...
...
Next Story

Ram Charan Peddi Dubbing: పెద్ది కోసం రామ్ చరణ్ డబ్బింగ్ ఎలా చెబుతున్నాడో చూశారా.. ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేసిన స్టార్

రామ్ చరణ్ (Ram Charan) హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న 'పెద్ది' మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్స్ వచ్చాయి. ఏఆర్ రెహమాన్ కంపోచ్ చేసిన రెండో పాట సోమవారం (మార్చి 2) విడుదల కానుండగా.. చరణ్ అప్పుడే డబ్బింగ్ పనులు కూడా ప్రారంభించి అభిమానుల్లో జోష్ నింపాడు.

Published on: Mar 1, 2026, 17:39:15 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ 'పెద్ది' (Peddi) షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ ఒకేసారి రెండు అదిరిపోయే అప్‌డేట్స్ ఇచ్చారు. ఈ మూవీ కోసం చరణ్ డబ్బింగ్ చెబుతున్న వీడియో పోస్ట్ చేసి అభిమానులను సర్‌ప్రైజ్ చేశాడు.

డబ్బింగ్ స్టూడియోలో రామ్ చరణ్ సందడి

Ram Charan Peddi Dubbing: పెద్ది కోసం రామ్ చరణ్ డబ్బింగ్ ఎలా చెబుతున్నాడో చూశారా.. ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేసిన స్టార్
Ram Charan Peddi Dubbing: పెద్ది కోసం రామ్ చరణ్ డబ్బింగ్ ఎలా చెబుతున్నాడో చూశారా.. ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేసిన స్టార్

ఒకవైపు పెద్ది మూవీ షూటింగ్ జరుగుతుండగానే.. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగవంతం చేశాడు డైరెక్టర్ బుచ్చిబాబు. ఇందులో భాగంగా రామ్ చరణ్ ఇప్పటికే డబ్బింగ్ పనులు ప్రారంభించాడు. ఈ సందర్భంగా డబ్బింగ్ స్టూడియోలో తనకూ, దర్శకుడికి మధ్య జరిగిన సరదా సంభాషణకు సంబంధించిన వీడియోను చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. షూటింగ్ సెట్స్‌లోనే కాకుండా డబ్బింగ్ సమయంలోనూ చరణ్ ఎంత యాక్టివ్‌గా ఉన్నారో ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది.

ఆ వీడియోలో బుచ్చిబాబును చరణ్ ఆట పట్టించడం చూడొచ్చు. చికిరి సాంగ్ లో మోహిత్ చౌహాన్ వాయిస్ చేసినట్లు తన డబ్బింగ్ కూడా నువ్వే చెప్పొచ్చు కదా అని చరణ్ అందులో అనడం చూడొచ్చు. ఏమది అనే ఓ డైలాగ్ ఈ డబ్బింగ్ కోసం చరణ్ చెప్పాడు.

రేపే రెండో పాట 'రయ్ రయ్ రా రా'..

ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ పెద్ది మూవీకి సంగీతం అందిస్తుండటంతో సాంగ్స్ కోసం మెగా ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే రేపు అంటే సోమవారం (మార్చి 2) ఈ సినిమాలోని రెండో సింగిల్ "రయ్ రయ్ రా రా" విడుదల కానుంది. రెహమాన్ మార్క్ ట్యూన్స్‌తో ఈ పాట చార్ట్‌బస్టర్‌గా నిలుస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే చికిరి చికిరి ఏ స్థాయిలో వైరల్ అయిందో చూశాం. చాలా రోజుల తర్వాత రెహమాన్ మార్క్ ట్యూన్స్, చరణ్ హుక్ స్టెప్ ఈ పాటకు హైలైట్ గా నిలిచాయి.

పెద్ది ఏప్రిల్ 30న విడుదల

మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సమర్పిస్తున్నాయి. అన్నీ కుదిరితే ఈ పాన్-ఇండియన్ సినిమాను ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. షూటింగ్ పూర్తి కాకముందే డబ్బింగ్ మొదలుపెట్టడం చూస్తుంటే, సినిమాను సకాలంలో థియేటర్లకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ ఎంతగా శ్రమిస్తుందో అర్థమవుతోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe