...
...
Next Story

Ram Charan: రేపు కోయంబత్తూర్‌లో రామ్ చ‌ర‌ణ్‌కు స‌ర్జ‌రీ.. తోడుగా మెగా ఫ్యామిలీ.. సుకుమార్ మూవీ షూటింగ్ అప్పుడేనా?

Ram Charan Surgery: 'పెద్ది' షూటింగ్ సమయంలో తీవ్ర గాయమైనప్పటికీ సినిమా ప్రమోషన్ల కోసం సర్జరీని రామ్ చరణ్ పోస్ట్ పోన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సర్జరీ రేపు కోయంబత్తూరులో జరగబోతున్నట్లు తెలిసింది. దీని కోసం మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు ఉపాసన కూడా చరణ్ తో వెళ్లారని సమాచారం.

Published on: Jul 26, 2026, 17:20:41 IST
Advertisement

Ram Charan Surgery: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)కు సర్జరీ జరగబోతుంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన భారీ చిత్రం 'పెద్ది' (Peddi) షూటింగ్ సమయంలో చరణ్ మణికట్టుకు తీవ్రమైన గాయమైన సంగతి తెలిసిందే. అప్పుడు సినిమా షూటింగ్, ప్రమోషన్స్ కారణంగా సర్జరీ వాయిదా వేసుకున్నాడు. ఈ సర్జరీని రేపు (జూలై 27) నిర్వహించనున్నట్లు తెలిసింది.

పెద్ది మూవీ కోసం

రేపు కోయంబత్తూర్‌లో రామ్ చ‌ర‌ణ్‌కు స‌ర్జ‌రీ.. తోడుగా మెగా ఫ్యామిలీ.. సుకుమార్ మూవీ షూటింగ్ అప్పుడేనా? (PTI)
రేపు కోయంబత్తూర్‌లో రామ్ చ‌ర‌ణ్‌కు స‌ర్జ‌రీ.. తోడుగా మెగా ఫ్యామిలీ.. సుకుమార్ మూవీ షూటింగ్ అప్పుడేనా? (PTI)

రామ్ చరణ్ గాయానికి వైద్యులు వెంటనే విశ్రాంతి, శస్త్రచికిత్స అవసరమని సూచించారు. అయినా పెద్ది సినిమా చిత్రీకరణ ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో అలాగే షూటింగ్ పూర్తి చేయడమే కాకుండా సినిమా ప్రమోషన్లలో కూడా చురుగ్గా పాల్గొన్నాడు రామ్ చరణ్. ఇప్పుడు పెద్ది బాక్సాఫీస్ ప్రయాణం ముగియడంతో తన ఆరోగ్యంపై పూర్తి దృష్టి సారించాడు.

గంగా హాస్పిటల్లో సర్జరీ

తమిళనాడులోని కోయంబత్తూర్ లో అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన 'గంగా ఆసుపత్రి' (Ganga Hospital) లో రామ్ చరణ్‌కు రేపు మణికట్టు శస్త్రచికిత్స జరగనుందని సినీ వర్గాలు తెలిపాయి. ప్రపంచ స్థాయి ఆర్థోపెడిక్, హ్యాండ్/రిస్ట్ సర్జరీ సేవలకు ఈ ఆసుపత్రి పేరుగాంచింది.

ప్రముఖ ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ రాజశేఖరన్ ఆధ్వర్యంలో నిపుణులైన వైద్యుల బృందం ఈ ఆపరేషన్‌ను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో తీవ్రమైన నొప్పిని సైతం భరిస్తూ నెలల తరబడి చరణ్ ప్రమోషన్లను పూర్తి చేయడం ఆయన డెడికేషన్‌కు అద్దం పట్టిందనే కామెంట్లు వస్తున్నాయి.

కోయంబత్తూర్ చేరుకున్న మెగా ఫ్యామిలీ

ఈ క్లిష్ట సమయంలో చరణ్‌కు ధైర్యాన్నిచ్చేందుకు మెగా కుటుంబం కోయంబత్తూరుకు చేరుకుంది. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేనితో పాటు కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దే ఉండి చరణ్ పర్యవేక్షణ చూసుకుంటున్నారు. శస్త్రచికిత్స అనంతరం వైద్యుల సలహా మేరకు చరణ్ కొన్ని వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోనున్నాడు.

సుకుమార్ సినిమా

చరణ్ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. అయితే ఈ ఈ సర్జరీ ముగిసి, రీ-హాబిలిటేషన్ (తగిన కోలుకునే సమయం) పూర్తయిన తర్వాతే చరణ్ తన తదుపరి బిగ్ ప్రాజెక్ట్ సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నాడు. అంటే సుకుమార్ మూవీ షూటింగ్ స్టార్ట్ కావడానికి కనీసం 3 నెలలు పడుతుందని అంటున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks