గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ మంచి సినిమాలను మనస్ఫూర్తిగా ఎంకరేజ్ చేస్తుంటాడు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్‌వీర్ సింగ్, డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ ది రివెంజ్' సినిమాపై చరణ్ తనదైన స్టైల్‌లో ఒక సూపర్ రివ్యూ ఇచ్చాడు. సినిమా చూసిన వెంటనే ఎక్స్ వేదికగా అతడు పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
సహజంగా, ఉత్కంఠభరితంగా ఉంది..

ధురంధర్ ది రివెంజ్ సినిమా చాలా సహజంగా, ఉత్కంఠభరితంగా, మనసుపై బలమైన ప్రభావం చూపేలా ఉందని రామ్ చరణ్ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. డైరెక్టర్ ఆదిత్య ధర్ సినిమా స్థాయిని, అందులోని భావోద్వేగాలను చాలా అద్భుతంగా ఒకచోట చేర్చాడని, అసలు ఈ సినిమాతో ఆయన చేసిన మ్యాజిక్ నిజంగా అద్వితీయం అని చరణ్ మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడు. ఒక పాన్ ఇండియా స్టార్ ఇలా ఒక బాలీవుడ్ డైరెక్టర్ పనితనాన్ని పొగడటం చూసి అభిమానులు అంతా మురిసిపోతున్నారు.
రణ్‌వీర్ అదరగొట్టేశాడు.. మిగతా వాళ్ళ నటన కూడా సూపర్
ఇక నటీనటుల గురించి చరణ్ మాట్లాడుతూ.. హీరో రణ్‌వీర్ సింగ్ అసాధారణమైన నటనతో అదరగొట్టేశాడని ప్రశంసించాడు. అతని నటనలో ఉన్న తీవ్రత సినిమా మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు ప్రేక్షకుల దృష్టి పక్కకు పోకుండా కట్టిపడేస్తుందని చరణ్ చెప్పాడు.
ఇక సీనియర్ నటులు మాధవన్ సార్, సంజయ్ దత్ సార్, అర్జున్ రాంపాల్ సార్ ముగ్గురూ తమ పవర్‌ఫుల్ నటనతో చాలా స్ట్రాంగ్‌గా నిలబడ్డారని మెచ్చుకున్నాడు. అలాగే సారా అర్జున్ తన పాత్రలో చాలా గొప్పగా నటించిందని చరణ్ ప్రత్యేకంగా చెప్పాడు.
సంగీతం అదిరింది.. నిర్మాతలకు హ్యాట్సాఫ్
శాశ్వత్ సచ్దేవ్ అందించిన సంగీతం ఈ సినిమాను ఇంకో మెట్టు పైకి ఎక్కించిందని రామ్ చరణ్ అన్నాడు. ఇండియన్ సినిమాలో మనల్ని కట్టిపడేసే అత్యుత్తమ సినిమాల్లో ఒకదాన్ని మనకు అందించినందుకు, డైరెక్టర్ ఆలోచనను పూర్తిగా నమ్మినందుకు జియో స్టూడియోస్, జ్యోతి దేశ్‌పాండేలకు చరణ్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపాడు. చివరగా టీమ్ అందరికీ శుభాకాంక్షలు చెబుతూ చరణ్ తన రివ్యూను ముగించాడు.
బాలీవుడ్‌కు ఏమైంది?
{{/usCountry}}శాశ్వత్ సచ్దేవ్ అందించిన సంగీతం ఈ సినిమాను ఇంకో మెట్టు పైకి ఎక్కించిందని రామ్ చరణ్ అన్నాడు. ఇండియన్ సినిమాలో మనల్ని కట్టిపడేసే అత్యుత్తమ సినిమాల్లో ఒకదాన్ని మనకు అందించినందుకు, డైరెక్టర్ ఆలోచనను పూర్తిగా నమ్మినందుకు జియో స్టూడియోస్, జ్యోతి దేశ్‌పాండేలకు చరణ్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపాడు. చివరగా టీమ్ అందరికీ శుభాకాంక్షలు చెబుతూ చరణ్ తన రివ్యూను ముగించాడు.
బాలీవుడ్‌కు ఏమైంది?
{{/usCountry}}ధురంధర్ 2 మూవీ ప్రీమియర్ షోల నుంచే వరుసగా ఒక్కో టాలీవుడ్ స్టార్ ఈ మూవీపై తమ రివ్యూలు ఇస్తూ వస్తున్నారు. మొదట అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, తాజాగా రామ్ చరణ్ కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. కానీ ఆశ్చర్యకరంగా బాలీవుడ్ లోని ప్రముఖులు మాత్రం ఈ సినిమాపై మౌనంగా ఉన్నారు.
అక్కడి స్టార్ హీరోలు ఎవరూ ఈ మూవీ గురించి ఇప్పటి వరకూ మాట్లాడలేదు. ధురంధర్ సినిమా సమయంలో స్పందించని తెలుగు హీరోలు సీక్వెల్ ను మాత్రం ఆకాశానికెత్తుతూ ట్వీట్లు చేస్తున్నారు. అదే సమయంలో బాలీవుడ్ మౌనం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సౌత్ సినిమాల హవా పెరుగుతున్న సమయంలో హిందీ ఇండస్ట్రీ నుంచి ఇంత పెద్ద హిట్ వచ్చినా స్పందించకపోవడమేంటన్న ప్రశ్న తలెత్తుతోంది.