...
...
Next Story

Ramayana: రావణ-జటాయువు యుద్ధం సీన్‌కి ఆరున్నరేళ్లు పట్టింది, పుష్పక విమానానికి 50 డిజైన్లు-రామాయణ దర్శకుడు నితేశ్ తివారీ

Ramayana Director Nitesh Tiwari On Ravana Jatayu Fight Scene: పౌరాణిక దృశ్యకావ్యం 'రామాయణం' విజువల్ ఎఫెక్ట్స్‌పై దర్శకుడు నితేశ్ తివారీ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రావణాసురుడు-జటాయువు పోరాట ఘట్టానికి ఆరేళ్లన్నర టైమ్ పట్టగా, పుష్పక విమానం డిజైన్ కోసం రెండు సంవత్సరాలు శ్రమించినట్లు తెలిపారు.

Published on: Nov 2, 2026, 06:03:41 IST
Advertisement

Ramayana Director Nitesh Tiwari On Ravana Jatayu Fight Scene: భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్, అత్యాధునిక సాంకేతికతతో తెరకెక్కుతున్న అరుదైన ఎపిక్ డ్రామా 'రామాయణం'. 'దంగల్' వంటి ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ అందించిన దర్శకుడు నితేశ్ తివారీ ఈ పౌరాణిక ఘట్టాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు.

విజువల్ ఎఫెక్ట్స్ వెనుక ఉన్న కష్టం

రావణ-జటాయువు యుద్ధం సీన్‌కి ఆరున్నరేళ్లు పట్టింది, పుష్పక విమానానికి 50 డిజైన్లు-రామాయణ దర్శకుడు నితేశ్ తివారీ
రావణ-జటాయువు యుద్ధం సీన్‌కి ఆరున్నరేళ్లు పట్టింది, పుష్పక విమానానికి 50 డిజైన్లు-రామాయణ దర్శకుడు నితేశ్ తివారీ

రామాయణ పార్ట్ 1 సినిమా నిర్మాణంలో పడుతున్న శ్రమను, విజువల్ ఎఫెక్ట్స్ వెనుక ఉన్న కష్టాన్ని ఇటీవల శ్రేయాస్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ నితేశ్ తివారీ పంచుకున్నారు. ఒక్క యాక్షన్ సీక్వెన్స్ పూర్తి చేయడానికే ఏళ్ల తరబడి కష్టపడాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

జటాయువు పోరాటానికి ఆరేళ్లన్నర సమయం!

రామాయణంలో రావణాసురుడు సీతను అపహరించి తీసుకెళ్లే సమయంలో జటాయువు అడ్డుపడే ఘట్టం అత్యంత కీలకమైనది. ఈ ఘట్టాన్ని తెరపై చూపించడానికి చిత్రబృందం ఏకంగా ఆరున్నర ఏళ్ల పాటు శ్రమించింది. తొలిసారి ఆర్టిస్టుకు కాన్సెప్ట్ వివరించినప్పటి నుంచి ఫైనల్ అవుట్‌పుట్ వచ్చే వరకు వేలాది మంది సాంకేతిక నిపుణులు దీనిపై రాత్రింబవళ్లు పనిచేశారు.

"ఒక్క రావణ-జటాయువు యుద్ధ సన్నివేశాన్ని పూర్తి చేయడానికి మాకు ఆరేళ్లన్నర కాలం పట్టింది. సున్నా నుంచి ప్రతి అంశాన్ని సృష్టించడానికి ఎంత కష్టం కలిగిందో చెప్పడానికి గంటల సమయం కూడా సరిపోదు" అని నితేశ్ తివారీ వెల్లడించారు. కథలోని భావోద్వేగాలను, ఆనాటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఈ దృశ్యాన్ని తీర్చిదిద్దినట్లు ఆయన చెప్పారు.

పుష్పక విమానానికి 50 డిజైన్లు.. వెనుక ఉన్న విజ్ఞానం

రామాయణ సినిమాలో రావణాసురుడి వాహనమైన 'పుష్పక విమానం' రూపకల్పన కూడా విశేషంగా నిలిచింది. కేవలం ఈ విమానం డిజైన్ ఫైనల్ చేయడానికే దాదాపు రెండేళ్ల సమయం పట్టింది. సైన్స్, లాజిక్‌లకు అద్దం పట్టేలా సుమారు 40 నుంచి 50 డిజైన్లను పరిశీలించిన తర్వాతే ఆఖరి లుక్‌ను ఓకే చేశారు.

ఇదిలా ఉంటే, గ్రాఫిక్స్ పనులపై వస్తున్న విమర్శలపై హీరో రణ్‌బీర్ కపూర్ ఘాటుగా స్పందించారు. సినిమాలో కనిపించే భారీ సీజీఐ (CGI) వర్క్‌ను కొందరు ఏఐ (AI) ద్వారా తయారు చేశారని కొట్టిపారేయడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వేలాది మంది విజువల్ ఎఫెక్ట్స్ కళాకారులు పగలనక, రేయనక శ్రమించి ఒక్కో ఫ్రేమ్‌ను మలిచినప్పుడు, దానిని ఏఐ వర్క్ అనడం వారి కష్టాన్ని తక్కువ చేయడమే అవుతుందని రణ్‌బీర్ కపూర్ వ్యాఖ్యానించారు. "నటీనటుల నటనకు ఎంత ప్రాధాన్యం ఉందో, వెండితెరపై అద్భుతాలు సృష్టించే సీజీఐ ఆర్టిస్టుల కష్టానికి కూడా అంతే గుర్తింపు దక్కాలి" అని రణ్‌బీర్ అభిప్రాయపడ్డారు.

నటీనటులు, విడుదల తేదీల వివరాలు

ఇకపోతే రామాయణ సినిమాలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతాదేవిగా సౌత్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి, రావణాసురుడిగా కన్నడ రాకింగ్ స్టార్ యశ్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రపంచవ్యాప్తంగా తీసుకురానున్నారు. రామాయణ మొదటి భాగాన్ని 2026 దీపావళి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుండగా, రెండో భాగాన్ని 2027 లేదా 2028లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks