రెహమాన్ చాలా మంచోడు.. గ్రేటెస్ట్ కంపోజర్: ఆస్కార్ గెలిచిన జయహో పాట అతడు కంపోజ్ చేయలేదన్న తన కామెంట్స్‌పై ఆర్జీవీ వివరణ

ఏఆర్ రెహమాన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు రామ్ గోపాల్ వర్మ. ఆస్కార్ గెలిచిన జయహో పాటను రెహమాన్ కంపోజ్ చేయలేదని గతంలో తాను చేసిన కామెంట్స్ కు అతడు వివరణ ఇచ్చాడు. అప్పట్లో తన కామెంట్స్ ను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నాడు.

Published on: Jan 21, 2026, 15:56:22 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆస్కార్ గెలుచుకున్న ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ సినిమాలోని "జయహో" (Jai Ho) పాట చుట్టూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఈ పాటను స్వరపరిచింది ఏఆర్ రెహమాన్ కాదని, సింగర్ సుఖ్వీందర్ సింగ్ అని రామ్ గోపాల్ వర్మ అన్నట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై ఆర్జీవీ బుధవారం (జనవరి 21) నాడు ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఆ పుకార్లకు చెక్ పెట్టాడు.

రెహమాన్ చాలా మంచోడు.. గ్రేటెస్ట్ కంపోజర్: ఆస్కార్ గెలిచిన జయహో పాట అతడు కంపోజ్ చేయలేదన్న తన కామెంట్స్‌పై ఆర్జీవీ వివరణ
రెహమాన్ చాలా మంచోడు.. గ్రేటెస్ట్ కంపోజర్: ఆస్కార్ గెలిచిన జయహో పాట అతడు కంపోజ్ చేయలేదన్న తన కామెంట్స్‌పై ఆర్జీవీ వివరణ

నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు: ఆర్జీవీ

ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ చేసిన కామెంట్స్ విషయంలో అతనిపై దారుణమైన ట్రోలింగ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ గతంలో ఓ ఇంటర్వ్యూలో జయహో పాట గురించి చేసిన కామెంట్స్ ను కొందరు తెరపైకి తెచ్చారు. తాజాగా అతడు దీనిపై వివరణ ఇచ్చాడు.

"జయహో పాట విషయంలో నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. సందర్భం లేని విషయాలను వక్రీకరించి రాస్తున్నారు" అని వర్మ ఆవేదన వ్యక్తం చేశాడు. రెహమాన్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. "నా ఉద్దేశంలో ఏఆర్ రెహమాన్ గొప్ప సంగీత దర్శకుడు, నేను కలిసిన అత్యంత మంచి వ్యక్తుల్లో ఆయన ఒకరు. మరొకరి క్రెడిట్‌ను తీసుకునే వ్యక్తి రెహమాన్ కాదు. ఈ నెగెటివ్ ప్రచారానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పడుతుందని ఆశిస్తున్నా" అని ట్వీట్ చేశాడు.

అసలు వివాదం ఎక్కడ మొదలైంది?

గతంలో ఆర్జీవీ ఇచ్చిన ఒక పాత ఇంటర్వ్యూ క్లిప్ వైరల్ అవ్వడమే ఈ వివాదానికి కారణం. ఆ వీడియోలో ఆర్జీవీ ఒక సంఘటనను వివరించాడు. సుభాష్ ఘాయ్ ‘యువరాజ్’ సినిమా కోసం రెహమాన్ పనిచేస్తున్న సమయం అది. రెహమాన్ ఆలస్యంగా రావడంతో, అక్కడ ఉన్న సుఖ్వీందర్ సింగ్ ఒక ట్యూన్ చేశారట.

రెహమాన్ వచ్చాక.. "నువ్వు కంపోజ్ చేశావా?" అని సుఖ్వీందర్ సింగ్‌ను అడిగి, ఆ ట్యూన్ బాగుందని సుభాష్ ఘాయ్‌కి వినిపించాడు. దీనికి సుభాష్ ఘాయ్ కోప్పడుతూ.. "నేను నీకు కోట్ల రూపాయలు ఇస్తోంది నువ్వు మ్యూజిక్ చేస్తావని.. సుఖ్వీందర్ చేసిన ట్యూన్ నాకు ఎందుకు?" అని రెహమాన్‌పై అరిచారట.

దానికి రెహమాన్.. "మీరు డబ్బు ఇస్తోంది నా పేరుకు, నా పనికి కాదు" అని బదులిచ్చారట. ఆ తర్వాత ఆ ట్యూన్‌నే ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ కోసం వాడారని, దానికి సుఖ్వీందర్‌కు కొంత డబ్బు పంపారని ఆ ఇంటర్వ్యూలో వర్మ చెప్పాడు.

అయితే ఈ మాటలను ఇప్పుడు నెటిజన్లు వైరల్ చేస్తూ.. రెహమాన్ ఆ పాట చేయలేదని ప్రచారం చేయడంతో వర్మ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. 2009లో వచ్చిన ఈ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More