Ramayana 4 Days Worldwide Collection: బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పౌరాణిక దృశ్యకావ్యం 'రామాయణ పార్ట్ 1' గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. విడుదలైన మొదటి రెండు రోజులు కాస్త నిలకడగా సాగిన బాక్సాఫీస్ ప్రయాణం, వీకెండ్ నాటికి ఒక్కసారిగా ఊపందుకుంది.
రామాయణం 4 డేస్ కలెక్షన్స్

దీపావళి పండగ సెలవులు తోడవడంతో శని, ఆదివారాల్లో ప్రేక్షకులు రామాయణం సినిమా థియేటర్లకు పోటెత్తారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే రామాయణ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 507 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
నెమ్మదించిన ఆరంభం.. ఊపందుకున్న వీకెండ్
నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మొదటి రోజు రూ. 128 కోట్ల గ్రాస్ రాబట్టింది. ప్రమోషన్ల స్థాయిలో పోలిస్తే మొదటి రోజు వసూళ్లు కొంతవరకు తక్కువగా ఉన్నాయనే ప్రచారం జరిగింది. యశ్ లాంటి పాన్-ఇండియా స్టార్ ఉన్నప్పటికీ కన్నడ వెర్షన్‌లో తొలిరోజు కేవలం రూ. 7.50 కోట్ల నెట్ కలెక్షన్లు మాత్రమే రావడం, ఓవర్సీస్‌లో దాదాపు 50,000 స్క్రీన్లలో విడుదల చేసినా 6 మిలియన్ డాలర్లు దాటకపోవడం కాస్త నిరాశ పరిచింది.
అయితే, ప్రేక్షకులలో వచ్చిన సానుకూల టాక్ సినిమాకు ప్రాణం పోసింది. శనివారం (నవంబర్ 7) భారీగా పుంజుకున్న రామాయణం సినిమా వసూళ్లు, ఆదివారం (నవంబర్ 8) నాటికి మరింత పెరిగాయి. దేశీయంగా నాలుగు రోజుల పొడిగించిన వీకెండ్‌లో రూ. 239 కోట్ల నెట్ (రూ. 285 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసింది రామాయణ్ చిత్రం.
ఓవర్సీస్‌లో ఘన విజయం
సోనీ పిక్చర్స్ సంస్థ అంతర్జాతీయంగా ఈ సినిమాను ఏకంగా 59,000 స్క్రీన్లలో అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేసింది. భారతీయ సినీ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఓవర్సీస్ రిలీజ్ కావడం గమనార్హం. ఉత్తర అమెరికాలో 12.2 మిలియన్ డాలర్లు రాబట్టగా, మిగిలిన అంతర్జాతీయ మార్కెట్లలో 11 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. దీంతో మొత్తంగా నాలుగు రోజుల్లో ఓవర్సీస్ నుంచి 23.7 మిలియన్ డాలర్లు (రూ. 200 కోట్లకు పైగా) ఖాతాలో పడ్డాయి.
'ఆదిపురుష్' లైఫ్‌టైమ్ రికార్డు నేలమట్టం
{{/usCountry}}సోనీ పిక్చర్స్ సంస్థ అంతర్జాతీయంగా ఈ సినిమాను ఏకంగా 59,000 స్క్రీన్లలో అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేసింది. భారతీయ సినీ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఓవర్సీస్ రిలీజ్ కావడం గమనార్హం. ఉత్తర అమెరికాలో 12.2 మిలియన్ డాలర్లు రాబట్టగా, మిగిలిన అంతర్జాతీయ మార్కెట్లలో 11 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. దీంతో మొత్తంగా నాలుగు రోజుల్లో ఓవర్సీస్ నుంచి 23.7 మిలియన్ డాలర్లు (రూ. 200 కోట్లకు పైగా) ఖాతాలో పడ్డాయి.
'ఆదిపురుష్' లైఫ్‌టైమ్ రికార్డు నేలమట్టం
{{/usCountry}}గతంలో రామాయణ ఇతివృత్తంతో వచ్చిన ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా తొలి మూడు రోజులు మంచి వసూళ్లు సాధించినప్పటికీ, నెగెటివ్ టాక్ కారణంగా నాలుగో రోజు దారుణంగా పడిపోయింది. రూ. 393 కోట్ల లైఫ్‌టైమ్ కలెక్షన్లతో ఆదిపురుష్ రన్ ముగిసింది.
అయితే, 'రామాయణ పార్ట్ 1' మాత్రం నాలుగో రోజైన ఆదివారం అద్భుతమైన హోల్డ్ చూపించి రూ. 500 కోట్ల క్లబ్‌లో చేరింది. ఆదిపురుష్ లైఫ్‌టైమ్ రికార్డును కేవలం నాలుగు రోజుల్లోనే తుడిచిపెట్టేసింది.
రెండో భాగానికి భారీ అంచనాలు
నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్‌ఈజీ (DNEG), యశ్‌కి చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మించాయి. శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, రావణాసురుడిగా యశ్, లక్ష్మణుడిగా రవి దూబే, మండోదరిగా కాజల్ అగర్వాల్, సూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కనుంది.
ఇప్పుడు మొదటి భాగానికి వస్తున్న ఆదరణ చూస్తుంటే, పండగ సెలవుల్లో మరిన్ని రికార్డులు బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సిరీస్‌లో రెండో భాగం 2028 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.