...
...
Next Story

శివాజీ, నిర్భ‌య రేపిస్ట్‌ కామెంట్ల వీడియో.. రీట్వీట్ చేసిన ఆర్జీవీ.. ఇదే అంతా చెబుతుందంటూ!

హీరోయిన్ల డ్రెస్ లు, ప్రొవోక్ చేస్తారంటూ శివాజీ చేసిన కామెంట్ల మంట ఇప్పట్లో చల్లారేలా లేదు. శివాజీ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. తాజాగా రామ్ గోపాల్ వర్మ చేసిన ఓ రీట్వీట్ సంచలనంగా మారింది. నిర్భయ రేపిస్ట్, శివాజీ కామెంట్లు ఉన్న ఓ వీడియోను ఆర్జీవీ రీట్వీట్ చేశాడు.

Published on: Dec 27, 2025, 14:27:51 IST
Advertisement

సీనియర్ తెలుగు నటుడు శివాజీపై విమర్శల పరంపర కొనసాగుతూనే ఉంది. హీరోయిన్ల డ్రెస్ గురించి అసభ్యంగా మాట్లాడటంతో శివాజీపై సెలబ్రిటీలు కూడా ఫైర్ అవుతున్నారు. ఈ విషయంపై అనసూయ, చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్జీవీ కూడా శివాజీదే తప్పు అనేలా ఓ వీడియోను రీట్వీట్ చేయడం సంచలనంగా మారింది.

నిర్భయ రేపిస్ట్ తో శివాజీ

రామ్ గోపాల్ వర్మ (x/RGVzoomin)
రామ్ గోపాల్ వర్మ (x/RGVzoomin)

దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ రేప్ ఎంతటి కలకలం రేపిందో తెలిసిందే. ఈ రేపిస్ట్ ల్లో ఒకరు గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మంచి అమ్మాయిలు రాత్రి 9 గంటలకు రోడ్డు మీద తిరగరు. రేపు కేసుల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలదే ఎక్కువ తప్పు ఉంటుంది’’ అని నిర్భయ రేపిస్ట్ సెన్సేషనల్ కామెంట్లు చేశాడు. ఇప్పుడు శివాజీ చేసిన కామెంట్లను, ఈ వ్యాఖ్యలను ఓ వీడియోలో ఎడిట్ చేశారు.

రెచ్చగొడతారంటూ

హీరోయిన్ల డ్రెస్ గురించి మాట్లాడుతూ ‘సామాన్లు’, ‘దొంగ ము**’ అనే అసభ్యకరమైన పదాలు వాడాడు శివాజీ. దీనిపై పెద్ద రచ్చ కొనసాగుతోంది. ఆ తర్వాత మీడియా సమావేశంలో సారీ కూడా చెప్పాడు. ఈ క్రమంలోనే హీరోయిన్లు ప్రొవోక్ (రెచ్చగొట్టేలా) చేస్తారంటూ శివాజీ మళ్లీ నోరు జారాడు. ఈ కామెంట్లను, నిర్భయ రేపిస్ట్ కామెంట్లను కలిపి ఓ నెటిజన్ వీడియోగా ఎడిట్ చేసి ఎక్స్ లో పోస్టు చేశాడు.

ఆర్జీవీ రీట్వీట్

శివాజీ, నిర్భయ రేపిస్ట్ కామెంట్లు ఉన్న వీడియోను రామ్ గోపాల్ వర్మ రీట్వీట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ‘‘ఈ వీడియో అంతా చెప్పేస్తోంది’’ అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ తో ఈ పోస్టును ఆర్జీవీ రీట్వీట్ చేశాడు. శివాజీ కామెంట్లను ఖండించేలా ఆర్జీవీ రీట్వీట్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

శివాజీ వర్సెస్ అనసూయ

ఈ వ్యాఖ్యలపై అనసూయ ఫైర్ అయింది. దీంతో అనసూయ మధ్యలో ఎందుకు వచ్చిందంటూ శివాజీ ప్రశ్నించాడు. నేనూ హీరోయిన్ నే అని ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో చెప్పిన అనసూయ.. మరింత సంచలన వ్యాఖ్యలు చేసింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks