సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) మరోసారి వార్తల్లో నిలిచాడు. 'వార్ 2' టీజర్‌లో కియారా అద్వానీ బికినీ ఫోటోలపై అతడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. నెటిజన్ల నుండి ఎదురైన భారీ వ్యతిరేకత నేపథ్యంలో.. ఆ ట్వీట్‌ను డిలీట్ చేసిన వర్మ.. తాజాగా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చాడు.
నా మనసులో ఉన్నదే చెప్పాను: వర్మ సమర్థన

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో విక్కీ లల్వానీతో మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ.. తన వ్యాఖ్యలను సమర్థించుకున్నాడు. "నేను ఆ ట్వీట్‌లో ఖచ్చితంగా ఏం రాశానో నాకు గుర్తులేదు. ఎందుకంటే నేను చాలా ట్వీట్లు పెడుతుంటాను. కానీ నా పాయింట్ ఒక్కటే.. ఒక అందమైన అమ్మాయిని బికినీలో ట్రైలర్‌లో చూపించినప్పుడు, అది ప్రేక్షకుల్లో ఏదో ఒక భావాన్ని ప్రేరేపించడానికే కదా?" అని అతడు ప్రశ్నించాడు.
అవి ప్రశంసలు: ఆర్జీవీ
అందమైన మహిళల గురించి తాను చేసే వ్యాఖ్యలను ‘పరోక్ష ప్రశంసలు’గా భావిస్తానని వర్మ పేర్కొన్నాడు. "రంగీలా రోజుల నుండి నేను అందమైన మహిళల పట్ల నా అభిప్రాయాలను దాచుకోలేదు. శ్రీదేవి విషయంలో కూడా నేను ఎప్పుడూ బహిరంగంగానే మాట్లాడాను. నా ఆలోచనలను వ్యక్తం చేసే విధానంలో నేను మారను, కానీ నా సినిమాలు మాత్రం భిన్నంగా ఉంటాయి" అని స్పష్టం చేశాడు. అయితే ఆ ట్వీట్‌ను ఎందుకు డిలీట్ చేశారనే ప్రశ్నకు మాత్రం తనకు గుర్తులేదని సమాధానమిచ్చాడు.
అసలు వివాదం ఏమిటి?
'వార్ 2' టీజర్‌లో కియారా అద్వానీ గ్లామరస్‌గా కనిపించిన సీన్లపై వర్మ గతంలో ఒక ట్వీట్ చేశాడు. "దేశాల మధ్య లేదా సమాజాల మధ్య యుద్ధం కంటే.. ఆమె పి..లను ఎవరు దక్కించుకుంటారు అనే దానిపై హృతిక్, ఎన్టీఆర్ మధ్య యుద్ధం జరిగితే, ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యేది" అనే అర్థం వచ్చేలా అసభ్యకర పదజాలంతో ట్వీట్ చేశాడు. ఒక నటి పట్ల ఇంత గౌరవం లేకుండా మాట్లాడటంపై సోషల్ మీడియాలో నెటిజన్లు అతనిపై విరుచుకుపడ్డారు.
బాక్సాఫీస్ వద్ద చతికిలబడ్డ 'వార్ 2'
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా వచ్చిన 'వార్ 2' ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ పవర్ ఉన్నప్పటికీ, బలహీనమైన కథనం, నాసిరకం వీఎఫ్ఎక్స్ (VFX) కారణంగా విమర్శల పాలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా ఆశించిన వసూళ్లను రాబట్టలేకపోయింది.
{{/usCountry}}అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా వచ్చిన 'వార్ 2' ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ పవర్ ఉన్నప్పటికీ, బలహీనమైన కథనం, నాసిరకం వీఎఫ్ఎక్స్ (VFX) కారణంగా విమర్శల పాలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా ఆశించిన వసూళ్లను రాబట్టలేకపోయింది.
{{/usCountry}}