Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వస్తున్న మాస్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ థియేట్రికల్ రిలీజ్‌కు అంతా రెడీ అయిపోయింది. జూన్ 3 నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రీమియర్స్ పడుతుండగా.. గురువారం (జూన్ 4న) సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేస్తోంది.
టికెట్ల రేట్లు పెంపు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి, ముఖ్యంగా పెద్దిలాంటి భారీ బడ్జెట్ సినిమాలకు సపోర్ట్‌గా నిలుస్తూ ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు స్పెషల్ జీవోలు (GOs) పాస్ చేశాయి. థియేటర్లలో టికెట్ రేట్లు పెంచుకునే ఛాన్స్‌తో పాటు అర్ధరాత్రి, తెల్లవారుజామున బెనిఫిట్ షోలు వేసుకోవడానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. ఈ నిర్ణయంతో రామ్ చరణ్ రెండు రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, సినిమాటోగ్రఫీ మంత్రులకు స్పెషల్ థాంక్స్ చెబుతూ వరుసగా ట్వీట్లు చేశారు.
ఏపీ సర్కార్‌కు థాంక్స్
రామ్ చరణ్ మొదట ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తన బాబాయ్ పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు.
"తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్న ఏపీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారికి, ఏపీ ప్రభుత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు..." అని చరణ్ రాసుకొచ్చారు.
తెలంగాణ ప్రభుత్వానికి కూడా..
ఆ వెంటనే తెలంగాణ సర్కార్‌కు కూడా చరణ్ థాంక్స్ చెబుతూ ఇంకో ట్వీట్ చేశారు.
{{/usCountry}}ఆ వెంటనే తెలంగాణ సర్కార్‌కు కూడా చరణ్ థాంక్స్ చెబుతూ ఇంకో ట్వీట్ చేశారు.
{{/usCountry}}"తెలుగు చలనచిత్ర పరిశ్రమ డెవలప్‌మెంట్‌కు సపోర్ట్ చేస్తున్న తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారికి, గౌరవ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారికి, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, తెలంగాణ ప్రభుత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు..." అని చరణ్ ట్వీట్ చేశారు.
బాక్సాఫీస్ లెక్కలు మారుతాయి
నిజానికి ‘పెద్ది’ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ (Peddi pre-release business) ఓ రేంజ్‌లో జరిగింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోల పర్మిషన్స్ రావడంతో ఓపెనింగ్ డే కలెక్షన్స్ రికార్డ్ స్థాయిలో ఉండబోతున్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఈ స్పెషల్ షోల వల్ల భారీగా రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
రామ్ చరణ్ తన ట్వీట్లలో ఏపీ ప్రభుత్వం నుంచి ఎవరికి థాంక్స్ చెప్పారు?
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్‌లకు రామ్ చరణ్ కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం తరఫున చరణ్ ఎవరిని మెన్షన్ చేశారు?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు చరణ్ ధన్యవాదాలు తెలిపారు.
'పెద్ది' సినిమాకు ప్రభుత్వాలు ఎలాంటి సపోర్ట్ ఇచ్చాయి?
సినిమా రిలీజ్ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు పెంచుకోవడానికి, ఎర్లీ మార్నింగ్ స్పెషల్ షోలు (Benefit/Special Shows) వేసుకోవడానికి ప్రభుత్వాలు పర్మిషన్స్ ఇచ్చాయి.