Ramayana Collections: విజువల్ వండర్ ‘రామాయణం పార్ట్ 1’ కలెక్షన్ల మోత మోగుతూనే ఉంది. రికార్డులు బ్రేక్ అవుతూనే ఉన్నాయి. సరికొత్త హిస్టరీ క్రియేట్ అవుతూనే ఉంది. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రం రెండో వీకెండ్లోనూ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. జవాన్, పఠాన్, యానిమల్, స్త్రీ 2 లాంటి బ్లాక్బస్టర్ల లైఫ్ టైమ్ కలెక్షన్లను అవలీలగా దాటేసింది.
సెకండ్ సండే రికార్డు

రామాయణం మూవీ బాక్సాఫీస్ దగ్గర తన ప్రభంజనాన్ని కొనసాగిస్తోంది. ఈ సినిమా సెకండ్ వీకెండ్ లోనూ అదరగొట్టింది. ఈ ఆదివారం (నవంబర్ 15) రామాయణం మూవీ ఇండియాలో ఏకంగా రూ.75 కోట్లను ఖాతాలో వేసుకుందని సాక్నిల్క్ తెలిపింది. శనివారం (రూ.72.90 కోట్లు) కంటే కలెక్షన్లు పెరిగాయి.
ధురంధర్ 2 వెనక్కి
సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చిన సెకండ్ సండే రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా రామాయణం నిలిచింది. ధురంధర్ 2 రికార్డును బ్రేక్ చేసింది. ధురంధర్ 2 మూవీ సెకండ్ సండే రూ.68 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు రామాయణం రూ.75 కోట్లు ఖాతాలో వేసుకొని ఆల్ టైమ్ రికార్డును అందుకుంది.
ఆ సినిమాలు కూడా
రామాయణం మూవీ దూకుడుకు పెద్ద పెద్ద సినిమాల రికార్డులు గల్లంతవుతున్నాయి. ఈ సినిమా ఇండియాలో ఇప్పటివరకూ రూ.760.60 కోట్ల నెట్ కలెక్షన్లు సొంతం చేసుకుంది. షారుఖ్ ఖాన్ 'జవాన్' (రూ.643.87 కోట్లు), రాజ్‌కుమార్ రావ్ 'స్త్రీ 2' (రూ.625.27 కోట్లు), విక్కీ కౌశల్ 'ఛావా' (రూ.601.57 కోట్లు), షారుఖ్ ఖాన్ 'పఠాన్' (రూ.544.28 కోట్లు), రణ్‌బీర్ కపూర్ గత చిత్రం 'యానిమల్' (రూ.556.36 కోట్లు) జీవితకాల వసూళ్ల రికార్డులన్నీ రామాయణం సునామీకి కొట్టుకుపోయాయి.
రామాయణం దండయాత్ర
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి, రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'రామాయణం' మూవీ థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీపావళి సెలవులు ముగిసినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా జోరు ఏమాత్రం తగ్గలేదు. ఫ్యామిలీలతో ఆడియన్స్ థియేటర్లుకు పోటెత్తుతుండటం విశేషం.
{{/usCountry}}బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి, రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'రామాయణం' మూవీ థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీపావళి సెలవులు ముగిసినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా జోరు ఏమాత్రం తగ్గలేదు. ఫ్యామిలీలతో ఆడియన్స్ థియేటర్లుకు పోటెత్తుతుండటం విశేషం.
{{/usCountry}}ప్రేక్షకుల నుంచి వస్తున్న అనూహ్య స్పందనతో రెండవ వారాంతంలో ఈ చిత్రం సరికొత్త మైలురాయిని చేరుకుంది. ముఖ్యంగా రెండో ఆదివారం ఈ సినిమా నమోదు చేసిన వసూళ్లు బాలీవుడ్ చరిత్రలోనే సరికొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేశాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా రామాయణం మూవీ వసూళ్లు రూ.1300 కోట్లకు చేరాయని సమాచారం.