...
...
Next Story

Ram Gopal Varma: సర్కార్ 4 తీస్తున్నా.. నా పాపాలన్నీ కడిగేసే సినిమా అది.. ఆ డైరెక్టర్‌ను చూసే శివ తీశా: రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ తన ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు. తన సూపర్ హిట్ ఫ్రాంఛైజీ సర్కార్ నుంచి నాలుగో మూవీ రాబోతున్నట్లు వెల్లడించాడు. అంతేకాదు ది సిండికేట్ మూవీపైనా స్పందించాడు.

Published on: Mar 14, 2026, 08:29:13 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) తన కెరీర్ లోనే అత్యంత విజయవంతమైన పొలిటికల్ క్రైమ్ డ్రామా సిరీస్ 'సర్కార్' (Sarkar)కి మరో భాగాన్ని సిద్ధం చేస్తున్నాడు. ముంబైలో జరుగుతున్న 'రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్' (Red Lorry Film Festival) ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న వర్మ.. 'సర్కార్ 4' సినిమాను అధికారికంగా అనౌన్స్ చేశాడు. వచ్చే నెల (ఏప్రిల్ 2026) నుండే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నట్లు అతడు వెల్లడించాడు.

సర్కార్ 4: అమితాబ్, అభిషేక్ ల 'మాస్' కమ్ బ్యాక్

Ram Gopal Varma: సర్కార్ 4 తీస్తున్నా.. నా పాపాలన్నీ కడిగేసే సినిమా అది.. ఆ డైరెక్టర్‌ను చూసే శివ తీశా: రామ్ గోపాల్ వర్మ
Ram Gopal Varma: సర్కార్ 4 తీస్తున్నా.. నా పాపాలన్నీ కడిగేసే సినిమా అది.. ఆ డైరెక్టర్‌ను చూసే శివ తీశా: రామ్ గోపాల్ వర్మ

ఈ సిరీస్ లోని మొదటి మూడు భాగాల్లో సుభాష్ నాగ్రే పాత్రలో అమితాబ్ బచ్చన్ అలరించగా.. అతని కుమారుడిగా శంకర్ నాగ్రే పాత్రలో అభిషేక్ బచ్చన్ నటించాడు. తాజా సమాచారం ప్రకారం, 'సర్కార్ 4'లో ఈ తండ్రీకొడుకుల జోడీ మళ్ళీ మ్యాజిక్ చేయబోతోంది.

మహారాష్ట్ర రాజకీయాల నేపథ్యంలో ఈ సర్కార్ 4 సాగనుంది. గత సినిమాల కంటే భిన్నంగా, ప్రస్తుత మహారాష్ట్ర రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఈ కథను సిద్ధం చేసినట్లు రామ్ గోపాల్ వర్మ తెలిపాడు.

"మొదటి మూడు భాగాలతో పోలిస్తే ఇప్పుడు అమితాబ్, అభిషేక్ లు నటులుగా మరింత పరిణతి చెందారు. అందుకే ఈసారి వారి పాత్రలు మరింత పవర్‌ఫుల్ గా ఉండబోతున్నాయి" అని ఆర్జీవీ పేర్కొన్నాడు.

'ది సిండికేట్' - నా పాపాలను కడిగేసే సినిమా

కేవలం 'సర్కార్ 4' మాత్రమే కాకుండా.. 'ది సిండికేట్' (The Syndicate) అనే మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును కూడా వర్మ ప్రకటించాడు. గత కొన్నేళ్లుగా తాను తీసిన నాసిరకం సినిమాల వల్ల వచ్చిన అపవాదును ఈ సినిమాతో పోగొట్టుకుంటానని అతడు జోక్ చేశాడు. "నా పాపాలన్నీ కడిగేసే సినిమా ఇది" అని వర్మ వ్యాఖ్యానించాడు. దేశ ఉనికికే ముప్పు తెచ్చే ఒక భయంకరమైన నేర సంస్థ చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

ఆదిత్య ధర్ పై ప్రశంసల జల్లు

అలాగే తన ఆల్ టైమ్ ఫేవరెట్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ అని, తన క్లాసిక్ మూవీ 'శివ'లో కూడా అతని ప్రభావం ఉందని ఆర్జీవీ గుర్తుచేసుకున్నాడు. స్పీల్‌బర్ట్ స్టైల్ షాట్ టేకింగ్ చూసే శివ మూవీలోని కొన్ని సీన్లను తాను తీసినట్లు చెప్పాడు. అంతేకాదు బ్రూస్ లీ నటించిన ది వే ఆఫ్ ద డ్రాగన్ మూవీ థీమ్ ను తీసుకొనే ఈ మూవీ తీశానని, దానిని పూర్తిగా మరో సెట్టింగ్ లో తీసినట్లు వెల్లడించాడు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe