Ram Gopal Varma: ఇది అల్లా, జీసెస్ మధ్య ఫైట్.. అమెరికా-ఇరాన్ యుద్ధంపై ఆర్జీవీ సంచలన ట్వీట్.. ఆ మతంలోకి మారతానంటూ!
Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెరతీశాడు. అమెరికా-ఇరాన్ యుద్ధంపై ఆర్జీవీ సంచలన ట్వీట్ చేశాడు. ఇది జీసస్, అల్లా మధ్య ఫైట్ అని పోస్టు పెట్టాడు.
ఎప్పుడూ వివాదాలతో సావాసం చేసే సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి కాంట్రవర్సీకి తెరతీశాడు. కాంటెంపరరీ ఇష్యూస్ పై తన స్టైల్లో రియాక్ట్ అయ్యే ఆర్జీవీ లేటెస్ట్ గా అమెరికా-ఇరాన్ యుద్ధంపై ట్వీట్ పెట్టాడు. ఈ కాంట్రవర్సీ ట్వీట్ తెగ వైరల్ గా మారింది. మతాల పేరుతో ఆర్జీటీ పెట్టిన పోస్టు సంచలనంగా మారింది.

యుద్ధంపై ఆందోళన
ప్రస్తుతం ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ పై యుద్ధం చేస్తున్నాయి. మిస్సైల్స్ తో విరుచుకుపడుతున్నాయి. బదులుగా ఇరాన్ కూడా డ్రోన్లు, మిస్సైల్స్ తో మిడిల్ ఈస్ట్ లోని అమెరికా ఎంబసీలపై దాడులు చేస్తున్నాయి. ప్రపంచమంతా ఈ యుద్ధం గురించి ఆందోళన చెందుతోంది.
ఆర్జీవీ ట్వీట్
అమెరికా-ఇరాన్ యుద్ధంపై తాజాగా ఆర్జీవీ పెట్టిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. ‘‘అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం జీసస్, అల్లా మధ్య ఫైట్ లాంటిదే. ఎవరు గెలిస్తే ఆ మతంలోకి నేను మారతా’’ అని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
అందుకే ఆ ట్వీట్
అమెరికాలో మెజారిటీ జనాలు క్రిస్టియన్లే. వీళ్లు జీసస్ ను ఆరాధిస్తారు. యేసు ప్రభువును నమ్ముతారు. మరోవైపు ఇరాన్ ఏమో ముస్లిం కంట్రీ. ఇక్కడ అందరూ అల్లాను ప్రార్థిస్తారు. అందుకే అమెరికా-ఇరాన్ యుద్ధాన్ని జీసస్, అల్లా మధ్య ఫైట్ గా పేర్కొంటూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు.
డోనాల్డ్ ట్రంప్ రైట్
‘‘బలవంతుడు ఏం చేసినా రైట్. ‘ఎవరి దగ్గర అయితే పవర్ ఉంటుందో వాళ్లు తప్పు చేసినా కరెక్టే అవుతుంది’ అని సర్కార్ సినిమాలో సెల్వర్ మణి డైలాగ్ ఉంది. అందుకే ఇప్పుడు డోనాల్డ్ ట్రంప్ రైట్. అతని దగ్గర బలముంది’’ అని ఆర్జీవీ అంతకుముందు మరో ట్వీట్ చేశాడు.
అమెరికా-ఇరాన్ వార్
ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ పై చేస్తున్న వార్ రోజురోజుకూ తీవ్రమవుతోంది. బాంబుల మోత మోగుతోంది. మిస్సైల్స్ వర్షం కురుస్తుంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అమెరికా హతం చేసిన సంగతి తెలిసిందే. ప్రతీకారం కోసం రగిలిపోతున్న ఇరాన్ మిడిల్ ఈస్ట్ దేశాల్లో విధ్వంసకాండ రచిస్తోంది.
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా దుబాయ్, అబుదాబి, ఒమన్, ఖతార్ లాంటి మిడిల్ ఈస్ట్ దేశాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఆయా దేశాలకు ఇతర దేశాల నుంచి ఫ్లైట్ సర్వీస్ లు రద్దయ్యాయి. దీంతో దుబాయ్ లో చాలా మంది ఇండియన్స్ చిక్కుకుపోయారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


