Ram Charan Modi: రిపబ్లిక్ సమ్మిట్ 2026లో థియేటర్లలో పాప్‌కార్న్ ధరలు తగ్గించాలంటూ సామాన్య ప్రేక్షకుల పక్షాన మాట్లాడి అందరి దిల్ ఖుష్ చేసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan).. తాజాగా తన అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ఒక మోస్ట్ పవర్‌ఫుల్ ఫోటోను షేర్ చేశారు. ఈ ప్రతిష్టాత్మక నేషనల్ కాన్‌క్లేవ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చరణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

పీఎం మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం ఆయనతో దిగిన ఒక అరుదైన ఫోటోను ఇన్ స్టాగ్రామ్, ఎక్స్ వేదికగా పంచుకుంటూ రామ్ చరణ్ రాసిన నోట్ ప్రస్తుతం నేషనల్ లెవెల్ లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
పీఎం మోదీతో కలవడం ఒక గొప్ప గౌరవం
రామ్ చరణ్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో ఎంతో ఆత్మీయంగా కరచాలనం చేస్తూ మాట్లాడుతున్న విజువల్ ను పోస్ట్ చేశారు. ఈ ఫోటోతో పాటు చరణ్ తన మనసులోని మాటను పంచుకున్నారు.
“రిపబ్లిక్ సమ్మిట్ 2026 వేదికపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీని కలవడం నాకొక గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ఆయన 'వికసిత్ భారత్' (Viksit Bharat) విజన్.. అలాగే దేశమే సర్వోన్నతం అనే ఆయన 'ఇండియా ఫస్ట్' (India First) సంకల్పం నన్ను ఎంతగానో ప్రేరేపించాయి. దేశ పౌరులుగా సమాజం పట్ల మనకున్న బాధ్యతలను ఆ మాటలు మరోసారి బలంగా గుర్తుచేశాయి. ఈ కాన్‌క్లేవ్‌కు నన్ను ఆహ్వానించినందుకు అర్నబ్ గోస్వామి (Arnab Goswami)కి, మొత్తం రిపబ్లిక్ మీడియా టీమ్‌కు నా ప్రత్యేక కృతజ్ఞతలు” అంటూ రామ్ చరణ్ మెగా పోస్ట్ పెట్టారు.
రామ్ చరణ్ చేసిన ఈ పోస్ట్ చూసి మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు లైక్స్ వర్షం కురిపిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన రామ్ చరణ్.. ఇలా జాతీయ వేదికలపై దేశ ప్రగతి గురించి, పౌరుల బాధ్యతల గురించి మాట్లాడటం ఆయన మెచ్యూరిటీని చూపిస్తుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
పెద్ది సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న చరణ్
{{/usCountry}}రామ్ చరణ్ చేసిన ఈ పోస్ట్ చూసి మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు లైక్స్ వర్షం కురిపిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన రామ్ చరణ్.. ఇలా జాతీయ వేదికలపై దేశ ప్రగతి గురించి, పౌరుల బాధ్యతల గురించి మాట్లాడటం ఆయన మెచ్యూరిటీని చూపిస్తుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
పెద్ది సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న చరణ్
{{/usCountry}}ప్రస్తుతం రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర తన లేటెస్ట్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi) తో రూ. 400 కోట్లకు పైగా వసూళ్లతో నాన్‌స్టాప్ విధ్వంసం సృష్టిస్తున్నారు. ఈ సినిమా చారిత్రాత్మక విజయం సాధించిన సందర్భంగా ఈరోజే (జూన్ 23న) హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో గ్రాండ్ సక్సెస్ మీట్ కూడా జరుపుకున్నారు.
ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. ఒకవైపు ఢిల్లీలో పీఎం మోదీని కలిసి నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయిన చరణ్.. సాయంత్రానికి హైదరాబాద్ లో మెగాస్టార్ తో స్టేజ్ షేర్ చేసుకోబోతుండటంతో మెగా ఫ్యాన్స్ కు ఈరోజు పూనకాలే అని చెప్పొచ్చు.