ఆ మాట వినగానే రెహమాన్‌ను కొడదామనుకున్నా.. కానీ ఆ పాట అద్భుతం.. తెలుగు ఇండస్ట్రీలోనూ చాలా ఫ్లాప్స్ ఉన్నాయి: ఆర్జీవీ
రామ్ గోపాల్ వర్మ తీసిన రంగీలా మూవీ శుక్రవారం (నవంబర్ 28) రీరిలీజ్ కానున్న నేపథ్యంలో ఆ మూవీలోని సాంగ్స్, ఏఆర్ రెహమాన్ తో కలిసి పని చేయడం, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీపై బాలీవుడ్ లో ఉన్న తప్పుడు అభిప్రాయం గురించి స్పందించాడు.
బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'రంగీలా' మూవీ థియేటర్లలో రీ-రిలీజ్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ చిత్ర సంగీత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడాడు. పింక్‌విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివిధ అంశాలపై స్పందించాడు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్‌తో పనిచేసిన అనుభవాలను పంచకుంటూ.. కొన్ని ట్రాక్‌లను అందించడానికి రెహమాన్ చాలా సమయం తీసుకున్నారని, ఈ ఆలస్యం తనను ఎంతగానో విసిగించిందని, ఒకానొక దశలో ఆయనను కొట్టాలని కూడా అనిపించిందని ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

రంగీలాలోని హాయ్ రామా పాటపై..
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ 'రంగీలా' చిత్ర సంగీతంపై, ముఖ్యంగా 'హాయ్ రామా' పాటపై ఏఆర్ రెహమాన్‌తో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నాడు. ఆ ప్రయాణం అంత సులభం కాదని ఆయన ఒప్పుకున్నాడు.
"మేము 'హాయ్ రామా' పాట కంపోజిషన్ కోసం గోవాకు వెళ్లాం. అక్కడ ఐదు రోజులు ఉన్నాం. మొదటి రోజు రెహమాన్ 'రామూ, నేను ఏదో ఆలోచిస్తున్నాను, రేపు వినిపిస్తాను' అని చెప్పాడు. రెండో రోజు వేరే ఏదో చెప్పాడు. మూడో రోజు కూడా అదే.. ఆ ఐదు రోజులూ రెహమాన్ ఏమీ చేయలేదు. ఆ తర్వాత రెహమాన్ నాతో, 'నేను చెన్నైకి వెళ్లి అక్కడి నుంచి మీకు పంపుతాను' అని చెప్పాడు. ఆ తర్వాత అతను నాతో 'నన్ను మరోసారి హోటల్‌కి తీసుకెళ్తే, అక్కడ టీవీ ఉండకుండా చూసుకోండి. ఎందుకంటే ఈ సమయమంతా నేను టీవీ చూశాను' అని చెప్పాడు. నిజంగా అతన్ని కొట్టాలనిపించింది" అని ఆర్జీవీ నవ్వుతూ అన్నాడు.
"కానీ చివరకు అతను ఆ 'హాయ్ రామా' పాటను అందించినప్పుడు గొప్ప విషయాల కోసం ఎదురుచూడటానికి ఓపిక అవసరమని నేను అనుకున్నాను. అది విలువైనది. చివరకు అతను అదే నిరూపించాడు" అని ఆర్జీవీ తెలిపాడు. ఇక ఇదే ఇంటర్వ్యూలో తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి బాలీవుడ్ లో ఏమనుకుంటారో చెబుతూ.. బాలీవుడ్‌లాగే తెలుగులోనూ చాలా సినిమాలు ఫ్లాపవుతాయి. కొన్ని మంచి సినిమాలే ఇక్కడా రిలీజ్ కావడంతో సౌత్ లో అన్నీ హిట్ అవుతాయని అనుకుంటారు. కానీ అది తప్పు అని అనడం విశేషం.
'రంగీలా' మూవీ గురించి..
1995 సెప్టెంబర్ 8న విడుదలైన 'రంగీలా' సినిమాకు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఊర్మిళ మటోండ్కర్ మధ్యతరగతి కుటుంబానికి చెందిన మిలి అనే పాత్రను పోషించింది. నటి కావాలని కలలు కనే ఆమె జీవితం, తన చిన్ననాటి స్నేహితుడు మున్నా (ఆమిర్ ఖాన్), ఆమె సినిమాలో ప్రధాన నటుడు రాజ్ (జాకీ ష్రాఫ్) మధ్య ఏర్పడిన లవ్ ట్రయాంగిల్ లో చిక్కుకుంటుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలవడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


