...
...
Next Story

RGV Movie: ధురంధర్ కంటే చాలా పెద్ద మూవీ అట.. స్టోరీ కూడా చెప్పేసిన రామ్ గోపాల్ వర్మ

RGV Movie: ఆర్జీవీ, మోహిత్ సూరి కాంబినేషన్ లో రాబోతున్న మూవీ స్టోరీ ఏంటో, అది ఏ స్థాయిలో ఉండబోతోందో తెలిసిపోయింది. ఈ విషయాన్ని రామ్ గోపాల్ వర్మనే తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించారు.

Published on: Sep 14, 2026, 14:15:14 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

RGV Movie: బాలీవుడ్‌లో సరికొత్త సంచలనానికి తెరలేచింది. అండర్‌వరల్డ్ చిత్రాల ట్రెండ్‌సెట్టర్ రామ్ గోపాల్ వర్మ, లవ్ స్టోరీల స్పెషలిస్ట్ మోహిత్ సూరి చేతులు కలిపారు. ముంబై అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన దావూద్ ఇబ్రహీం, ఛోటా రాజన్ విడిపోయిన సంచలనాత్మక ఘటనల ఆధారంగా వీరిద్దరూ ఒక భారీ గ్యాంగ్‌స్టర్ డ్రామాను రూపొందిస్తున్నారు.

RGV Movie: ధురంధర్ కంటే చాలా పెద్ద మూవీ అట.. స్టోరీ కూడా చెప్పేసిన రామ్ గోపాల్ వర్మ
RGV Movie: ధురంధర్ కంటే చాలా పెద్ద మూవీ అట.. స్టోరీ కూడా చెప్పేసిన రామ్ గోపాల్ వర్మ

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి ఆర్జీవీ స్క్రిప్ట్ అందించడంతో పాటు కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తుండగా, మోహిత్ సూరి దర్శకత్వం వహించనున్నారు. "గ్యాంగ్‌స్టర్ కర్రీలో లవ్ డిష్ వండుతున్నాం" అంటూ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా సెల్ఫీ షేర్ చేసి అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారు. 'సత్య', 'కంపెనీ' సినిమాలతో గ్యాంగ్‌స్టర్ జోనర్‌కు బెంచ్‌మార్క్ సెట్ చేసిన ఆర్జీవీ.. 'సయ్యారా' లాంటి ఎమోషనల్ బ్లాక్‌బస్టర్ ఇచ్చిన మోహిత్ కాంబినేషన్ మూవీ లవర్స్‌ను అమితంగా ఆకట్టుకుంటోంది.

దావూద్-ఛోటా రాజన్ స్ప్లిట్ వెనుక అసలు కథ

1993 ముంబై పేలుళ్ల తర్వాత అండర్‌వరల్డ్ చరిత్రలోనే అతిపెద్ద మలుపుగా మారిన దావూద్ ఇబ్రహీం, ఛోటా రాజన్ వైరం నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. 'సౌత్య' అనే వ్యక్తి వల్ల వీరిద్దరి మధ్య తలెత్తిన విభేదాలు, ఆ తర్వాత భారత నిఘా సంస్థలు తీసుకున్న రహస్య చర్యలు ఈ సినిమాలో ప్రధానాంశాలుగా ఉండబోతున్నాయి.

కేవలం గ్యాంగ్‌స్టర్ పోరాటాలు మాత్రమే కాకుండా, భారత గూఢచారి సంస్థల ఇన్వాల్వ్‌మెంట్, 93 బాంబు పేలుళ్ల తర్వాత చోటుచేసుకున్న పరిణామాలను రియలిస్టిక్‌గా చూపించనున్నట్లు వర్మ వివరించారు. "నా క్లాసిక్ 'సత్య' కంటే మరింత రియలిస్టిక్ హృదయంతో, ఇటీవల సంచలనం సృష్టించిన 'ధురందర్' కంటే భారీ స్కేల్‌లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది" అని ఆర్జీవీ కాన్ఫిడెంట్‌గా ప్రకటించారు.

'సయ్యారా' బ్లాక్‌బస్టర్ తర్వాత మోహిత్ సూరి నెక్ట్స్ ప్లాన్

ఆర్జీవీ రాసిన పవర్ ఫుల్ డ్రామాకు మోహిత్ సూరి తన మార్క్ హార్ట్ టచింగ్ ఎమోషన్స్, సూపర్ హిట్ మ్యూజిక్, అల్ట్రా రియలిస్టిక్ యాక్షన్ జోడిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఫ్రెన్సిస్ ఫోర్డ్ కొప్పోలా 'జాస్' తీస్తే లేదా స్టీవెన్ స్పీల్‌బర్గ్ 'గాడ్‌ఫాదర్' తెరకెక్కిస్తే ఎలా ఉంటుందో.. ఈ కాంబో కూడా అదే రేంజ్‌లో సరికొత్త అనుభూతిని ఇస్తుందని ఆర్జీవీ పోలిక తెచ్చారు.

లైనప్‌లో ఆర్జీవీ వరుస ప్రాజెక్ట్‌లు

రామ్ గోపాల్ వర్మ ఖాతాలో ప్రస్తుతం వరుస ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ముంబై ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ లైఫ్ ఆధారంగా హర్షవర్ధన్ రానే హీరోగా 'పోలీస్ కంపెనీ' అనే రెండు భాగాల థియేట్రికల్ ఫ్రాంచైజీని టీ-సిరీస్ బ్యానర్‌లో రూపొందిస్తున్నారు.

అలాగే మనోజ్ బాజ్‌పాయ్‌తో కలిసి 'పోలీస్ స్టేషన్ మే భూత్' అనే హారర్ కామెడీ మూవీని కూడా ప్లాన్ చేస్తున్నారు. దేశంలోని రక్షణ వ్యవస్థ ఒక్క రోజులో కూలిపోతే ఏమవుతుందనే కాన్సెప్ట్‌తో 'సిండికేట్' అనే మరో ప్రాజెక్ట్‌ను కూడా ఆర్జీవీ లైన్‌అప్‌లో ఉంచారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks