Ramayana Bookings: 'రామాయణ' మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కు టైమ్ దగ్గర పడింది. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, రాకింగ్ స్టార్ యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ బిగ్గెస్ట్ విజువల్ వండర్ ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 5న దీపావళి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తీసుకున్న ఒక సంచలనాత్మక నిర్ణయం ప్రస్తుతం భారతీయ సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

విదేశాల్లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించి రికార్డు స్థాయి కలెక్షన్లు రాబడుతుండగా, రేపటి నుంచి (అక్టోబర్ 20) ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అధికారికంగా ఓపెన్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. సినిమా విడుదలకు ఇంకా పదిరోజులకు పైగా సమయం ఉండగానే ఇండియాలో టికెట్ విక్రయాలు ప్రారంభించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇండియాలో బాక్సాఫీస్ రికార్డుల వేట షురూ
సాధారణంగా భారతీయ చిత్ర పరిశ్రమలో, ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలకు విడుదలకు ఒక వారం లేదా ఐదు రోజుల ముందు మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తారు. కానీ 'రామాయణ' టీమ్ విదేశీ మార్కెట్ తరహాలోనే ఇండియాలోనూ ఎంతో ముందుగా బుకింగ్స్ ఓపెన్ చేసి బాక్సాఫీస్ వేటను ప్రారంభించింది.
ఈ రకమైన పక్కా వ్యూహాత్మక ప్లానింగ్‌పై నెటిజన్లు, సినీ ప్రియులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమాపై ఉన్న అపారమైన నమ్మకమే మేకర్స్ ఇంత ముందస్తుగా టికెట్లు అందుబాటులోకి తేవడానికి కారణమని విశ్లేషిస్తున్నారు.
టాలీవుడ్‌కు సరికొత్త పాఠం.. మేకర్స్ ప్లానింగ్‌పై నెటిజన్లు ఫిదా
ఈ ముందస్తు అడ్వాన్స్ బుకింగ్స్ ప్లానింగ్ టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. సాధారణంగా తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హీరోల సినిమాలు వస్తున్నా కూడా.. విడుదలకు కేవలం రెండు మూడు రోజుల ముందు వరకు టికెట్ బుకింగ్స్ ఓపెన్ కావు. థియేటర్ల ఒప్పందాలు, బెనిఫిట్ షోల అనుమతులు, టికెట్ ధరల పెంపు నిర్ణయాలు చివరి నిమిషం వరకు పెండింగ్‌లో ఉండటంతో బుకింగ్స్ ఆలస్యమవుతుంటాయి.
దీనివల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే అభిమానులు, ముందస్తుగా ప్లాన్ చేసుకునే కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారని, ఇది ఓపెనింగ్ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలుగు ప్రేక్షకులు ఎప్పటినుంచో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే టాలీవుడ్ నిర్మాతలు కూడా 'రామాయణ' టీమ్‌ని చూసి నేర్చుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
'ధురంధర్' నుంచి 'రామాయణ' వరకు.. మారిన ట్రెండ్
{{/usCountry}}దీనివల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే అభిమానులు, ముందస్తుగా ప్లాన్ చేసుకునే కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారని, ఇది ఓపెనింగ్ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలుగు ప్రేక్షకులు ఎప్పటినుంచో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే టాలీవుడ్ నిర్మాతలు కూడా 'రామాయణ' టీమ్‌ని చూసి నేర్చుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
'ధురంధర్' నుంచి 'రామాయణ' వరకు.. మారిన ట్రెండ్
{{/usCountry}}గతంలో 'ధురంధర్: ది రివెంజ్' (Dhurandhar: The Revenge) మేకర్స్ కూడా ట్రైలర్ విడుదలైన వెంటనే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. ఇప్పుడు 'రామాయణ' మేకర్స్ అంతకంటే ఒక అడుగు ముందుకు వేసి విదేశాలు, స్వదేశం రెండింటిలోనూ రికార్డు స్థాయిలో ఎంతో ముందే టికెట్లను అందుబాటులోకి తెచ్చారు.
విదేశీ మార్కెట్‌తో పాటు దేశీయ మార్కెట్లోనూ ఒకే రకమైన హడావుడి సృష్టించడం వాళ్ల లక్ష్యంగా కనిపిస్తోంది. ముందస్తు బుకింగ్స్ ద్వారానే మొదటి రోజు సరికొత్త ఆల్-టైమ్ ఓపెనింగ్ రికార్డులను నెలకొల్పాలనే వ్యూహం కూడా ఉంది. పక్కా ప్లానింగ్‌తో వస్తున్న మేకర్స్‌కు సినిమా ప్రేమికుల నుంచి అపూర్వ మద్దతు లభిస్తోంది.
రూ.4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం దీపావళి రేసులో బాక్సాఫీస్‌ను ఏ స్థాయిలో శాసిస్తుందో చూడాలి. ఏది ఏమైనా, 'రామాయణ' తెచ్చిన ఈ కొత్త అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ భవిష్యత్తులో దక్షిణాది చిత్ర పరిశ్రమల విడుదల వ్యూహాలను కచ్చితంగా మార్చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.