...
...
Next Story

RGV Ramayana Review: ఈ మూవీకి రివ్యూ ఇవ్వడమంటే ఇండియన్ సినిమాను అవమానించడమే-రెండోసారి రామాయణం చూసిన ఆర్జీవీ సంచలన రివ్యూ

RGV Ramayana Review: సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేసిన తాజా ట్వీట్ సంచలనంగా మారింది. రెండో సారి రామాయణం పార్ట్ 1 మూవీ చూసిన ఆయన.. తన ఎక్స్ అకౌంట్లో లెంగ్తీ రివ్యూ పోస్టు చేశారు. నెగెటివ్ రివ్యూ ఇచ్చిన వాళ్లకు దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చారు. బాలీవుడ్ కు ఇదో చెంపపెట్టని అన్నారు.

Published on: Nov 11, 2026, 12:36:17 IST
Advertisement

RGV Ramayana Review: నితీష్ తివారి దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి నటించిన 'రామాయణం: పార్ట్ 1' సినిమాపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) సుదీర్ఘమైన రివ్యూ ఇచ్చారు. తాను దేవుడిని నమ్మని వ్యక్తినని చెబుతూనే.. విజువల్స్, నటీనటుల పెర్ఫార్మెన్స్, మ్యూజిక్ పై ప్రశంసల వర్షం కురిపించారు. బాలీవుడ్ కు ఈ సినిమా ఒక చెంపపెట్టు లాంటిదని సంచలన పోస్టు పెట్టారు.

దేవుడిపై నమ్మకం లేదు.. కానీ

ఈ మూవీకి రివ్యూ ఇవ్వడమంటే ఇండియన్ సినిమాను అవమానించడమే-రెండోసారి రామాయణం చూసిన ఆర్జీవీ సంచలన రివ్యూ (X)
ఈ మూవీకి రివ్యూ ఇవ్వడమంటే ఇండియన్ సినిమాను అవమానించడమే-రెండోసారి రామాయణం చూసిన ఆర్జీవీ సంచలన రివ్యూ (X)

"రామాయణం సినిమాను రెండోసారి చూశా. నేను నాస్తికుడిని. కాబట్టి రాముడి భక్తుడిగా కాకుండా ఒక ఫిల్మ్ లవర్ గా ఈ రివ్యూ ఇస్తున్నా. కొందరు విమర్శకులు సినిమాలో 'సోల్' (ఆత్మ) మిస్ అయిందని అంటున్నారు. కానీ ఈ సినిమా భారీతనంలోనే ఆ సోల్ దాగి ఉంది.

డైరెక్టర్ నితీష్ తివారి, నమిత్ మల్హోత్రా ఇండియన్ సినిమా కలలో కూడా ఊహించని అద్భుతాన్ని సృష్టించారు. ఈ విజువల్ వండర్ ముందు గొప్ప హాలీవుడ్ సినిమాలు కూడా స్టేజ్ నాటకాల్లా కనిపిస్తున్నాయి’2 అని రామ్ గోపాల్ వర్మ తన రివ్యూ స్టార్ట్ చేశారు.

బాలీవుడ్ కు చెంపపెట్టు లాంటిది

సినిమాలో ప్రారంభ యుద్ధ సన్నివేశాలు, రావణాసురుడి పది తలలు, అద్భుతమైన అడవులు, ముఖ్యంగా జటాయువు క్లైమాక్స్ సీన్.. ఇవన్నీ కేవలం వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ మాత్రమే కాదని, ఇండియన్ సినిమా భవిష్యత్తుకు నిదర్శనాలని ఆర్జీవీ పేర్కొన్నారు.

బద్ధకంతో నిద్రపోతున్న బాలీవుడ్ మేకర్స్ కు నమిత్ మల్హోత్రా ఇచ్చిన చెంపపెట్టు ఈ సినిమా అని రామ్ గోపాల్ వర్మ ఘాటుగా విమర్శించారు. సంకల్పం ఉంటే ఎంతటి విజువల్ గ్రాండియర్ నైనా తెరపై ఆవిష్కరించవచ్చని ఈ చిత్రం నిరూపించిందన్నారు. అవతార్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ వంటి సినిమాలను కాపీ కొట్టకుండా మన పురాణాల నుంచే గొప్ప కథను అద్భుతంగా తీశారన్నారు.

రావణుడిగా యశ్ విశ్వరూపం

శ్రీధర్ రాఘవన్ రాసిన రావణుడి బ్యాక్ స్టోరీ అద్భుతమని, సీతను అపహరించే ముందు పది తలలతో ఆలోచించే సీన్ అత్యద్భుతంగా పండిందని వర్మ పేర్కొన్నారు. రావణుడు లేకుండా రాముడు లేడని స్పష్టం చేశారు.

రణ్‌బీర్ సైలెంట్ యాక్టింగే హైలైట్

రణ్‌బీర్ కపూర్ మొహంలో ఒకే ఎక్స్ ప్రెషన్ ఉందని విమర్శిస్తున్న వారికి వర్మ గట్టి కౌంటర్ ఇచ్చారు. రాముడి పాత్ర తన ఎమోషన్స్ ను పదేపదే బయటకు చూపించడంలో ఉండదని, లోపల ఏంత దాచుకున్నారు అనేదే ముఖ్యమని వివరించారు. అడవికి వెళ్లడాన్ని ప్రశాంతంగా స్వీకరించడం, సైలెంట్ గా ఉంటూనే తన సిద్ధాంతాలతో శత్రువులను సంహరించడం చాలా కష్టమైన నటన అని, దాన్ని రణ్‌బీర్ కపూర్ పర్ఫెక్ట్ గా పండించాడని ప్రశంసించారు.

రివ్యూ ఇవ్వడమంటే

ఈ సినిమాకు నెగెటివ్ రివ్యూలు కాదు కదా అసలు రివ్యూ ఇవ్వడమంటే ఇండియన్ సినిమాను అవమానించినట్లేనని ఆర్జీవీ రాసుకొచ్చారు. ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ అందించిన మ్యూజిక్ విజువల్స్ ను డామినేట్ చేయకుండా కథలోని ఎమోషన్ ను ఎలివేట్ చేసిందని వర్మ అభినందించారు. ఈ సినిమా నిడివి ఎక్కువగా ఉండటం మైనస్ కాదని, రావణుడి స్థాయిని, రాముడి వనవాసాన్ని వివరంగా చూపించాలంటే ఆ సమయం అవసరమని విశ్లేషించారు.

నెగెటివ్ రివ్యూలు ఇచ్చే వారు ఒక పెద్ద పర్వతాన్ని చూసి దారి బాగాలేదని వంకలు పెడుతున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఇండియన్ సినిమాకు 'రామాయణ పార్ట్ 1' కొత్త స్టాండర్డ్స్ సెట్ చేసిందని, దీన్ని బీట్ చేయాలంటే అది కేవలం 'రామాయణ పార్ట్ 2' కే సాధ్యమని ఆర్జీవీ తన రివ్యూను ముగించారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks