Ramayana Collection: ఒక్కసారిగా ఊపందుకున్న రామాయణం కలెక్షన్స్- 4 డేస్, 500 కోట్లు- ఆదిపురుష్ లైఫ్‌టైమ్ రికార్డు నేలమట్టం

Ramayana Box Office Collection Day 4: రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి నటించిన రామాయణం సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. నాలుగు రోజుల్లో రూ. 500 కోట్లు రాబట్టింది. తొలిరోజు దాటలేకపోయిన ప్రభాస్ ఆదిపురుష్ లైఫ్‌టైమ్ వసూళ్లను బద్దలుకొట్టి బాక్సాఫీస్ ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది.

Published on: Nov 9, 2026, 11:30:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Ramayana 4 Days Worldwide Collection: బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పౌరాణిక దృశ్యకావ్యం 'రామాయణ పార్ట్ 1' గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. విడుదలైన మొదటి రెండు రోజులు కాస్త నిలకడగా సాగిన బాక్సాఫీస్ ప్రయాణం, వీకెండ్ నాటికి ఒక్కసారిగా ఊపందుకుంది.

ఒక్కసారిగా ఊపందుకున్న రామాయణం కలెక్షన్స్- 4 డేస్, 500 కోట్లు- ఆదిపురుష్ లైఫ్‌టైమ్ రికార్డు నేలమట్టం
ఒక్కసారిగా ఊపందుకున్న రామాయణం కలెక్షన్స్- 4 డేస్, 500 కోట్లు- ఆదిపురుష్ లైఫ్‌టైమ్ రికార్డు నేలమట్టం

రామాయణం 4 డేస్ కలెక్షన్స్

దీపావళి పండగ సెలవులు తోడవడంతో శని, ఆదివారాల్లో ప్రేక్షకులు రామాయణం సినిమా థియేటర్లకు పోటెత్తారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే రామాయణ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 507 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.

నెమ్మదించిన ఆరంభం.. ఊపందుకున్న వీకెండ్

నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మొదటి రోజు రూ. 128 కోట్ల గ్రాస్ రాబట్టింది. ప్రమోషన్ల స్థాయిలో పోలిస్తే మొదటి రోజు వసూళ్లు కొంతవరకు తక్కువగా ఉన్నాయనే ప్రచారం జరిగింది. యశ్ లాంటి పాన్-ఇండియా స్టార్ ఉన్నప్పటికీ కన్నడ వెర్షన్‌లో తొలిరోజు కేవలం రూ. 7.50 కోట్ల నెట్ కలెక్షన్లు మాత్రమే రావడం, ఓవర్సీస్‌లో దాదాపు 50,000 స్క్రీన్లలో విడుదల చేసినా 6 మిలియన్ డాలర్లు దాటకపోవడం కాస్త నిరాశ పరిచింది.

అయితే, ప్రేక్షకులలో వచ్చిన సానుకూల టాక్ సినిమాకు ప్రాణం పోసింది. శనివారం (నవంబర్ 7) భారీగా పుంజుకున్న రామాయణం సినిమా వసూళ్లు, ఆదివారం (నవంబర్ 8) నాటికి మరింత పెరిగాయి. దేశీయంగా నాలుగు రోజుల పొడిగించిన వీకెండ్‌లో రూ. 239 కోట్ల నెట్ (రూ. 285 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసింది రామాయణ్ చిత్రం.

ఓవర్సీస్‌లో ఘన విజయం

సోనీ పిక్చర్స్ సంస్థ అంతర్జాతీయంగా ఈ సినిమాను ఏకంగా 59,000 స్క్రీన్లలో అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేసింది. భారతీయ సినీ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఓవర్సీస్ రిలీజ్ కావడం గమనార్హం. ఉత్తర అమెరికాలో 12.2 మిలియన్ డాలర్లు రాబట్టగా, మిగిలిన అంతర్జాతీయ మార్కెట్లలో 11 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. దీంతో మొత్తంగా నాలుగు రోజుల్లో ఓవర్సీస్ నుంచి 23.7 మిలియన్ డాలర్లు (రూ. 200 కోట్లకు పైగా) ఖాతాలో పడ్డాయి.

'ఆదిపురుష్' లైఫ్‌టైమ్ రికార్డు నేలమట్టం

గతంలో రామాయణ ఇతివృత్తంతో వచ్చిన ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా తొలి మూడు రోజులు మంచి వసూళ్లు సాధించినప్పటికీ, నెగెటివ్ టాక్ కారణంగా నాలుగో రోజు దారుణంగా పడిపోయింది. రూ. 393 కోట్ల లైఫ్‌టైమ్ కలెక్షన్లతో ఆదిపురుష్ రన్ ముగిసింది.

అయితే, 'రామాయణ పార్ట్ 1' మాత్రం నాలుగో రోజైన ఆదివారం అద్భుతమైన హోల్డ్ చూపించి రూ. 500 కోట్ల క్లబ్‌లో చేరింది. ఆదిపురుష్ లైఫ్‌టైమ్ రికార్డును కేవలం నాలుగు రోజుల్లోనే తుడిచిపెట్టేసింది.

రెండో భాగానికి భారీ అంచనాలు

నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్‌ఈజీ (DNEG), యశ్‌కి చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ భారీ చిత్రాన్ని నిర్మించాయి. శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, రావణాసురుడిగా యశ్, లక్ష్మణుడిగా రవి దూబే, మండోదరిగా కాజల్ అగర్వాల్, సూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కనుంది.

ఇప్పుడు మొదటి భాగానికి వస్తున్న ఆదరణ చూస్తుంటే, పండగ సెలవుల్లో మరిన్ని రికార్డులు బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సిరీస్‌లో రెండో భాగం 2028 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More