నేను, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు.. మేము యాక్టింగ్ ఎలా చేస్తామో తెలియకపోయినా ఛాన్స్ ఇచ్చారు: రామ్ చరణ్ కామెంట్స్
రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తనతోపాటు స్టార్ కిడ్స్ అయిన మరో ముగ్గురు హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన అశ్వినీ దత్, వైజయంతీ మూవీస్ కు థ్యాంక్స్ చెబుతూ చరణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
రోషన్ మేకా, అనస్వర రాజన్ కలిసి నటిస్తున్న ఛాంపియన్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గురువారం (డిసెంబర్ 18) జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ కు గెస్టుగా వచ్చిన రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తాము ఎలా నటిస్తామో కూడా తెలియకపోయినా తమకు మొదటి అవకాశం ఇచ్చిన అశ్వినీ దత్, వైజయంతీ మూవీస్ కు అతడు థ్యాంక్స్ చెప్పాడు.

రామ్ చరణ్ కామెంట్స్ వైరల్
ఛాంపియన్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ తనతోపాటు ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబులకు తొలి అవకాశం ఇచ్చిన అశ్వినీ దత్ కు కృతజ్ఞతలు తెలిపాడు.
“చాలా మంది హీరోలకు అంటే ఎన్టీఆర్ కు స్టూడెంట్ నంబర్ 1, అల్లు అర్జున్ కు గంగోత్రి, మహేష్ బాబుకు రాజకుమారుడు, నాకు చిరుత.. మా అందరికీ కామన్ గా ఉన్న వ్యక్తి దత్తు గారికి, వైజయంతీ మూవీస్ కు మనస్ఫూర్తిగా థ్యాంక్స్. మేము వచ్చిన కొత్తలో ఎంతో మంది ప్రొడ్యూసర్లు ఉండే ఉంటారు. కానీ ఒక వ్యక్తి మా అందరినీ నమ్మాడు. మాకు ఫ్యామిలీ బ్యాకప్ ఉండొచ్చు. కానీ మేము ఎలా నటిస్తామో తెలియదు. ఎలా పర్ఫామ్ చేస్తామో తెలియకపోయినా మాకు అవకాశం ఇచ్చారు. ఇంత మంది వ్యక్తులను యాక్టర్స్ ను చేసిన అశ్వినీ దత్ గారికి, వాళ్ల కుటుంబానికి థ్యాంక్స్. ఇప్పుడు రోషన్ కూడా అలాగే ఛాంపియన్ తో వస్తున్నాడు” అని రామ్ చరణ్ అన్నాడు.
పెద్ది గురించి అప్డేట్
రామ్ చరణ్ కనిపించకగానే అక్కడున్న అభిమానులు పెద్ది మూవీ అప్డేట్ కోసం అడిగారు. యాంకర్ కూడా ఆ విషయం అడగడంతో పెద్ది షూటింగ్ అవుతోందని చెప్పాడు. మార్చి 27నే రానున్నట్లు కన్ఫమ్ చేశాడు. ఇప్పుడు ఛాంపియన్, తర్వాత సంక్రాంతి సినిమాలు, ఆ తర్వాత ఎక్కడో చోట మేము దూరుతాములెండి అని చరణ్ అన్నాడు. అయితే పెద్ది మూవీ ఆలస్యం కావడం లేదని చరణ్ కామెంట్స్ తో మరోసారి నిరూపితమైంది.
అనస్వర రాజన్‌పై..
ఇక ఛాంపియన్ మూవీలో ఫిమేల్ లీడ్ గా నటించిన అనస్వర రాజన్ పై చరణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆమె ముఖంగా చాలా కళ ఉందని చెప్పాడు. రానున్న రోజుల్లో ఎంతో మంది పెద్ద ప్రొడక్షన్ హౌజ్‌లు, డైరెక్టర్ల నుంచి కాల్స్ ఆమెకు వస్తాయని, అందుకు సిద్ధంగా ఉండాలని అనడం విశేషం. ఇక మలయాళీ అయినా కూడా ఈ ఛాంపియన్ మూవీ కోసం తెలుగు నేర్చుకొని సొంతంగా డబ్బింగ్ చెప్పడం నిజంగా గొప్ప విషయమని అభినందించాడు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


