయిన్‌గా సారా అర్జున్‌కు ఉన్న నేషనల్ క్రేజ్ ఈ సినిమా బిజినెస్‌కి ప్లస్ కానుంది.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ‘రంగస్థలం’ మ్యూజికల్ హిట్ తర్వాత సుకుమార్-చరణ్-డీఎస్పీ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుందని అంటున్నారు. మరోవైపు సెప్టెంబర్ నెలలో రామ్ చరణ్ - సారా అర్జున్‌లపై ఫోటోషూట్ నిర్వహించిన అనంతరం కాస్టింగ్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe