ఈ ఏడాది నంబర్ 1 సినిమాగా నిలిచిన 'ధురంధర్' (Dhurandhar) ఏకంగా రూ. 1000 కోట్లు వసూలు చేసి రికార్డులు బద్దలు కొట్టింది. రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమాపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. బాలీవుడ్ పై సౌత్ సినిమాల ఆధిపత్యానికి ఈ సినిమా గట్టి సమాధానం ఇచ్చిందని, ఇక మార్చి 2026లో రాబోయే 'ధురంధర్ 2' ప్రేక్షకులను వణికిస్తుందని వర్మ హైప్ పెంచేశాడు.
ధురంధర్ 2 వణికిస్తుంది: ఆర్జీవీ

డిసెంబర్ 5న విడుదలై బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించిన 'ధురంధర్' సినిమాపై ఆర్జీవీ మరోసారి తనదైన శైలిలో స్పందించాడు. ఈ సినిమాను ఇండియన్ సినిమాకు ఒక పెద్ద మలుపుగా అభివర్ణించిన వర్మ.. ఇప్పుడు పార్ట్-2 గురించి ఇచ్చిన స్టేట్‌మెంట్ వైరల్ అవుతోంది.
సోమవారం (డిసెంబర్ 29) ఉదయం తన ఎక్స్ ఖాతాలో ఆర్జీవీ ఒక బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. పుష్ప, కేజీఎఫ్ వంటి సౌత్ సినిమాల ప్రభావాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ అతడు చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి.
"బాలీవుడ్ మీదకు దూసుకొచ్చిన సౌత్ సినిమాల 'ఫైర్ బాల్'ను.. ఆదిత్య ధర్ తన ఎడమ కాలితో 'ధురంధర్' రూపంలో వెనక్కి తన్నాడు. ఇప్పుడు తన కుడి కాలుతో 'ధురంధర్ 2' ని రెడీ చేస్తున్నాడు. నేను పార్ట్-2లో చూసిన దానిబట్టి చెప్తున్నా.. పార్ట్-1 మిమ్మల్ని భయపెట్టి ఉంటే, పార్ట్-2 మిమ్మల్ని వణికించేస్తుంది" అని వర్మ ట్వీట్ చేశాడు.
పాన్ ఇండియా మేకర్స్‌కు గుణపాఠం
ఇంతకుముందు కూడా రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. పాన్ ఇండియా దర్శకులు 'ధురంధర్' చూసి పాఠాలు నేర్చుకోవాలని అన్నాడు.
"హింస అనేది ప్రేక్షకులను కేవలం ఎంటర్టైన్ చేయకూడదు.. అది వాళ్లను బాధపెట్టాలి. యాక్షన్ అనేది ఆర్గానిక్ గా, ఎమోషనల్ గా ఉండాలి తప్ప.. లౌడ్ గా, లాజిక్ లేని కొరియోగ్రఫీలా ఉండకూడదు. ఇది మన వాళ్లు నేర్చుకోవాల్సిన పాఠం" అని విశ్లేషించాడు.
'ధురంధర్' సినిమా విశేషాలు
{{/usCountry}}"హింస అనేది ప్రేక్షకులను కేవలం ఎంటర్టైన్ చేయకూడదు.. అది వాళ్లను బాధపెట్టాలి. యాక్షన్ అనేది ఆర్గానిక్ గా, ఎమోషనల్ గా ఉండాలి తప్ప.. లౌడ్ గా, లాజిక్ లేని కొరియోగ్రఫీలా ఉండకూడదు. ఇది మన వాళ్లు నేర్చుకోవాల్సిన పాఠం" అని విశ్లేషించాడు.
'ధురంధర్' సినిమా విశేషాలు
{{/usCountry}}పాకిస్థాన్ లోని బలోచ్ గ్యాంగ్ లోకి చొరబడిన ఇండియన్ స్పై కథ ఇది. ఇందులో రణ్‌వీర్ సింగ్ (స్పై హంజా అలీ మజారీ అలియాస్ జస్కిరత్ సింగ్ రంగీ), అక్షయ్ ఖన్నా (గ్యాంగ్ లీడర్ రెహ్మాన్ డకైత్), సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ నటించారు.
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్లు దాటింది. ఇక రెండో పార్ట్ కూడా రాబోతోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 19న రిలీజ్ చేయబోతున్నారు.