Ramayana Part 1 Twitter Review: థియేటర్లలో రిలీజైన ‘రామాయణం పార్ట్ 1’ మూవీపై నెటిజన్ల నుంచి మిక్స్ డ్ టాక్ వినిపిస్తోంది. రామాయణం కథ మనందరికీ తెలిసిందే అయినప్పటికీ, దర్శకుడు ఈ కథను ప్రెజెంట్ చేసిన విధానం, విజువల్స్ ప్రేక్షకులను అబ్బురపరుస్తున్నాయని టాక్. 3D ఎక్స్ పీరియన్స్, అద్భుతమైన వీఎఫ్ఎక్స్ (VFX) పనితీరు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.
యశ్ 'రావణ' విశ్వరూపం

రామాయణం సినిమా చూసిన ప్రతి ఒక్కరూ రాకింగ్ స్టార్ యశ్ గురించే మాట్లాడుకుంటున్నారు. రావణాసురుడి పాత్రలో యశ్ నటన సినిమాకే హైలైట్ గా నిలిచిందని ట్విట్టర్ రివ్యూ టాక్. స్క్రీన్ ప్రెజెన్స్, బాడీ లాంగ్వేజ్ తో యశ్ వన్ మ్యాన్ షో చేశాడని చెబుతున్నారు. రావణుడి పది తలలు మాట్లాడే సన్నివేశం గూస్ బంప్స్ తెప్పిస్తుందని అంటున్నారు.
రణ్‌బీర్ కపూర్ , సాయి పల్లవి ఎలా చేశారంటే?
శ్రీరాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ కపూర్ చాలా ప్రశాంతంగా, హుందాగా కనిపించాడు. రాముడికి ఉండాల్సిన ధైర్యం, విలువలని రణ్‌బీర్ కపూర్ పర్ఫెక్ట్ గా తెరపై చూపించాడు. శివ ధనుస్సు విరిచే సన్నివేశం హైలైట్ గా నిలిచింది. ఇక సీతమ్మగా సాయి పల్లవి తనదైన ఎమోషనల్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు సైతం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఇదొక విజువల్ ట్రీట్ అని, రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి అద్భుతంగా నటించారని, యశ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడని ప్రశంసించారు.
ఆ ఎమోషన్ మిస్సింగ్!
అయితే కొంతమంది నెటిజన్లు రామాయణం మూవీపై నెగెటివ్ గానూ రియాక్టవుతున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉన్నప్పటికీ, సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి కథనం కాస్త నెమ్మదించిందని నెటిజన్లు చెబుతున్నారు. డ్రామా ఎక్కువగా ఉండటం వల్ల కొంత సాగదీసిన ఫీలింగ్ కలుగుతుందట. అలాగే రాముడు, సీత మధ్య ఉండాల్సిన డివైన్ ఆరా, బలమైన ఎమోషనల్ కనెక్షన్ తెరపై పూర్తిగా వర్కౌట్ కాలేదని కొందరు పెదవి విరుస్తున్నారు.
మ్యూజిక్ అండ్ బీజీఎమ్
{{/usCountry}}అయితే కొంతమంది నెటిజన్లు రామాయణం మూవీపై నెగెటివ్ గానూ రియాక్టవుతున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉన్నప్పటికీ, సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి కథనం కాస్త నెమ్మదించిందని నెటిజన్లు చెబుతున్నారు. డ్రామా ఎక్కువగా ఉండటం వల్ల కొంత సాగదీసిన ఫీలింగ్ కలుగుతుందట. అలాగే రాముడు, సీత మధ్య ఉండాల్సిన డివైన్ ఆరా, బలమైన ఎమోషనల్ కనెక్షన్ తెరపై పూర్తిగా వర్కౌట్ కాలేదని కొందరు పెదవి విరుస్తున్నారు.
మ్యూజిక్ అండ్ బీజీఎమ్
{{/usCountry}}ఏ.ఆర్. రెహమాన్, హన్స్ జిమ్మర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని సీన్స్ లో బీజీఎమ్ ఇంటర్నేషనల్ స్థాయిలో అదిరిపోయినా, మరికొన్ని కీలక సన్నివేశాల్లో తేలిపోయిందని చెబుతున్నారు.
ఫైనల్ గా ట్విట్టర్ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే 'రామాయణ: పార్ట్ 1' అనేది ఒక గ్రాండ్ విజువల్ స్పెక్టాకిల్. కొన్ని చోట్ల నెమ్మదించిన కథనం, ఎమోషన్స్ మిస్ అయినప్పటికీ.. అద్భుతమైన విజువల్స్, యశ్ - రణ్‌బీర్ కపూర్ నటన కోసం ఈ సినిమాను థియేటర్లలో కచ్చితంగా ఒక్కసారైనా చూడొచ్చని మెజారిటీ నెటిజన్లు రివ్యూలు ఇస్తున్నారు. కొత్త తరానికి మన పురాణాలను పరిచయం చేయడానికి ఇదొక బెస్ట్ అప్ గ్రేడ్ మూవీ అని చెప్పాలి.