...
...
Next Story

Ramayana Collections: కలెక్షన్ల ఊచకోత-వీక్ డేలోనూ రామాయణం బాక్సాఫీస్ విధ్వంసం-మంగళవారం అన్ని కోట్లా? రికార్డులు బ్రేక్!

Ramayana Collections: ఇది మామూలు దండయాత్ర కాదు. రికార్డులు బ్రేక్ చేస్తూ.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తూ రామాయణం పార్ట్ 1 మూవీ కలెక్షన్ల సునామీని చూపిస్తోంది. వీకెండ్ సంగతి పక్కనపడితే వీక్ డేస్ లోనూ ఈ సినిమా వసూళ్ల మోత మోగిస్తోంది. మంగళవారం రికార్డు స్థాయిలో 112.60 కోట్లు కొల్లగొట్టింది.

Published on: Nov 11, 2026, 11:07:25 IST
Advertisement

Ramayana Collections: ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ.. పాత రికార్డుల దుమ్ము దులుపుతూ ‘రామాయణం: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్’ మూవీ దూసుకెళ్తోంది. బాక్సాఫీస్ దగ్గర రామాయణం 1 కలెక్షన్ల మోత మోగిస్తోంది. వీక్ డేస్ లోనూ అదరగొడుతోంది. 6 రోజుల్లోనే ఈ చిత్రం రూ.800 కోట్ల గ్రాస్ ను దాటేసింది.

రామాయణం కలెక్షన్లు

కలెక్షన్ల ఊచకోత-వీక్ డేలోనూ రామాయణం బాక్సాఫీస్ విధ్వంసం-మంగళవారం అన్ని కోట్లా? రికార్డులు బ్రేక్!
కలెక్షన్ల ఊచకోత-వీక్ డేలోనూ రామాయణం బాక్సాఫీస్ విధ్వంసం-మంగళవారం అన్ని కోట్లా? రికార్డులు బ్రేక్!

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం కేవలం ఆరు రోజుల్లోనే ఈ రామాయణం సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.823.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఈ వసూళ్లు ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇందులో విదేశీ మార్కెట్ల నుంచే రూ.297 కోట్ల గ్రాస్ రావడం విశేషం.

ఆరో రోజు ఇలా

ఇండియన్ మార్కెట్లో 'రామాయణం' జైత్రయాత్ర ఏమాత్రం తగ్గడం లేదు. ఆరో రోజైన మంగళవారం (నవంబర్ 10) కూడా ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తారు. దేశవ్యాప్తంగా 6వ రోజు రూ. 94.10 కోట్ల నెట్ (గ్రాస్ రూ.112.60 కోట్లు) వసూలు చేసింది. దీంతో దేశీయంగా మొత్తం నెట్ కలెక్షన్లు రూ.440.45 కోట్లకు చేరుకోగా, ఇండియా గ్రాస్ రూ.526.50 కోట్లను తాకింది.

హిందీలో ఎక్కువ

భాషల వారీగా చూస్తే.. 6వ రోజు హిందీ వెర్షన్ అత్యధికంగా రూ.76 కోట్లు రాబట్టింది. ఆ తర్వాత కన్నడలో రూ.7.75 కోట్లు, తెలుగులో రూ.4 కోట్లు, తమిళంలో రూ.3.60 కోట్లు, మలయాళంలో రూ.2.75 కోట్లు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా సుమారు 24 వేలకు పైగా షోలతో ఈ వసూళ్లు రావడం మరో విశేషం.

మొత్తం వసూళ్లు

రెండో రోజు: రూ.57.30 కోట్లు

మూడో రోజు: రూ.83.45 కోట్లు

నాలుగో రోజు: రూ.66.95 కోట్లు

ఐదో రోజు: రూ.128.70 కోట్లు

ఆరో రోజు: రూ.112.60 కోట్లు

మొత్తం ఇండియా గ్రాస్: రూ. 526.50 కోట్లు

నార్త్ అమెరికాలో రికార్డు

ఓవర్సీస్‌లోనూ 'రామాయణం' దూకుడు కొనసాగుతోంది. అంతర్జాతీయంగా తీవ్ర పోటీ ఉన్నప్పటికీ, నార్త్ అమెరికాలో మొదటి సోమవారమే 1.37 మిలియన్ డాలర్లు రాబట్టి సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది. దంగల్, డంకీ వంటి భారీ చిత్రాల హాలిడే వసూళ్లను సైతం అధిగమించింది. గతంలో ఉన్న రికార్డుల కంటే 20.2% అధిక వసూళ్లను సాధించి తన సత్తా చాటింది.

మరోవైపు ఆరో రోజు వసూళ్ల వేగంలో గత రికార్డులను దాటేస్తూ దూసుకుపోతోంది. బుక్‌మైషోలో సైతం గంటకు ఏకంగా 95 వేల నుంచి 1.40 లక్షల వరకు టికెట్లు అమ్ముడవుతూ పోస్ట్-పాండమిక్ రికార్డులను ఈ సినిమా తిరగరాస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks