Ram Gopal Varma Gets 29 Cr Legal Notice: టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఊహించని న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. 2010 నాటి ఒక పాత ఒప్పందం ప్రాతిపదికగా ప్రముఖ నిర్మాణ సంస్థ 'ఎక్లేటెంట్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్' వర్మకు భారీ లీగల్ నోటీసు జారీ చేసింది.
అక్టోబర్ 30 నాటికి

అసలు మొత్తంతో పాటు వడ్డీ కలిపి మొత్తం రూ. 29.67 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. అక్టోబర్ 15న ఈ నోటీసు పంపిన నిర్మాణ సంస్థ, అక్టోబర్ 30 నాటికి బకాయిలు చెల్లించాలని గడువు విధించింది.
15 ఏళ్ల నాటి ఒప్పందం.. బొంబాయి హైకోర్టు తీర్పు
ఈ వివాదానికి మూలాలు 2010 నాటి అగ్రిమెంట్‌లో ఉన్నాయి. 2010 ఏప్రిల్ 10న రామ్ గోపాల్ వర్మ, ఎక్లేటెంట్ ఫిల్మ్స్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. అనంతరం 2013 ఏప్రిల్ 17న బొంబాయి హైకోర్టు కూడా ఈ ఒప్పందాన్ని సమర్థించింది.
అగ్రిమెంట్ నిబంధనల ప్రకారం ఆర్జీవీ నిర్మించే, దర్శకత్వం వహించే లేదా రచయితగా వ్యవహరించే ఏ ప్రాజెక్టుకైనా ఎక్లేటెంట్ ఫిల్మ్స్ నుంచి రాతపూర్వక నిరభ్యంతర పత్రం (NOC) తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే, వర్మ ఈ నిబంధనలను పాటించకుండా పలు సినిమాలు పూర్తి చేశారని నిర్మాణ సంస్థ ఆరోపిస్తోంది. అందుకే ఒప్పంద ఉల్లంఘన కింద అసలు బకాయికి రూ. 11.38 కోట్ల వడ్డీని జతచేసి మొత్తంగా రూ. 29.67 కోట్లు రికవరీ చేయాలని న్యాయపోరాటానికి దిగింది.
సినీ పరిశ్రమకు, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు హెచ్చరిక
కేవలం రామ్ గోపాల్ వర్మకు నోటీసు ఇవ్వడమే కాకుండా, సినీ పరిశ్రమలోని ప్రధాన భాగస్వాములకు కూడా ఎక్లేటెంట్ ఫిల్మ్స్ స్పష్టమైన సంకేతాలు పంపింది. ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, బ్రాడ్కాస్టర్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఎవరూ రామ్ గోపాల్ వర్మతో కొత్త ఒప్పందాలు లేదా వ్యాపార లావాదేవీలు జరపవద్దని 'కంప్లీట్ సినిమా' వంటి ట్రేడ్ వర్గాల ద్వారా స్పష్టం చేసింది.
{{/usCountry}}కేవలం రామ్ గోపాల్ వర్మకు నోటీసు ఇవ్వడమే కాకుండా, సినీ పరిశ్రమలోని ప్రధాన భాగస్వాములకు కూడా ఎక్లేటెంట్ ఫిల్మ్స్ స్పష్టమైన సంకేతాలు పంపింది. ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, బ్రాడ్కాస్టర్లు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ఎవరూ రామ్ గోపాల్ వర్మతో కొత్త ఒప్పందాలు లేదా వ్యాపార లావాదేవీలు జరపవద్దని 'కంప్లీట్ సినిమా' వంటి ట్రేడ్ వర్గాల ద్వారా స్పష్టం చేసింది.
{{/usCountry}}ఒప్పందంలోని లీగల్ క్లాజుల ఆధారంగా ఆయన సినిమాల ఆర్థిక ప్రయోజనాలు, ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులు, థియేట్రికల్ రెవెన్యూలను నిలిపివేసేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
ఆర్జీవీ రాబోయే సినిమాల పరిస్థితేంటి?
ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ 'పోలీస్ కంపెనీ' అనే భారీ క్రైమ్ డ్రామాపై దృష్టి సారించారు. హర్షవర్ధన్ రాణే ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని టి-సిరీస్‌కు చెందిన భూషణ్ కుమార్‌తో కలిసి వర్మ నిర్మిస్తున్నారు.
సుమారు 300 మంది గ్యాంగ్‌స్టర్ల ఎన్‌కౌంటర్ల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం 2027 జూన్ 4న విడుదల కానుంది. ఇందులో ఫర్దీన్ ఖాన్, ఫాతిమా సనా షేక్, పరేష్ రావల్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు మనోజ్ బాజ్‌పాయ్‌తో 'పోలీస్ స్టేషన్ మే భూత్' అనే మరో ప్రాజెక్ట్ కూడా లైన్లో ఉంది.
స్పందించని రామ్ గోపాల్ వర్మ
తాజాగా ఆర్జీవీపై వ్యక్తమవుతున్న న్యాయపరమైన చిక్కుల వల్ల ఈ సినిమాల విడుదల, డిజిటల్ రైట్స్ విక్రయంపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ లీగల్ నోటీసుపై రామ్ గోపాల్ వర్మ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.