...
...
Next Story

శ్రీదేవి థండర్ థైస్.. తొడల గురించి కామెంట్లు సమర్థించుకున్న ఆర్జీవీ.. సన్నకాళ్లు ఉంటే స్టార్ అయ్యేది కాదంటూ!

2015లో శ్రీదేవి 'థండర్ థైస్' గురించి మాట్లాడి వివాదాన్ని రేపిన రామ్ గోపాల్ వర్మ తన కామెంట్లను మరోసారి సమర్థించుకున్నారు. కాళ్లుగా సన్నగా ఉండి ఉంటే ఆమె స్టార్ అయ్యేవారు కాదని చెప్పారు.

Published on: Dec 2, 2025, 12:21:30 IST
Advertisement

శ్రీదేవి 'థండర్ థైస్' (బలమైన తొడలు) అంటూ గతంలో చేసిన తన వివాదాస్పద వ్యాఖ్యలను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమర్థిస్తూనే ఉన్నారు. ఆ లక్షణమే ఆమె స్టార్‌డమ్‌కు దోహదపడిందని వాదిస్తున్నారు. విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, సన్నని కాళ్లు ఉంటే శ్రీదేవికి ఆ స్థాయి స్టార్‌డమ్ వచ్చి ఉండేది కాదని ఆయన తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.

శ్రీదేవి థండర్ థైస్

శ్రీదేవిపై ఆర్జీవీ కామెంట్లు
శ్రీదేవిపై ఆర్జీవీ కామెంట్లు

దివంగత శ్రీదేవి విషయంలో మరోసారి రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ఒక పోడ్‌కాస్ట్ కోసం జూమ్ యూట్యూబ్ ఛానెల్‌లో దివంగత నటి శ్రీదేవి 'థండర్ థైస్' గురించి మాట్లాడి వివాదాన్ని రేకెత్తించినట్లు గుర్తు చేసుకున్నారు. తన అభిప్రాయాలకు వచ్చిన వ్యతిరేకత గురించి మాట్లాడుతూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.

ఆర్జీవీ కామెంట్లు

"మనిషిని వస్తురూపం (ఆబ్జెక్టిఫై)లో చూడటంలో తప్పేముంది? ఆమె (శ్రీదేవి) ప్రతిభతో పాటు అది కూడా ఒక ఆస్తి. దాన్ని వస్తురూపంలో చూడటమని అనడం కూడా వస్తురూపంలో చూడటమే. ఒక వ్యక్తి ప్రత్యేకంగా ఎలా మారతాడు? కారణాలు ఉంటాయి. ఆమె గొప్ప నటి లేదా గొప్ప మానవతావాది అనే వాస్తవానికి మిమ్మల్ని మీరు పరిమితం చేసుకోకూడదు. దీనివల్ల కూడా కావచ్చు. ఎందుకు దాటవేయాలి? ఆమె నటి కాదని ఎప్పుడు అన్నాను? ఆమె 'థండర్ థైస్' కూడా ఆమె కీర్తికి దోహదపడ్డాయని చెబుతున్నా" అని ఆర్జీవీ అన్నారు.

కాళ్లు సన్నగా ఉంటే

"ఆమె కాళ్లు సన్నగా ఉంటే, ఆమె ఎప్పటికీ స్టార్ అయ్యేది కాదని నేను వ్యక్తిగతంగా నమ్ముతున్నా. అవి మొత్తం ప్యాకేజీలో భాగం. అమితాబ్ బచ్చన్ 6 అంగుళాలు పొట్టిగా ఉంటే ఆయన పెద్ద స్టార్ అయ్యేవారని నాకు ఖచ్చితంగా తెలియదు. లేదా షారుఖ్ ఖాన్ 6 అంగుళాలు పొడవుగా ఉంటే ఆయన పెద్ద స్టార్ అయ్యేవారో నాకు తెలియదు" అని ఆర్జీవీ అన్నారు. అలాగే 2015లో శ్రీదేవి థండర్ థైస్ వ్యాఖ్యలను సరదాగా చేశానని పేర్కొన్నారు.

2015లో ఏమన్నారు?

అప్పట్లో దర్శకుడు ఆర్జీవీ తన ప్రకటనను సమర్థించుకుంటూ ట్వీట్ చేశారు. "శ్రీదేవి కీర్తి ఆమె నటన సామర్థ్యం వల్లనే కాదు, ఆమె థండర్ థైస్ వల్ల కూడా వచ్చింది. హింమత్‌వాలా కాలం నాటి అగ్ర విమర్శకులకు కేవలం నటన ప్రతిభ మాత్రమే స్టార్‌డమ్‌కు కొలమానం అయితే స్మితా పాటిల్ శ్రీదేవి కంటే పెద్దది ఎందుకు కాలేదు.. ఆ థండర్ థైస్ తేడా’’ అని ఆర్జీవీ 2015లో ట్వీట్ చేశారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks