పాపులర్ ఫిల్మ్ మేకర్ రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ సెన్సేషన్ ధురంధర్ 2 ది రివెంజ్ సినిమాను మరోసారి పొగుడుతూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. డైరెక్టర్ ఆదిత్య ధర్ తీసిన ఈ సీక్వెల్ ఆడియన్స్ టేస్ట్‌ను పూర్తిగా మార్చేసిందని, ఇక రొటీన్ ఫార్ములా డ్రివెన్ బాలీవుడ్ సినిమాలకు కాలం చెల్లినట్లే అని వర్మ డిక్లేర్ చేశాడు.
ఆ ఫేక్ హీరోలను ఈ సినిమా చంపేసింది

రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ తన అభిప్రాయాలను ఏమాత్రం ఫిల్టర్లు లేకుండా చెప్తుంటాడు. ఇప్పుడు కూడా ధురంధర్ 2 మూవీని పొగుడుతూ.. మసాలా సినిమాలు తీసే డైరెక్టర్లను ఏకిపారేశాడు. అలాంటి డైరెక్టర్లకు ఈ మూవీ ఓ హారర్ అని అన్నాడు.
ట్రెడిషనల్ హీరో సెంట్రిక్ స్టోరీల్లో ఉన్న వీక్‌నెస్‌ను ధురంధర్ 2 బయటపెట్టిందని చెప్పాడు. ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో పెట్టిన ఒక పెద్ద పోస్ట్‌లో బాలీవుడ్‌లో ఎప్పట్నుంచో ఉన్న ఓటమెరగని హీరోల కాన్సెప్ట్‌ను వర్మ గట్టిగా విమర్శించాడు. అసలు దెబ్బలు తగలని, రక్తం రాని, నొప్పే తెలియని ఆ హీరోలందరినీ ఈ సినిమా చంపేసింది అని ఘాటుగా కామెంట్ చేశాడు.
రా అండ్ రియల్ యాక్షన్.. ఫిజిక్స్‌కు గౌరవం
సైకలాజికల్ లేయర్స్‌తో ఉన్న యాంటీ హీరో రోల్‌లో రణ్‌వీర్ సింగ్ ఇచ్చిన పర్ఫార్మెన్స్‌ను ఆర్జీవీ గట్టిగా హైలైట్ చేశాడు. ఇందులో హీరో తడబడతాడు, రక్తం చిందిస్తాడు, కేవలం విజువల్స్ మీద కాకుండా తన ఇంటెలెక్ట్‌తో బలాన్ని తెచ్చుకుంటాడు. ఇలాంటివి చూస్తే ఓవర్ యాక్షన్, చెవులకు చిల్లు పడే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో వచ్చే ఆ హీరోలకు ఎండ్ కార్డ్ పడినట్లే అని వర్మ అభిప్రాయపడ్డాడు.
కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్స్లో ఫిజిక్స్ ఒక జోక్‌లా, అసలు గ్రావిటీయే లేనట్లు యాక్షన్ ఉంటుందని.. కానీ ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ చాలా రా అండ్ రియల్‌గా ఉన్నాయని చెప్పాడు. ఇలాంటి రియాలిటీకి అలవాటు పడిన ఆడియన్స్‌కు ఇకముందు ఆ పాత స్టైల్ హై ఆక్టేన్ యాక్షన్ అంతా చాలా చీప్, ఫేక్, దారుణంగా అనిపిస్తుందని వర్మ కౌంటర్ ఇచ్చాడు. పాన్ ఇండియా డైరెక్టర్లను కూడా వణికించిన మూవీ ఇది అని ఆర్జీవీ స్పష్టం చేశాడు.
ఫిల్మ్ మేకర్స్‌కు ఆర్జీవీ గట్టి వార్నింగ్..
{{/usCountry}}కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్స్లో ఫిజిక్స్ ఒక జోక్‌లా, అసలు గ్రావిటీయే లేనట్లు యాక్షన్ ఉంటుందని.. కానీ ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ చాలా రా అండ్ రియల్‌గా ఉన్నాయని చెప్పాడు. ఇలాంటి రియాలిటీకి అలవాటు పడిన ఆడియన్స్‌కు ఇకముందు ఆ పాత స్టైల్ హై ఆక్టేన్ యాక్షన్ అంతా చాలా చీప్, ఫేక్, దారుణంగా అనిపిస్తుందని వర్మ కౌంటర్ ఇచ్చాడు. పాన్ ఇండియా డైరెక్టర్లను కూడా వణికించిన మూవీ ఇది అని ఆర్జీవీ స్పష్టం చేశాడు.
ఫిల్మ్ మేకర్స్‌కు ఆర్జీవీ గట్టి వార్నింగ్..
{{/usCountry}}ఫార్ములా ప్రకారం మసాలా సినిమాలు తీసే ఫిల్మ్ మేకర్స్‌కు వర్మ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ధురంధర్ 2 కమర్షియల్ సక్సెస్, అందులోని కథ చెప్పే విధానం చూస్తే పాత స్టైల్ ఫిల్మ్ మేకింగ్‌కు ఇదొక భయంకరమైన ముప్పు అని అన్నాడు. కథలో లోతు లేకుండా కేవలం విజువల్ మాయాజాలానికి ప్రాముఖ్యతను ఇచ్చే సినిమాల తల నరికేసిన ఫైనల్ వర్డిక్ట్ ఈ సినిమా అని డిక్లేర్ చేశాడు.
అలాంటి ప్రాజెక్ట్స్ చేస్తున్న ప్రొడ్యూసర్స్ అంతా మళ్లీ వాళ్ల డ్రాయింగ్ బోర్డ్స్ దగ్గరకు వెళ్లి కథలు మార్చుకోవాలని, లేదంటే చాలా వేగంగా మారుతున్న ఈ మార్కెట్‌లో వాళ్లు కనిపించకుండా పోతారని వార్నింగ్ ఇచ్చాడు. ఇండియన్ సినిమాకు ధురంధర్ ఫ్రాంచైజీ ఒక అతి పెద్ద జంప్ అని.. షోలే, మొఘల్ ఏ ఆజం లాంటి క్లాసిక్స్ క్రియేట్ చేసిన ప్రభావాన్ని ఈ సీక్వెల్ రిపీట్ చేసిందని వర్మ గతంలోనే చెప్పాడు.
ప్రీతి జింటా ప్రశంసలు.. క్రేజీ కాస్టింగ్
మరోవైపు నటి ప్రీతి జింటా కూడా సోషల్ మీడియాలో ఈ సినిమాను పొగుడుతూ పోస్ట్ చేసింది. డైరెక్టర్ ఆదిత్య ధర్ విజన్, రణ్‌వీర్ సింగ్ స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ అదిరిపోయాయని.. ముఖ్యంగా రణ్‌వీర్ రేంజ్, డెప్త్, సిన్సియారిటీ చాలా గొప్పగా ఉన్నాయని ఆమె మెచ్చుకుంది. ఇక ఈ భారీ సినిమాలో ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, సారా అర్జున్, రాకేష్ బేడీ లాంటి స్టార్లు కీ రోల్స్ చేశారు.
బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్..
మార్చి 19, 2026న రిలీజ్ అయిన స్పై థ్రిల్లర్ ధురంధర్ 2లో రణ్‌వీర్ సింగ్ లీడ్ రోల్ చేశాడు. ఇది బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బ్రేక్ చేస్తూ, తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల గ్రాస్ మార్క్‌ను క్రాస్ చేసిందని రిపోర్ట్స్ వస్తున్నాయి. గతేడాది వచ్చిన హిట్ మూవీ ధురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాకు ఆ మూవీలాగే అదిరిపోయే రివ్యూలు వచ్చాయి. తెలుగు స్టార్లు అల్లు అర్జున్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్లు కూడా ఈ మూవీని ఆకాశానికెత్తుతూ పోస్టులు చేశారు.