...
...
Next Story

Ram Charan: నాన్న సెట్స్‌లో రామ్ చరణ్.. ఫాదర్స్ డే నాడు మెగాస్టార్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్.. సీక్రెట్ గా చిరంజీవి లుక్!

Ram Charan: ఫాదర్స్ డే రోజు మెగాస్టార్ చిరంజీవికి రామ్ చరణ్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. 'మెగా 158' షూటింగ్ సెట్స్‌కు రామ్ చరణ్ వెళ్లడం వైరల్ గా మారింది. దీంతో మెగా సెట్స్‌లో పండుగ వాతావరణం నెలకొంది. అయితే ఈ మూవీ నుంచి చిరంజీవి లుక్ ను సీక్రెట్ గా మెయింటైన్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Published on: Jun 22, 2026, 05:58:28 IST
Advertisement

Ram Charan: మెగాస్టార్ చిరంజీవి- బాబీ కొల్లి కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కుతోంది. అయితే సండే (జూన్ 22) హఠాత్తుగా ఈ మూవీ సెట్స్ లో పెద్ది ప్రత్యక్షమయ్యాడు. ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి చిరంజీవితో కాస్త టైమ్ గడిపేందుకు రామ్ చరణ్ వచ్చేశాడు. తన నాన్నను సర్ ప్రైజ్ చేశాడు. ఈ విషయాన్ని డైరెక్టర్ బాబీ కొల్లి సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

సెట్స్ లో రామ్ చరణ్

నాన్న సెట్స్‌లో రామ్ చరణ్.. ఫాదర్స్ డే నాడు మెగాస్టార్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్ (x/AlwaysRamCharan)
నాన్న సెట్స్‌లో రామ్ చరణ్.. ఫాదర్స్ డే నాడు మెగాస్టార్‌కు అదిరిపోయే సర్‌ప్రైజ్ (x/AlwaysRamCharan)

అంతర్జాతీయ పితృ దినోత్సవం (ఫాదర్స్ డే) సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సరికొత్త చిత్రం ‘#Mega158’ షూటింగ్ సెట్స్‌లో ఒక అపురూపమైన దృశ్యం ఆవిష్కృతమైంది. తన తండ్రిపై ఉన్న అమితమైన ప్రేమాభిమానాలను చాటుకుంటూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ షూటింగ్ స్పాట్‌కు నేరుగా వచ్చి చిరంజీవిని సర్‌ప్రైజ్ చేశారు. అక్కడ తన తండ్రితో కలిసి కాసేపు సరదాగా సమయాన్ని గడిపారు.

మెగా సెట్స్‌లో ఎమోషనల్ మూమెంట్స్

దర్శకుడు బాబీ కొల్లి (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ‘#ChiruBobby2’ సినిమా సెట్స్‌లో ఈ హృదయపూర్వక సంఘటన చోటుచేసుకుంది. ఫాదర్స్ డే రోజున రామ్ చరణ్ ఇలా హఠాత్తుగా సెట్స్‌కు రావడంతో చిత్ర యూనిట్ అంతా ఒక్కసారిగా ఆనందంలో మునిగిపోయింది.

చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ కాసేపు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. తండ్రీకొడుకుల మధ్య సాగిన ఈ ఎమోషనల్ అండ్ హార్ట్ వార్మింగ్ సంభాషణ అక్కడున్న ప్రతి ఒక్కరిలోనూ ఎంతో ఉత్సాహాన్ని నింపింది.

డైరెక్టర్ పోస్ట్

చిరంజీవి సెట్స్ కు రామ్ చరణ్ వచ్చిన విషయాన్ని డైరెక్టర్ బాబీ కొల్లి సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ‘‘మెగా 158 సెట్స్ లో బ్యూటీఫుల్ ఫాదర్స్ డే మూమెంట్ ను చూడటం ఆనందంగా ఉంది.సెట్స్ కు వచ్చిన రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవితో టైమ్ స్పెండ్ చేశారు. ఎంత పెద్ద స్టార్ అయినప్పటికీ ఫ్యామిలీపై ఉన్న లవ్ మాత్రం మారదు’’ అని రామ్ చరణ్ తో ఉన్న ఫొటోలను బాబీ పంచుకున్నాడు.

సీక్రెట్ గా లుక్

మెగాస్టార్ చిరంజీవి తన 158వ ప్రాజెక్ట్‌ను బాబీ దర్శకత్వంలో చేస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో మళ్లీ అదే క్రేజీ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks