Ramayana 5 Days Worldwide Collection: భారతీయ చిత్రసీమలో మరో సంచలనం నమోదైంది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన దృశ్య కావ్య చిత్రం 'రామాయణం' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
సోమవారం రికార్డులు తిరగరాసిన రామాయణం

శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా దక్షిణాది భామ సాయి పల్లవి, రావణాసురుడిగా రాకింగ్ స్టార్ యశ్ నటించిన ఈ సినిమా ఐదో రోజైన సోమవారం (నవంబర్ 9) రికార్డులను తిరగరాసింది. దివాళీ పండుగ సెలవుల కంటిన్యూటీని పక్కాగా వాడుకుంటూ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేసింది.
సోమవారం ఒక్కరోజే రూ. 100 కోట్ల నెట్
నవంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన రామాయణం సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 128 కోట్ల గ్రాస్ వసూలు చేసి మంచి బోణీ కొట్టింది. నాలుగు రోజుల ఓపెనింగ్ వీకెండ్ ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్ల మార్కును అందుకంది.
దాదాపు రూ. 1600 కోట్ల నుంచి రూ. 2000 కోట్ల అపారమైన నిర్మాణ వ్యయంతో రూపుదిద్దుకున్న రామాయణం సినిమాకు వీకెండ్ వసూళ్లు కొంత సాధారణంగానే అనిపించినా, సోమవారం మాత్రం ఊహించని స్థాయిలో టికెట్లు అమ్ముడయ్యాయి.
భారత్‌లో ఒక్క సోమవారమే రూ. 107.50 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. హిందీ సినిమా చరిత్రలో ఒకే రోజు వంద కోట్ల నెట్ సాధించిన రెండో చిత్రంగా రికార్డుకెక్కింది రామాయణ సినిమా. దీంతో దేశీయంగా ఐదు రోజుల్లో నెట్ కలెక్షన్స్ రూ. 346 కోట్లకు (గ్రాస్ రూ. 413 కోట్లు) చేరాయి.
బాహుబలి-1, జైలర్ రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి
ప్రపంచవ్యాప్తంగా ఐదు రోజుల్లో రూ. 663 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన 'రామాయణం', ఆల్-టైమ్ హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ సినిమాల జాబితాలో ఒకే రోజు 13 స్థానాలు ఎగబాకి టాప్-25లోకి ప్రవేశించింది.
{{/usCountry}}ప్రపంచవ్యాప్తంగా ఐదు రోజుల్లో రూ. 663 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిన 'రామాయణం', ఆల్-టైమ్ హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ సినిమాల జాబితాలో ఒకే రోజు 13 స్థానాలు ఎగబాకి టాప్-25లోకి ప్రవేశించింది.
{{/usCountry}}ఈ క్రమంలో భారతీయ సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిన ఎస్.ఎస్. రాజమౌళి 'బాహుబలి: ది బిగినింగ్' (రూ. 650 కోట్లు), రజినీకాంత్ 'జైలర్' (రూ. 605 కోట్లు), సల్మాన్ ఖాన్ 'సుల్తాన్' (రూ. 621 కోట్లు) వంటి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ చిత్రాల లైఫ్‌టైమ్ కలెక్షన్లను ఐదే ఐదు రోజుల్లో దాటేసింది. అంతకుముందు 'ఆదిపురుష్' వసూళ్లను దివాళీ రోజునే వెనక్కి నెట్టిన సంగతి తెలిసిందే.
ఓవర్సీస్లోనూ ఊపు.. 2028లో రెండో భాగం
అంతర్జాతీయంగా సోనీ పిక్చర్స్ సంస్థ ఏకంగా 59,000 స్క్రీన్లలో ఈ చిత్రాన్ని విడుదల చేసింది. ఇది మన భారతీయ సినిమా చరిత్రలోనే అతిపెద్ద ఓవర్సీస్ రిలీజ్. ఉత్తర అమెరికాలో 12.2 మిలియన్ డాలర్లు, ఇతర దేశాల్లో 11 మిలియన్ డాలర్లకు పైగా రాబట్టిన ఈ చిత్రం, ప్రస్తుతం విదేశీ మార్కెట్లలో మొత్తం 26.7 మిలియన్ డాలర్ల (రూ. 220 కోట్లకు పైగా) కలెక్షన్లతో దూసుకెళ్తోంది.
నమిత్ మల్హోత్రా ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, డీఎన్ఈజి (DNEG), యశ్‌కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా రెండు భాగాలుగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో లక్ష్మణుడిగా రవి దూబే అలరించారు. మొదటి భాగం ఇప్పుడు థియేటర్లను ఊపేస్తుండగా, రెండో భాగాన్ని 2028 దివాళి కానుకగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.